
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తనయుు అనంత్ అంబానీ పెళ్లి ముంబయిలో అత్యంత వైభవంగా జరిగింది. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జూలై 12న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లిలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలువురు ప్రముఖ సినీతారలు సందడి చేశారు. నగరంలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుకకు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేశ్ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు కూడా హాజరైన నూతన వధువరూలను ఆశీర్వదించారు.
అయితే ఈ పెళ్లిలో జరిగిన బరాత్‌లో బాలీవుడ్ హీరో, దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ సింగ్ సందడి చేశారు. అర్జున్ కపూర్, వీర్ పహారియాతో కలిసి స్టెప్పులు వేశారు. నాగిని డ్యాన్స్ చేస్తూ రణ్‌వీర్ సింగ్ అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment