![Priyanka Chopra and Nick Jonas Dance at her brother baraat Ceremony](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/jonas.jpg.webp?itok=bkvpVswv)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పెళ్లి వేడుకలతో బిజీగా ఉన్నారు. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా గ్రాండ్ వెడ్డింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మెహందీ వేడుకల్లో తన ముద్దుల కూతురు మాల్టీ మేరీకో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. తాజాగా ఇవాళ జరిగిన బరాత్ వేడుకల్లో తన భర్త, సింగర్ నిక్ జోనాస్‌లో కలిసి సందడి చేసింది. బాలీవుడ్ సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ కనిపించింది.ఈ వేడుకల్లో ప్రియాంక నీలిరంగు లెహంగాలో అందంగా కనిపించగా.. నిక్ జోనాస్ తెల్లటి షేర్వానీ ధరించి భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు.
అంతకుముందు జరిగిన సంగీత్ వేడుకల్లో నిక్ జోనాస్ పాట పాడారు. ఈ వీడియోను ప్రియాంక చోప్రా ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ బామర్ది పెళ్లిలో బావ అద్భుతమైన ఫర్మామెన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా.. తన ప్రియురాలు, నటి నీలం ఉపాధ్యాయను పెళ్లాడనున్నారు.
మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..
రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తోన్న అడ్వంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోందియ ఇటీవల హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని.. నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే మరో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment