baraat
-
అనంత్ అంబానీ పెళ్లి.. నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టిన స్టార్ హీరో!
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తనయుు అనంత్ అంబానీ పెళ్లి ముంబయిలో అత్యంత వైభవంగా జరిగింది. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జూలై 12న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లిలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలువురు ప్రముఖ సినీతారలు సందడి చేశారు. నగరంలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుకకు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేశ్ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు కూడా హాజరైన నూతన వధువరూలను ఆశీర్వదించారు.అయితే ఈ పెళ్లిలో జరిగిన బరాత్‌లో బాలీవుడ్ హీరో, దీపికా పదుకొణె భర్త రణ్వీర్ సింగ్ సందడి చేశారు. అర్జున్ కపూర్, వీర్ పహారియాతో కలిసి స్టెప్పులు వేశారు. నాగిని డ్యాన్స్ చేస్తూ రణ్వీర్ సింగ్ అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by PopDiaries Spotlight (@popdiaries.bollywood) -
జోరు వానలోనూ.. వాళ్ల డెడికేషన్‌కు అంతా ఫిదా!
వైరల్: పెళ్లంటే.. మామూలు హడావిడి ఉండదు మన దేశంలో. బారాత్‌లు, ఊరేగింపుల కోసం ప్రిపరేషన్లు కూడా ముందు నుంచే ఉంటాయి కూడా. మరి ఆ జోష్‌ను దెబ్బ తీసే పరిస్థితులు ఎదురైతే!. భారీగా జోరు వాన కురుస్తుండడంతో ఆ పెళ్లి వేడుకలు నీరుగారినట్లే అని అంతా భావించారు. కానీ, చుట్టాలు ఎవరూ తగ్గలేదు. అంత వానలోనూ పైన పెద్ద టార్ఫలిన్ పట్టాను కప్పేసుకుని మరీ బారాత్‌ను నిర్వహించారు వాళ్లు. వానలోనే తడుస్తూ.. చిందులేసిన వాళ్లు కొందరైతే.. ఆ కవర్ కింద నిల్చుని వేడుకలను వీక్షిస్తూ వెంట నడిచిన వాళ్లు మరికొందరు. వీళ్ల డెడికేషన్‌కు ఇంటర్నెట్ ఫిదా అయిపోయింది. అందుకే వీడియో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఊరేగింపు చోటు చేసుకుందని తెలుస్తోంది. This called pure #dedication #Barat #Indore 😂🤣 pic.twitter.com/0AyZxVzRE2 — शैलेंद्र यादव (@ShailenderYadu) July 6, 2022 -
Nagin Dance: కటకటాల వెనక్కి నెట్టిన ‘నాగిని డ్యాన్స్’
బారాత్ అనే పేరు వింటే చాలూ.. పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు కొందరు. చుక్కపడిందంటే చాలూ.. సోయి మరిచి చిందులేస్తుంటారు మరికొందరు. అందునా నాగిని డ్యాన్స్‌ను ఉన్న క్రేజే వేరు. కానీ, ఇక్కడ నాగిని డ్యాన్స్ చేసి కటకటాల పాలయ్యారు. అయ్యో.. అంతమాత్రానికేనా అనుకోకండి. నాగిని డ్యాన్స్ కోసం నిజంగానే పామును పట్టుకొచ్చారు వాళ్లు. ఒడిషాలోని మయూర్‌భంజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుక కోసం నాగుపామును తీసుకొచ్చి.. నాగిని డ్యాన్స్ పేరిట ఆడించడం మొదలుపెట్టారు. పాములు పట్టే వ్యక్తి దానిని ఆడిస్తుంటే.. వందల మంది చుట్టూ చేరి ఆ రియల్ నాగిని డ్యాన్స్‌ను చూస్తూ ఉండిపోయారు. బుట్టలో పాము.. చెవ్వులు పగిలిపోయే మ్యూజిక్, నృత్యాల కోలాహలంతో బారాత్‌లో ఆ నాగిని డ్యాన్స్ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. మరి అధికారులు ఊరుకుంటారా? వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఐదుగురు అరెస్ట్ చేసి, ఆ పామును ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. జనాల మధ్య అలా పామును ఆడించడం దుర్మార్గం. బుట్టలోంచి అది పొరపాటున కింద పడితే జనాల ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి, ఇలాంటి ఫీట్లు చేయొద్దంటూ హెచ్చరిస్తున్నారు కొందరు. -
పెళ్లిళ్లలో దావత్, బరాత్ బంద్.. ఉల్లంఘిస్తే భారీ ఫైన్
పెళ్లిళ్లలో దావత్‌లు, ధూమ్‌ధామ్ డ్యాన్సుల బరాత్‌లు సర్వసాధారణం. ఇందుకు ఎవరూ అతీతులు కారు. ప్రత్యేకించి కరోనా టైంలోనూ వీటిని వీడడం లేదు జనాలు. అలాంటిది వీటిని అనవసర ఖర్చుల కింద భావించిన ఓ ఊరు.. వాటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లోని బన్స్వరా పరిధిలోని గోడీ తేజ్‌పూర్ గ్రామం. తాజాగా పెళ్లిళ్లలో మందు, డీజే, బరాత్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటి వల్లే వేడుకల్లో విషాదాలు, గొడవలు జరుగుతున్నాయని, అంతేకాదు వాటి వల్ల ఇరుకుటుంబాలు, బంధువులు ఇబ్బందులు పడుతున్నారని, వాటికి ఖర్చు చేసేది అనవసరమైన ఖర్చుగా పేర్కొంటున్నారు ఆ గ్రామ పెద్దలు. ఈ మేరకు నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి వివాహ వేడుకల్లో ఈ రూల్‌ను ఉల్లంఘించిన వాళ్లకు.. మద్యం సేవిస్తే 21,000రూ., డీజే, నృత్యాలు చేస్తే 51 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. ఆ ఊరి మాజీ, ప్రస్తుత సర్పంచ్ల సమక్షంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. మొత్తం 13 వార్డ్ మెంబర్స్, జిల్లా పరిషత్, పంచాయితీ సమితి సభ్యులు, గ్రామస్తులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. సర్వ సమాజ్ పేరుతో ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గ్రామస్థులందరితో రిజిస్టర్లో సంతకాలు తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించిన కాపీ నకలును ధన్పూర్ పోలీసులకు సైతం అందించారు. సోషల్ మీడియాలో ఈ గ్రామ నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతోంది. -
పెళ్లి బరాత్.. అంతలో సడన్‌గా పోలీసుల ఎంట్రీ !
సాక్షి, సనత్‌నగర్(హైదరాబాద్): సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోతీనగర్‌లో శుక్రవారం తెల్లవారుఝామున నిర్వహించిన పెళ్లి బరాత్ (ఊరేగింపు) కలకలం సృష్టించింది. ఎటువంటి అనుమతి లేకుండా ఊరేగింపు నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మోతీనగర్‌కు చెందిన ఉదయ్‌కృష్ణ వివాహం గురువారం నిర్మల్‌లో జరిగింది. పెళ్లికూతురితో కలిసి మోతీనగర్‌కు చేరుకున్న ఉదయ్ కృష్ణకు బంధుమిత్రులు బరాత్ నిర్వహించారు. తెల్లవారుఝామున పెళ్లి బరాత్‌తో స్థానికంగా శబ్ధ కాలుష్యంతో ఇబ్బంది పడి స్నేహపురికాలనీకి చెందిన కొందరు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. దీంతో సనత్‌నగర్ గస్తీ సిబ్బంది వచ్చి పెళ్లి బరాత్‌ను అడ్డుకున్నారు. అయితే ఊరేగింపులో కొందరు మద్యం మత్తులో పోలీసులను దుర్భాషలాడుతూ నెట్టివేయడంతో పోలీసులు పెళ్లి కుమారుడు ఉదయ్‌కృష్ణ, అతని తండ్రి జానకిరామ్ మరి కొందరిపై కేసు నమోదు చేశారు. ఉదయాన్నే వీరిని తీసుకువచ్చేందుకు సనత్‌నగర్ ఎస్ఐ నర్సింహగౌడ్ తన సిబ్బందితో కలిసి వెళ్లారు. కేసు నమోదు కావడంతో పెళ్లి కొడుకు తండ్రి, మరి కొందరిని ఠాణాకు రమ్మని చెప్పారు. అయితే పెళ్లింట్లోకి పోలీసులు ప్రవేశించడం ఏమిటంటూ పోలీసులు వచ్చిన దృశ్యాలను వీడియో తీసి వైరల్ చేశారు. ఈ విషయమైన ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ మాట్లాడుతూ స్థానికుల ఫిర్యాదు మేరకే అనుమతి లేని పెళ్లి బరాత్‌ను అడ్డుకున్నామన్నారు. తమ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించడం, ఊరేగింపునకు అనుమతి లేకపోవడంతో కేసు నమోదు చేశామని చెప్పారు. చదవండి: అలిగి మండపం ఎక్కనన్న వధువు.. కారణం తెలిసి నవ్వుకున్న నెటిజన్స్ -
రాజకీయాల్లో చిచ్చురేపిన అల్లుడి పెళ్లి బరాత్
రాయ్‌పూర్: ఓ పెళ్లి బరాత్ ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర వివాదాస్పదమవుతోంది. పెళ్లి కొడుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి దగ్గరి చుట్టరికం. ఉదయం పెళ్లికి కాగా సాయంత్రం బరాత్ పెట్టుకున్నారు. అయితే ఈ బరాత్‌కు పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. ఎంతో ఆనందోత్సాహాల మధ్య బరాత్ జరిగింది. డప్పుచప్పుళ్లకు .. కొత్త కొత్త పాటలకు డ్యాన్స్‌లు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉందనే పట్టించుకోకుండా ఎంజాయ్ చేశారు. కోవిడ్‌నిబంధనలు ఉల్లంఘించారు. వారిపై కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ మర్కంట్ మేనల్లుడి వరుసయ్యే వ్యక్తికి వివాహం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బరాత్‌లో ఎవరూ మాస్క్, శానిటైజర్ వంటివి పట్టించుకోలేదు. కనీసం భౌతిక దూరంగా కూడా పాటించలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ రాష్ట్రంలో తీవ్ర ఆంక్షలు ఉన్న విషయమే పట్టించుకోలేదు. ఈ బరాత్‌లో ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఉండడం తీవ్ర వివాదమవుతోంది. బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షురాలు లతా ఉసేండి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినంతా మాత్రానా కరోనా నిబంధనలు పాటించరా? అని ప్రశ్నించారు. ఆ బరాత్‌లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ స్వయంగా పాల్గొన్నారని ఆరోపించారు. మీరే నిబంధనలు పాటించకపోతే సామాన్యులెలా పట్టించుకున్నారని ప్రశ్నించారు. అయితే ఈ ఘటనపై మొహన్ మర్కంట్ వివరణ ఇచ్చారు. బరాత్‌లో తాను లేనని.. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు అభిమానులు ఉంటారని.. ఈ సమయంలో తన అల్లుడిగా ఎవరైనా తన పేరు చెప్పుకుని అలాంటి పని చేసి ఉంటారని తెలిపారు. చదవండి: గంగానదిలో తేలిన కరోనా మృతదేహాలు చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ -
పెళ్లి బరాత్: వరుడిపై కేసు నమోదు..
సాక్షి, మెదక్: కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి వివాహ బరాత్ నిర్వహించినందుకు గాను వరుడితో పాటు అతని తండ్రి, డీజే సౌండ్ సిస్టం యాజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీజే సౌండ్ సిస్టం, సౌండ్ బాక్స్‌లను సీజ్ చేశారు. ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహులు వివాహం జరగగా శనివారం రాత్రి గ్రామంలో ట్రాక్టర్‌తో డీజే సౌండ్ సిస్టం పెట్టి ఎక్కువ మందితో భౌతిక దూరాన్ని పాటించకుండా బరాత్ నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి కోవిడ్, కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించారు. ఈమేరకు డీజే సౌండ్ సిస్టం, సౌండ్ బాక్స్‌లను సీజ్‌చేశారు. వరుడు నర్సింహులు, వరుడి తండ్రి సాయిలు, డీజే సౌండ్ సిస్టం యజమాని ఇటిక్యాల రవిపై కేసు నమోదు చేశారు. చదవండి: మీ సేవకు సలాం: కరోనా బాధితులకు కొండంత భరోసా -
పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్
-
‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్
డెహ్రాడూన్: ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభణతో అంబులెన్స్‌లు విరామమెరుగక సంచరిస్తున్నాయి. దీంతో ఆ వాహనాల డ్రైవర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారంతా పీపీఈ కిట్లు ధరించి సేవల్లో మునిగారు. ఈ సమయంలో కాస్తంతా సమయం దొరికినా విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా ఓ అంబులెన్స్ డ్రైవర్ చేసిన పని వారు ఎంత కష్టపడుతున్నారో అర్ధమవుతోంది. వారు ఎలాంటివి కోల్పోతున్నారో తెలుస్తోంది. వారి దయనీయ స్థితి నెటిజన్లను ఆవేదనకు గురి చేస్తోంది. ఉత్తరాఖండ్ హల్ద్వానీ పట్టణంలో ఓ కళాశాల వద్ద కొద్ది మందితోనే పెళ్లి బరాత్ కొనసాగుతోంది. ఈ సమయంలో అటువైపు వచ్చిన అంబులెన్స్‌తో వచ్చిన డ్రైవర్ మహేశ్ వాహనం ఆపేశాడు. వెంటనే పీపీఈ కిట్లోనే బరాత్ మధ్యలోకి వచ్చి తీన్మార్ స్టెప్పులేశాడు. మ్యూజిక్ అనుగుణంగా స్టెప్పులేస్తూ తన పని ఒత్తిడిని మరిచేలా అలసిపోయేలా డ్యాన్స్ చేశాడు. అయితే అకస్మాత్తుగా ప్రత్యక్షమైన పీపీఈ కిట్ డ్రైవర్‌ను చూసి పెళ్లివారు ఆందోళన చెందారు. అనంతరం ఆ డ్రైవర్ ఆనందంతో డ్యాన్స్ చేస్తుండడంతో అతడిని వారించకుండా ఎగరనిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రోగులకు నిరంతరం సేవలందిస్తూ బిజీగా ఉన్న వ్యక్తి ఇలా కష్టాన్ని మరుస్తూ సంతోషంగా చిందేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. -
వైరల్: హెలికాప్టర్లో ఊరేగుతూ.. ‘బరాత్’
జైపూర్: ‘జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పైనా పెడుతుంది’ అన్నట్లు డబ్బులుంటే చాలు ఎన్ని వేషాలు అయినా వేయవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ సామెత ఎక్కువగా వివాహాలకు వర్తిస్తుంది. ధనవంతుల ఇళ్లలో జరిగే పెళ్లి వేడుక చూస్తే.. ఈ సామెత గుర్తుకు వస్తుంది. వారి ఇంట పెళ్లి ఖర్చుతో కొన్ని కుటుంబాలు ఏళ్ల తరబడి సుఖంగా బతికేయగలవు. వాళ్ల డబ్బులు వాళ్ల ఇష్టం మనకెందుకు గానీ. ఇప్పుడు ఈ ధనవంతుల ముచ్చట ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ‘హెలికాప్టర్ వెడ్డింగ్’ పేరుతో ట్రెండ్ అవుతోంది. ఓ జర్నలిస్ట్ దాన్ని రిపోర్టు చేయడం కొసమెరుపు. ఈట్రేండి వివాహ వేడుక వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.. రాజస్తాన్‌లోని షేఖావతిలో ఈ నయా వివాహ వేడుక చోటు చేసుకుంది. రతన్‌గఢ్ తహసీల్‌లో ఓ చిన్న గ్రామానికి చెందిన కోటీశ్వరుడు తన కుమారుడి కోరిక మేరకు ‘బరాత్’ వేడుక కోసం హెలికాప్టర్ని రంగంలోకి దించాడు. వివాహం పూర్తయిన వెంటనే కొత్త జంట బరాత్ వేడుక కోసం హెలికాప్టర్లో ఎక్కి ఊరేగింది. ఈ తతంగాన్ని రిపోర్ట్ చేయడం కోసం ఓ జర్నలిస్ట్‌ని కూడా నియమించుకున్నాడు సదరు పెళ్లి కుమారుడి తండ్రి. ఈ రిపోర్టర్ వివాహం జరగుతున్న చోట ఉన్న పరిస్థితులు.. వధువు రియాక్షన్.. వరుడి స్పందన తదితర వివరాల గురించి పూస గుచ్చినట్లు రిపోర్డ్ చేశాడు. ‘‘కుమారుడి సంతోషం కోసం ఓ తండ్రి చేసిన ప్రయత్నం’’ అనే కామెటంరీతో వీడియో ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చదవండి: పైశాచిక వివాహం అంటే ఏంటో తెలుసా? వధువు జంప్..చెల్లిని పెళ్లాడిన వరుడు..ఇక్కడే ట్విస్ట్ -
వరుడికి షాక్.. రాత్రంతా వధువు కోసం చూసి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి కుమారుడు ఊరేగింపుగా తన ఇంటి నుంచి వివాహ మంటపానికి చేరుకున్నాడు. కానీ పెళ్లి కుమార్తె కనిపించకుండా పోయింది. ఆమె కోసం ఓ రోజంతా ఎదురు చూసి.. చుట్టుపక్కలా అంతా వెతికి.. చివరకు కోపంతో ఇంటి బాట పట్టాడు. ఆ వివరాలు అజాంగఢ్ కొత్వాలి ప్రాంతం కాన్షి రాం కాలనీకు చెందిన యువకుడికి.. పక్క గ్రామం యువతితో వివాహం నిశ్చయమయ్యింది. ఇరు కుటుంబాల మధ్య ఓ మహిళ ఈ వివాహ ప్రతిపాదన తీసుకువచ్చింది. రెండు కుటుంబాలకు అంగీకారం కావడంతో ఈ నెల 10న వీరిద్దరికి వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో 10వ తేది రాత్రి యువకుడు బరాత్‌గా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. ఎంతో సంతోషంగా మంటపానికి చేరుకున్న వరుడికి షాక్ తగిలింది. వధువు కనిపించడం లేదనే వార్త వినిపించింది. దాంతో ఆమె కోసం చుట్టుపక్కల మొత్తం వెదికారు. కానీ వధువు ఆచూకీ లభ్యం కాలేదు. (చదవండి: ప్రపంచపు అత్యుత్తమ వరుడు.. వధువు కోసం) ఆమె రాక కోసం వరుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు రాత్రంతా వధువు ఇంటి దగ్గరే వేచి ఉన్నారు. అయినప్పటికి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతేకాక ఈ వివాహ ప్రతిపాదన తీసుకువచ్చిన మహిళను బందీంచారు. అయతే పెళ్లి తేదీకి ముందు వరకు కూడా వరుడు, అతడి కుటుంబ సభ్యులు అమ్మాయి ఇంటికి వెళ్లలేదని తెలిసింది. ఇక వివాహ ఏర్పాట్ల కోసం యువతి తన కుటుంబం నుంచి 20 వేల రూపాయలు తీసుకుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. వివాహ ప్రతిపాదనను తీసుకువచ్చిన మహిళపై వరుడి కుటుంబం తీవ్రమైన ఆరోపణలు చేసిందని కొత్వాలి పోలీస్ స్టేషన్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ షంషర్ యాదవ్ తెలిపారు. ఇరు వర్గాలు కాంప్రమైజ్ అయ్యి వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. -
‘బారాత్’లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వరుడు!
-
పెళ్లింట విషాదం: డాన్స్ చేస్తూ వరుడు మృతి!
సాక్షి, నిజామాబాద్: పెళ్లి జరిగిన 12 గంటల్లోనే వరుడు మృతి చెందిన ఘటన బోధన్ పట్టణంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఉదయం 11 గంటలకు వివాహాం జరగ్గా.. రాత్రి నిర్వహించిన బారాత్ కార్యక్రమంలో పాల్గొన్న వరుడు చెందూరు గణేష్ హఠాన్మరణం చెందాడు. బారాత్‌లో డ్యాన్స్ చేసిన గణేష్ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బారాత్‌లో భారీ సౌండ్ బాక్స్‌లతో కూడిన డీ.జే కారణంగానే గణేష్ మరణించాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా, బోధన్ పట్టణంలోని నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన గణేష్ దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. పెళ్లి నేపథ్యంలో వారం క్రితం సొంతూరుకు వచ్చాడు. -
గుర్రాలెక్కిన పెళ్లి కూతుళ్లు..
-
గుర్రాలెక్కిన పెళ్లి కూతుళ్లు..
భోపాల్ : సాధారణంగా పెళ్లి వేడుకల్లో వరుడు గురాన్ని స్వారీ చేస్తూ కనిపిస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లో ఇందుకు భిన్నంగా ఇద్దరు పెళ్లి కూతుళ్లను గుర్రాలపై ఊరేగించారు. ఖండ్వకు చెందిన ఇద్దరు అక్కాచెల్లలు సాక్షి, సృష్టిల పెళ్లిలు జనవరి 22న జరిగాయి. అయితే వారి సంప్రాదాయం ప్రకారం అక్కాచెల్లలు ఇద్దరు.. గుర్రాలపై బయలుదేరి పెళ్లి కుమారుల ఇళ్లకు చేరుకున్నారు. అలాగే భారీ బరాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెళ్లి కూతుళ్ల తండ్రి మాట్లాడుతూ.. సమాజంలో అబ్బాయిలతోపాటుగా అమ్మాయిలకు కూడా సమాన గౌరవం ఇవ్వాలన్నారు. పాటిదార్ కమ్యూనిటీలో పెళ్లి కూతుళ్లు గుర్రాలపై వెళ్లడమనే సంప్రాదాయం చాలా కాలంగా కొనసాగుతుందని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భేటీ బచావో భేటీ పడావో’ కార్యక్రమా ముందుకు తీసుకెళ్లేలా తాము ఈ సంప్రాదాయాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ప్రతి వర్గం ఈ సంప్రాదాయాన్ని పాటించి.. కూతుళ్లకు గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
నృత్యం ఆపిందని ముఖంపై కాల్చాడు..!
చిత్రకూట్: వివాహ వేడుకలో నృత్యం ఆపిందనే కోపంతో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో మహిళా డ్యాన్సర్ తీవ్రంగా గాయపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని టిక్రా గ్రామంలో జరిగింది. నవంబర్ 30న టిక్రా గ్రామపెద్ద సుహిర్ సింగ్ పటేల్ కుమార్తె వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బరాత్‌లో నృత్యం ఆపేశారని కోపం తెచ్చుకున్న సుహిర్ సింగ్ బంధువు ఒకరు నాటు తుపాకీతో డ్యాన్సర్లపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక డ్యాన్సర్ తీవ్రంగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. -
బరాత్‌ను అడ్డుకునేందుకు యజ్ఞం.. ఆగిన పెళ్లి
గాంధీనగర్ : గుజరాత్ పాటీదార్ సామాజకి వర్గం సభ్యులు.. దళిత వ్యక్తి బరాత్‌ని ఆపేందుకు ప్రయత్నించిన ఘటనలో పోలీసులు ఇరువర్గాల మీద లాఠీ చార్జ్ చేశారు. ఈ సంఘటన గుజరాత్‌లోని ఆరావళి జిల్లా ఖంబియాస్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. దళిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి వివాహం సందర్భంగా అతని కుటుంబ సభ్యులు బరాత్ నిర్వహించారు. పెళ్లి కొడుకును మంటపానికి ఊరేగింపుగా తీసుకెళ్లాలని భావించారు. దీన్ని జీర్ణించుకోలేని పాటిదార్ సామాజిక వర్గం సభ్యులు కొందరు ఊరేగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా రోడ్డుపైన భజన కార్యక్రమాన్ని నిర్వహించడమే కాక యజ్ఞం కూడా చేశారు. దాంతో వరుడు మరియు అతని పరివారమంతా ఐదారు గంటలపాటు రోడ్డు మీదనే ఉండాల్సి వచ్చింది. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అంతేకాక ఒకరినొకరు దూషించుకుంటూ రాళ్లు రువ్వుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసుల మీద కూడా రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు ఇరు వర్గాల మీద లాఠీ చార్జ్ చేశారు. ఈ విషయం గురించి వరుడు బంధువులు మాట్లాడుతూ.. ‘పోలీసులు మాకు రక్షణ కల్పించలేదు. పాటీదార్ వర్గం వారు రోడ్డును ఇరువైపులా బ్లాక్ చేసి మమ్మల్ని మంటపానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారిని రోడ్డుమీద నుంచి పంపేయాల్సింది పోయి.. మమ్మల్ని బలవంతంగా వెనక్కి పంపించారు. దాంతో వివాహం ఆగిపోయింది. కనీసం ఇప్పుటికైనా పోలీసులు మాకు రక్షణ కల్పిస్తే.. సోమవారం నాడైనా పెళ్లి తంతు ముగిస్తామ’ని తెలిపారు. -
మురికి కాల్వలో పడ్డ వరుడు
చండీగఢ్ : పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన బరాత్ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. దాంతో పెళ్లి కుమారుడితో సహా మరో 14 మంది మురికి కాల్వలో పడిపోయారు. పంజాబ్‌లోని హోషియాపూర్ గ్రామంలో ఫిబ్రవరి 9న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘజియాబాద్‌లోని ఇందిరాపురముకు చెందిన అమిత్ యాదవ్‌కు సోనమ్ అనే యువతితో పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో హోషియాపూర్‌లో ఏర్పాటు చేసిన వివాహ వేదిక వద్దకు ఇరు కుటుంబాల బంధువులు వచ్చారు. అయితే ఫంక్షన్ హాల్‌కు రోడ్డుకు మధ్య చిన్నపాటి మురుగు కాల్వ ఉంది. పెళ్లికి వచ్చే వారికి వీలుగా ఈ మురుగు కాల్వపై తాత్కాలిక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాల్ ముందు వధువు కుటుంబ సభ్యులు వరుడికి ఆహ్వానం పలికేందుకు నిలబడ్డారు. అదే సమయంలో వరుడితో పాటు ఆయన స్నేహితులు డ్యాన్స్ చేసుకుంటూ తాత్కాలిక బ్రిడ్జిని దాటుతున్నారు. ఈ సమయంలో బ్రిడ్జి ఉన్నట్టుంది కుప్పకూలిపోయింది. దాంతో వరుడితో సహా మరో 14 మంది మురుగు కాల్వలో పడిపోయారు. వీరిలో ఇద్దరు ఎనిమిదేళ్ల పిల్లలు కూడా ఉన్నారు. బాధితులందరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు ఫంక్షన్ హాల్ యాజమాన్యమే బాధ్యత వహించాలని వరుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో ఫంక్షన్ హాల్ యాజమాన్యం వరుడి కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం ఇస్తామని చెప్పడంతో.. వివాదం సద్దుమణిగింది. -
పెళ్లి బారాత్‌లో అపశ్రుతి
నిజామాబాద్ లింగంపేట(ఎల్లారెడ్డి) : పెళ్లి వేడుకల్లో అపశ్రుతి జరగడంతో ఒక వృద్ధురాలు మృతి చెందగా, పెళ్లికొడుకు, మరో మహిళలకు తీవ్రగాయాలైన సంఘటన లింగంపేట మండలం లింగంపల్లి పంచాయతీ పరిధిలోని కొయ్యగుండు తండాల్లో చోటు చేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన అమ్రియానాయక్ కుమారుడు దేవిసింగ్ వివా హం బుధవారం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండ లం బైరాపూర్ తండాలో జరిగింది. వివాహానంతరం పెళ్లికొడుకు, పెళ్లికూతురు, బంధువులు రాత్రి బైరాపూర్ తండా నుంచి కొయ్యగుండు తండాకు చేరుకున్నారు. తండా సమీపంలోని గిరిజనుల ఆలయం వద్ద పూజలు చేసి ఇంటికి డీజే సౌండ్ సిస్టమ్‌తో నృత్యాలు చేసుకుంటూ వెళ్తున్నా రు. ఇంటి సమీపంలో నిలిపిఉన్న ట్రాక్టర్‌ను బంధువుల యువకుడు స్టార్ట్ చేయడంతో గేర్‌లో ఉన్న ట్రాక్టర్ బారాత్ తీస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామారెడ్డిలోని రుద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పెళ్లి కూతురు బంధువు మాలీబాయి(68) మృతిచెందింది. ట్రాక్టర్ ముందు నడుస్తున్న పెళ్లి కొడుకు, పెళ్లికూతురితో పాటు పలువురిపై ట్రాక్టర్ దూసుకెళ్లడంతో పెళ్లి కొడుకు కేతావత్ దేవిసింగ్ చాతిపైకి ట్రాక్టర్ చక్రం ఎక్కగా తండావాసులు వెంటనే టైర్‌ను పైకి లేపి బయటకు తీశారు. ఈ ఘటనలో తండాకు చెందిన కేతావత్ బగ్లీ, శాంత, సునీత, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి ముగించుకుని ఇంటికి చేరుకున్న బంధువులు ఇంట్లోకి వెళ్లే సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. -
పెళ్లి బరాత్ కు అనుమతించండి...
లక్నో : ప్రతి మనిషి జీవితంలో వివాహం ఒక ముఖ్య ఘట్టం. ఆ వివాహ వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. యూపీకి చెందిన ఓ యువకుడు కూడా అలానే అనుకున్నాడు. వివాహనంతరం బరాత్(పెళ్లి ఊరేగింపు) నిర్వహించాలనుకున్నాడు. అందుకోసం అనుమతివ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించాడు. అదేంటి బరాత్ వేడుక నిర్వహించడానికి కోర్టు అనుమతి ఎందుకు, ఈ కొత్త నిబంధన ఎప్పుడు పెట్టారు అనుకుంటున్నారా..? ఈ సంఘటన జరిగింది మన దగ్గర కాదులెండి ఉత్తరప్రదేశ్‌లో. వివాహం చేసుకోబేబొయే వ్యక్తి దళిత సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో బరాత్ నిర్వహణకు అనుమతించాల్సిందిగా కోర్టును వేడుకున్నాడు. వినడానికి విడ్డూరంగా అనిపించే ఈ సంఘటన లక్నోలోని కస్గంజ్ గ్రామంలో చోటుచేసుకుంది. కస్గంజ్ గ్రామానికి చెందిన సంజయ్ కుమార్‌కు వివాహం నిశ్చయం అయింది. తన వివాహ వేడుకలో సంజయ్ బరాత్ నిర్వహించలనుకున్నాడు. కానీ అందుకు గ్రామంలోని ఉన్నత సామాజిక వర్గానికి చెందిన ఠాకుర్లు ఒప్పుకోలేదు. ‘దళితులు ఊరి మధ్యలో నుంచి వెళ్లడం సంప్రాదాయనికి విరుద్ధం. మా మాట కాదని మీరు బరాత్ తీస్తే తర్వాత చాలా తీవ్ర పరిణామాలు చూడాల్సివస్తుందని’ హెచ్చరించారు. కావాలంటే మీరు ఊరి బయట ఉన్న మైదానంలో వివాహ వేడుకలు జరుపుకుని, అక్కడ నుంచే ఊరేగింపు నిర్వహించుకోవచ్చని సలహా ఇచ్చారు. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమని, మీ వాదనను ఎవరూ పట్టించుకోరని ఠాకూర్లు అనటంతో... ఈ అంశం గురించి ఇరువర్గాల మధ్య ఒక నెల నుంచి గొడవ జరుగుతూనే ఉంది. దీంతో విసిగిపోయిన సంజయ్ ఈ అంశం మీద డిస్ట్రిక్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. డిస్ట్రిక్ట్ కోర్టు వధువు మైనర్ కాబట్టి, మరో రెండు నెలల తర్వాత మేజర్ అవుతుందని, అప్పటి వరకూ ఈ విషయం గురించి తీర్పు చెప్పలేమని తెలిపింది. అయితే కోర్టులో ఫిర్యాదు చేయాడానికంటే ముందే సంజయ్ కుమార్ ఈ విషయం గురించి యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు... ఆయన పోర్టల్ ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు, పలుదఫాలు పోలీసుస్టేషన్‌కు కూడా వెళ్లాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు ఈ విషయాన్ని స్థానిక పోలీసుల వద్ద పరిష్కరించుకోవాలంటూ అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ విషయం గురించి సంజయ్ మాట్లడుతూ ‘నేను కోర్టు తీర్పును గౌరవిస్తాను. అయితే ఒకసారి రికార్డులను పరిశీలించాల్సిందిగా నేను కోర్టు వారిని కోరుతున్నాను. ఒక వేళ వధువు మైనారిటీ తీరలేదనే విషయం వాస్తవం అయితే నేను రెండు నెలలు ఆగుతాను. కానీ బరాత్ విషయంలో మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు’ అని చెప్పాడు. ఇదిలా ఉండగా గ్రామ పెద్ద ఓమ్ ప్రకాశ్ ఠాకుర్ మాట్లాడుతూ బరాత్ పేరుతో సంజయ్ అల్లర్లు సృష్టించాలనుకుంటున్నాడని, అందుకే ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. వివాహ వేదిక నుంచి తన ఇంటి వరకూ అతను ఊరేగింపు నిర్వహించుకుంటే సమస్యే లేదని, అయితే సంప్రదాయాన్ని కాదని దళితులు ఊరంతా తిరుగుతామంటే కుదరదని అన్నారు. -
బరాత్ కోసం హైకోర్టులో యువకుడి పిటిషన్
లక్నో : బరాత్ అనుమతి కోసం యూపీకి చెందిన ఓ దళిత యువకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అతను పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కోర్టులో అతనికి చేదు అనుభవమే ఎదురైంది. స్థానిక పోలీసులను ఆశ్రయించాలంటూ కోర్టు అతనికి సూచిస్తూ.. పిటిషన్‌ను కొట్టేసింది. వివరాల్లోకి వెళ్తే... కాస్గంజ్ పరిధిలోని ఓ గ్రామంలో గత నెలరోజులుగా దళిత-అగ్రవర్ణాలకు మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో థాకూర్ పెద్దలు దళితుల వివాహా వేడుకలకు అడ్డుపడుతున్నారు. కాదని వేడుకలను నిర్వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. శీతల్ అనే దళిత యువకుడికి ఈ మధ్యే వివాహం నిశ్చయమైంది. నెలాఖరులో వివాహం కూడా. అయితే గ్రామంలోనే థాకూర్ పెద్దలు అడ్డుపడుతుండటంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ ప్రయోజనం లేకపోవటంతో చివరకు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘తమ ఆదేశాలకు దిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని థాకూర్ పెద్దలు బెదరిస్తున్నారు. ఇది మా ప్రభుత్వం.. మీరు ఎవరిని ఆశ్రయించినా వ్యర్థమే. ఎవరూ జోక్యం చేసుకోరు అంటూ చెబుతున్నారు. దీనిపై న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. బరాత్‌తో నా వివాహం జరుపుకునేందుకు అనుమతి ఇప్పించండి’ అని శీతల్ పిటిషన్లో పేర్కొన్నాడు. ఇక ఈ వ్యవహారంపై సంజయ్ కుమార్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ శాఖ కూడా ఈ వ్యవహారంలో చేతులెత్తేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కావాలంటే పొరుగు గ్రామంలో నిర్వహించుకోవాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. -
రథమెక్కిన పెళ్లి కూతురు...!
జైపూర్: సాధారణంగా వివాహాల్లో పెళ్లి కొడుకు గుర్రం లేదా గుర్రపు బగ్గీపై ఊరేగుతాడు. అందుకు పూర్తి విరుద్ధంగా రాజస్తాన్‌లోని ఝుంఝునూ జిల్లా చిరావా పట్టణంలో పెళ్లి ‘బారాత్’ (ఊరేగింపు)ను తలపాగాతో గుర్రపు బండిపై కూర్చున్న పెళ్లికూతురు ముందుకు నడిపింది. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎందులోనూ తక్కువకాదని తెలిపేందుకే ఈ బారాత్‌ను సాధనంగా ఎంచుకున్నట్లు పెళ్లి కుమార్తె గార్గీ తెలిపారు. ఈ యాత్రలో భాగంగా జైపూర్ చుట్టుపక్కలా 150 కి.మీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించినట్లు ఆమె వెల్లడించారు. -
కాసేపట్లో పెళ్లి.. గుండెపోటుతో వరుడి మృతి
పాట్నా: మరికాసేపట్లో ఆ ఇంట్లో పెళ్లి జరగనుంది. కానీ అంతలోనే బరాత్‌లో డాన్స్ చేస్తున్న పెళ్లికొడుకు హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. ఈ విషాద ఘటన బిహార్ లోని కైముర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి... కైముర్ జిల్లా సరన్పూర్ ప్రాంతానికి చెందిన దయా శంకర్‌పాండే కుమారుడు శశికాంత్పాండే (25)కి గత శుక్రవారం వివాహం నిశ్చయించారు. బంధువులు, స్నేహితులతో కలిసి పెళ్లి మండపానికి తన గ్రామం నుంచి వివాహ వేదికకు ఊరేగింపుగా వెళ్తున్నారు. బరాత్ సందర్భంగా.. పెళ్లికొడుకును డాన్స్ చేయమని స్నేహితులు బలవంతంగా కారునుంచి దించి డాన్స్ చేయించారు. అందరితో కలిసి సంతోషంతో వరుడు శశికాంత్ ఫుల్లుగా డ్యాన్స్ చేశాడు. అంతలోనే గుండె పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పెళ్లికొడుకును పరీక్షించిన డాక్టర్లు గుండెపోటుతో వరుడు శశికాంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. డ్యాన్స్ చేయడం వల్లే గుండెపై ఒత్తిడి పెరిగి చనిపోయాడని తెలిపారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పెళ్లి వేడుకలు : మహిళలకు బుల్లెట్ గాయాలు
ఘజియాబాద్ : పెళ్లి బరాత్ వేడుకలో తుపాకీ గుళ్లు తగిలి ఇద్దరు మహిళలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. ఘజియాబాద్ పట్టణంలో శుక్రవారం రాత్రి బాజా భజంత్రీలు, బాణాసంచా పేలుళ్ల మధ్య అశ్వారోహుడై పెళ్లి కొడుకు గుర్రంపై పెళ్లి మండపానికి సాగిపోతున్నాడు. బంధువులంతా ఆనందడోలికల్లో మునిగి పోయి రహదారిపై నాట్యం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ క్రమంలో బంధువులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే అవి రహదారి పక్కనే ఉన్న భవనంపై నుంచి బరాత్ వేడుకలు తిలకిస్తున్న సుమన్, మీనాక్షిల శరీరంలోకి దూసుకు వెళ్లాయి. దాంతో వారిని మోదీనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.