జైపూర్: సాధారణంగా వివాహాల్లో పెళ్లి కొడుకు గుర్రం లేదా గుర్రపు బగ్గీపై ఊరేగుతాడు. అందుకు పూర్తి విరుద్ధంగా రాజస్తాన్‌లోని ఝుంఝునూ జిల్లా చిరావా పట్టణంలో పెళ్లి ‘బారాత్’ (ఊరేగింపు)ను తలపాగాతో గుర్రపు బండిపై కూర్చున్న పెళ్లికూతురు ముందుకు నడిపింది. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎందులోనూ తక్కువకాదని తెలిపేందుకే ఈ బారాత్‌ను సాధనంగా ఎంచుకున్నట్లు పెళ్లి కుమార్తె గార్గీ తెలిపారు. ఈ యాత్రలో భాగంగా జైపూర్ చుట్టుపక్కలా 150 కి.మీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించినట్లు ఆమె వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment