పెళ్లి వేడుకలు : మహిళలకు బుల్లెట్ గాయాలు | Two injured in celebratory firing | Sakshi
Sakshi News home page

పెళ్లి వేడుకలు : మహిళలకు బుల్లెట్ గాయాలు

Published Sat, Jun 27 2015 10:30 AM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM

పెళ్లి వేడుకలు : మహిళలకు బుల్లెట్ గాయాలు - Sakshi

పెళ్లి వేడుకలు : మహిళలకు బుల్లెట్ గాయాలు

ఘజియాబాద్ : పెళ్లి బరాత్ వేడుకలో తుపాకీ గుళ్లు తగిలి ఇద్దరు మహిళలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటు చేసుకుంది. ఘజియాబాద్ పట్టణంలో శుక్రవారం రాత్రి బాజా భజంత్రీలు, బాణాసంచా పేలుళ్ల మధ్య అశ్వారోహుడై పెళ్లి కొడుకు గుర్రంపై పెళ్లి మండపానికి సాగిపోతున్నాడు.


బంధువులంతా ఆనందడోలికల్లో మునిగి పోయి రహదారిపై నాట్యం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ క్రమంలో బంధువులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే అవి రహదారి పక్కనే ఉన్న భవనంపై నుంచి బరాత్ వేడుకలు తిలకిస్తున్న సుమన్, మీనాక్షిల శరీరంలోకి దూసుకు వెళ్లాయి. దాంతో వారిని మోదీనగర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement