తిరుమలలో బుల్లెట్లు, పిస్టల్ స్వాధీనం
తిరుపతి: తిరుమల అలిపిరి చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో బుల్లెట్లు, పిస్టల్ లభ్యమవ్వడం కలకలం రేపింది. మహారాష్ట్ర పుణే రిజిస్ట్రేషన్ ఉన్న వాహనంలో నలుగురు తిరుమలకు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అలిపిరి చెక్‌పోస్టు వద్ద పోలీసులు జరిపిన వాహనాల తనిఖీల్లో ఆ కారులో 14 రౌండ్ల బుల్లెట్లు, ఒక పిస్టల్‌ను విజిలెన్స్ అధికారులు గమనించారు.
వాటిని స్వాధీనం చేసుకుని వాహనంలోని వారిని ప్రశ్నించగా తమ వారు కొండపైన ఉన్నారంటూ పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. వీరు వేటగాళ్లు.. లేక దోపిడి దొంగలన్న అయ్యింటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.