సాక్షి, నిజామాబాద్: పెళ్లి జరిగిన 12 గంటల్లోనే వరుడు మృతి చెందిన ఘటన బోధన్ పట్టణంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఉదయం 11 గంటలకు వివాహాం జరగ్గా.. రాత్రి నిర్వహించిన బారాత్ కార్యక్రమంలో పాల్గొన్న వరుడు చెందూరు గణేష్ హఠాన్మరణం చెందాడు. బారాత్‌లో డ్యాన్స్ చేసిన గణేష్ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బారాత్‌లో భారీ సౌండ్ బాక్స్‌లతో కూడిన డీ.జే కారణంగానే గణేష్ మరణించాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా, బోధన్ పట్టణంలోని నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన గణేష్ దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. పెళ్లి నేపథ్యంలో వారం క్రితం సొంతూరుకు వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment