సాధారణంగా పెళ్లి వేడుకల్లో వరుడు గురాన్ని స్వారీ చేస్తూ కనిపిస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లో ఇందుకు భిన్నంగా ఇద్దరు పెళ్లి కూతుళ్లను గుర్రాలపై ఊరేగించారు. ఖండ్వకు చెందిన ఇద్దరు అక్కాచెల్లలు సాక్షి, సృష్టిల పెళ్లిలు జనవరి 22న జరిగాయి. అయితే వారి సంప్రాదాయం ప్రకారం అక్కాచెల్లలు ఇద్దరు.. గుర్రాలపై బయలుదేరి పెళ్లి కుమారుల ఇళ్లకు చేరుకున్నారు. అలాగే భారీ బరాత్ నిర్వహించారు.