Nagin dance
-
అనంత్ అంబానీ పెళ్లి.. నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టిన స్టార్ హీరో!
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తనయుు అనంత్ అంబానీ పెళ్లి ముంబయిలో అత్యంత వైభవంగా జరిగింది. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జూలై 12న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లిలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలువురు ప్రముఖ సినీతారలు సందడి చేశారు. నగరంలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుకకు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేశ్ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు కూడా హాజరైన నూతన వధువరూలను ఆశీర్వదించారు.అయితే ఈ పెళ్లిలో జరిగిన బరాత్‌లో బాలీవుడ్ హీరో, దీపికా పదుకొణె భర్త రణ్వీర్ సింగ్ సందడి చేశారు. అర్జున్ కపూర్, వీర్ పహారియాతో కలిసి స్టెప్పులు వేశారు. నాగిని డ్యాన్స్ చేస్తూ రణ్వీర్ సింగ్ అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by PopDiaries Spotlight (@popdiaries.bollywood) -
బంగ్లాదేశ్‌పై సంచలన విజయం.. నాగిన్ డాన్స్ చేసిన శ్రీలంక ఆటగాడు!
ఆసియాకప్-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి మరో నాలుగు బంతులు మిగిలూండగానే ఛేదించింది. అయితే మ్యాచ్ సగం వరకు బంగ్లాదేశ్‌కే గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ.. అఖరి ఓవర్లలో బౌలింగ్ తప్పిదాల వల్ల మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు ఏకంగా నాలుగు నో బాల్స్ వేశారు. అఖరికి శ్రీలంకకు విన్నింగ్ రన్ కూడా నో బాల్ రూపంలోనే వచ్చింది. ఈ క్రమంలో శ్రీలంక ఆటగాళ్లతో పాటు మేనేజేమెంట్ సైతం గెలుపు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ముఖ్యంగా శ్రీలంక ఆల్ రౌండర్ చమికా కరుణరత్నే 'నాగిన్ డాన్స్' చేస్తే తన సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. అతడు డ్యాన్స్ చేయడం ప్రారంభించిన వెంటనే స్టాండ్స్‌లో ఉన్న శ్రీలంక అభిమానులు కూడా నాగిన్ డాన్స్ చేయడం మొదలపెట్టారు. కాగా 2018 నిదాహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకపై విజయం సాధించిన అనంతరం బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ నాగిన్ డ్యాన్ చేసి గెలుపు సంబారాలు జరపుకున్నాడు. అతడితో పాటు మిగితా ఆటగాళ్లు కూడా చిందులు వేశారు. అప్పటి నుంచి బంగ్లా ఆటగాళ్ల నాగిని డ్యాన్స్ ఫేమస్ అయింది. ఇప్పడు దానికి బదలుగా కరుణరత్నే డ్యాన్స్ చేస్తూ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. What a view Nagin Dance 🐍 🐍 By Chamika karunaratne #AsiaCupT20 #BANVSSL @ChamikaKaru29 pic.twitter.com/47yxsHLelL — Sumit Raj (@Iam_SUMITRAJ) September 1, 2022 చదవండి: Asia Cup 2022: బంగ్లాదేశ్ కొంపముంచిన నో బాల్.. ఒక్కడికే మూడు ఛాన్స్‌లు! -
Nagin Dance: నడిరోడ్డుపై శ్రీదేవీ పాటకు నాగిని డ్యాన్స్‌తో రచ్చ రచ్చ
Nagin Dance On Truck Horn: పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అనే సామెతకు కొందరు యువకులు తగిన న్యాయం చేశారు. రోడ్డుపై నాగిని డ్యాన్స్‌లు చేస్తూ కేకలు పెడుతూ రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు బైక్ రైడర్స్ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ నాగిని డ్యాన్స్ చేస్తూ హంగామా చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నార్త్ కర్నాటకలో కొందరు బైక్ రైడర్లు రోడ్డుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ ట్రక్కు డ్రైవర్ హారన్ మోగించాడు. ఆ హారన్ నాగిన్ డ్యాన్స్‌కు సంబంధించింది. దీంతో, బైకర్లు రోడ్డు పక్కనే బైకులను పార్కింగ్ చేసి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో డ్రైవర్‌ను సాంగ్ పెట్టమని సైగలు చేశారు. అదే జోష్‌లో ట్రక్కు డ్రైవర్.. శ్రీదేవి నటించిన 'నాగీనా'లోని "మెయిన్ తేరీ దుష్మాన్" సాంగ్‌ను ప్లే చేశాడు. దీంతో, రైడర్లు మరింత రెచ్చిపోయారు. రోడ్డు మీద పడుకుని దొర్లుతూ.. డ్యాన్స్ చేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. मजे है जैसे में आप ले पाओ वैसे लो 🤣#BachelorNation #party #nagindance pic.twitter.com/d0z9zvYsc1 — नटखट निड 🚩 (@natkhatnids) July 12, 2022 ఇది కూడా చదవండి: లైవ్‌లో కుర్రాడి దవడ పగలగొట్టిన రిపోర్టర్.. ఎట్టకేలకు ఆమె స్పందన -
Nagin Dance: కటకటాల వెనక్కి నెట్టిన ‘నాగిని డ్యాన్స్’
బారాత్ అనే పేరు వింటే చాలూ.. పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు కొందరు. చుక్కపడిందంటే చాలూ.. సోయి మరిచి చిందులేస్తుంటారు మరికొందరు. అందునా నాగిని డ్యాన్స్‌ను ఉన్న క్రేజే వేరు. కానీ, ఇక్కడ నాగిని డ్యాన్స్ చేసి కటకటాల పాలయ్యారు. అయ్యో.. అంతమాత్రానికేనా అనుకోకండి. నాగిని డ్యాన్స్ కోసం నిజంగానే పామును పట్టుకొచ్చారు వాళ్లు. ఒడిషాలోని మయూర్‌భంజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుక కోసం నాగుపామును తీసుకొచ్చి.. నాగిని డ్యాన్స్ పేరిట ఆడించడం మొదలుపెట్టారు. పాములు పట్టే వ్యక్తి దానిని ఆడిస్తుంటే.. వందల మంది చుట్టూ చేరి ఆ రియల్ నాగిని డ్యాన్స్‌ను చూస్తూ ఉండిపోయారు. బుట్టలో పాము.. చెవ్వులు పగిలిపోయే మ్యూజిక్, నృత్యాల కోలాహలంతో బారాత్‌లో ఆ నాగిని డ్యాన్స్ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. మరి అధికారులు ఊరుకుంటారా? వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఐదుగురు అరెస్ట్ చేసి, ఆ పామును ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. జనాల మధ్య అలా పామును ఆడించడం దుర్మార్గం. బుట్టలోంచి అది పొరపాటున కింద పడితే జనాల ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి, ఇలాంటి ఫీట్లు చేయొద్దంటూ హెచ్చరిస్తున్నారు కొందరు. -
టీమిండియా గెలుపు.. నాగిని డ్యాన్స్‌తో ఖుషీ చేసుకున్న మాజీ క్రికెటర్
న్యూఢిల్లీ: ఓవల్ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో ఆటగాళ్లు, అభిమానులే కాక మాజీ క్రికెటర్లు సైతం సంబురాల్లో మునిగితేలుతున్నారు. 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం సాధించిన విజయం కావడంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు డ్యాన్స్‌లు, కేకలు, ఈలలతో డ్రెసింగ్ రూమ్‌ను హోరెత్తించగా.. భారత అభిమానులు అక్కడా, ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. भाई लोग आप की फरमाइश पे | Anything for an India victory, no matter how awkward :) pic.twitter.com/aSgGA1pUQE — Mohammad Kaif (@MohammadKaif) September 7, 2021 ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. నాగిని డ్యాన్స్ వేస్తూ టీమిండియా గెలుపును మనస్పూర్తిగా ఆస్వాధించాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. "టీమిండియా గెలిచిందిగా.. సంబురాలు మామూలుగా ఉండవు.. నచ్చిన విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం.. అది ఎంత వికారంగా ఉన్నా పర్వాలేదు" అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియలో వైరలవుతోంది. ఎప్పుడూ కామ్‌గా కనిపించే కైఫ్.. ఇలా నాగిని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. కైఫ్.. టీమిండియా విజయాన్ని వంద శాతం ఆస్వాధిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండయా157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్‌లో 368 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకపడింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సూపర్ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్ మ్యాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చదవండి: ఆ జెర్సీ ధరించినప్పుడు, నీ ముఖానికి అంత సీన్ లేదన్నారు: శార్దూల్ ఠాకూర్ -
నాగిన్ డ్యాన్స్‌తో అదరగొట్టిన క్రికెటర్
అబుదాబి: షేక్ జాయేద్ స్టేడియం వేదికగా శుక్రవారం ఐర్లాండ్, యూఏఈ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వికెట్ తీసిన ఆనందంలో యూఏఈ క్రికెటర్ రోహన్ ముస్తఫా నాగిన్ డ్యాన్స్‌తో అలరించాడు. అసలు విషయంలోకి వెళితే.. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్ ముస్తఫా వేశాడు. క్రీజులో ఉన్న ఐర్లాండ్ బ్యాట్స్‌మన్ లోక్రాన్ టక్కర్ బంతి అంచనా వేయడంలో విఫలమై క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆనందంతో ముస్తఫా కొన్ని సెకన్ల పాటు నాగిన్ స్టెప్స్ వేసి అలరించాడు. అతని చర్యకు ఆశ్చర్యపోయిన తోటి క్రికెటర్లు.. 'నీలో ఈ కళ కూడా ఉందా' అంటూ ముస్తఫాను అభినందించారు.(చదవండి: జడ్డూ లేట్ చేసి ఉంటే కథ వేరే ఉండేది) ఈ వీడియోనూ అబుదాబి క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ముస్తఫా స్టెప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 50 ఓవర్లు ఫార్మాట్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ స్టిర్లింగ్ సెంచరీతో(131*)ఆకట్టుకోగా.. కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ 53 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన యూఏఈ 18 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. (చదవండి: స్లెడ్జింగ్; గిల్ కౌంటర్ అదిరింది..) 🕺 @rohanmustafa88 is loving life! @EmiratesCricket | #AbuDhabiCricket | #UAEvIRE pic.twitter.com/w5r9J7zJJ5 — Abu Dhabi Cricket (@AbuDhabiCricket) January 8, 2021 -
వైరల్ : నాగిని డాన్స్ చేస్తూ చనిపోయాడు
సియోని : చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. చనిపోయే వ్యక్తికి కూడా తాను ఇప్పుడు చనిపోబోతున్నాను అనే విషయం తెలియదు. చనిపోవడం అనేది ఇప్పటికీ ఓ మిస్టరీయే. అది ఎప్పుడు ఎవరికి ఎలా ఏ రూపంలో వస్తుందో ఊహించలేం. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. గణపతి నిమజ్జనం సందర్భంగా నాగిని డాన్స్ చేస్తూ ఓ వ్యక్తి అకాస్మాత్తుగా మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన గురుచరణ్ ఠాగూర్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి గణేష్ మండపం వద్ద నాగిని మ్యూజిక్‌కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఏమైందా అని చుట్టూ ఉన్న వాళ్లు దగ్గరికి వెళ్లి చూసేలోపే అతడు మృతిచెందాడు. అతడు డ్యాన్స్ చేస్తూ మృతి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నాగిని డాన్స్ చేస్తూ చనిపోయాడు
-
ఇలాంటి నాగిని డ్యాన్స్ ఎక్కడా చూసి ఉండరు
టిక్‌టాక్ యాప్ పుణ్యామా అని సామన్యులు కూడా రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోతున్నారు. ఈ మధ్య కాలంలో వాహనాలు కూడా టిక్‌టాక్‌లో బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం టిక్‌టాక్‌లో #JCBKiKhudayi హ్యాష్‌ట్యాగ్ కూడా విపరీతంగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం జేసీబీకి సంబంధించిన మరో వీడియో టిక్‌టాక్‌లో తెగ వైరలవుతోంది. ఓ వ్యక్తి ఏకంగా జేసీబీ మిషన్లతో నాగిని డ్యాన్స్ చేయించాడు. విననడానికి విడ్డూరంగా ఉన్న నిజం. ఓ యువకుడు జేసీబీల ముందు కూర్చుని నాగిని సినిమాలోని మైనే తేరీ దుష్మన్ సాంగ్‌ను ప్లే చేస్తుండగా.. మరో వ్యక్తి ఆ మిషన్లను పాటకు తగ్గట్టు ఆడిస్తూ వాటితో నాగిని డ్యాన్స్ చేయించారు. క్రిష్ణ భట్ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను తన ట్విటర్లో షేర్ చేయడమే కాక.. టిక్‌టాక్‌ను బ్యాన్ చేయనందుకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘వరల్డ్‌కప్‌లో ఇండియా ఓడిపోవడంతో బాధలో ఉన్న వారికి ఈ వీడియో కొత్త ఉత్సాహాన్ని కల్గిస్తుంది’.. ‘వాటే క్రియేటివిటీ’ అంటూ కామెంట్ చేస్తున్నారు. thank you for not banning TikTok.#TikTok #ThursdayThoughtspic.twitter.com/W1Lf2hx1MA — Krishna Bhatt (@thekrishnabhatt) July 11, 2019 -
బడి పిల్లలతో నాగినీ డ్యాన్స్‌లు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని అధికారులందరూ జన్మభూమి– మాఊరు కార్యక్రమానికి ఓ నమస్కారం అనే పరిస్థితి నెలకొంది. కారణం టీడీపీ నేతల ఒత్తిళ్లతో సమస్యలు పరిష్కరించలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక ఉద్యోగులు అడకత్తెరలో పోక చెక్కలా నలుగుతున్నారు. ఫలితంగా వారికి జన్మభూమి కార్యక్రమం అంటేనే ముచ్చెమటలు పడుతున్నాయి. జిల్లాలోని అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులు తమకున్న అధికారాలను విని యోగించి పేద ప్రజలకు న్యాయం చేద్దామని ప్ర యత్నాలు చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలను టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు అడ్డుకుం టున్నారు. వారిని సక్రమంగా విధులు నిర్వహించనీయకుండా సమస్యలు సృష్టిస్తున్నారు. దీంతో జన్మభూమి– మాఊరు గ్రామసభల్లో ప్రజలిచ్చే అర్జీలకు అధికారులు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అలా నిర్ణయం తీసుకునే కొందరి అధికారులపై అక్కడి టీడీపీ ప్రజాప్రతినిధులు తమ అక్కసు ప్రదర్శిస్తున్నారు. టీడీపీ నేతల ఆమోదం తప్పనిసరి ఉద్యోగులు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్న పేదలను గుర్తించి, వాటిని వారి చెంతకు చేర్చే బాధ్యత నిర్వహించాల్సి ఉంది. అయితే జిల్లాలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఏ శాఖలోనైనా ప్రభుత్వ పథకాల మంజూరుకు సంబంధించి టీడీపీ ప్రజాప్రతినిధుల ఆమోదం తీసుకోవాల్సి వస్తుందని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు సూచించే కార్యకర్తలకు మాత్రమే పథకాలు మంజూరు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పథకాల ఆశయం నిర్వీర్యం కావడమే గాక పేదలకు ఆ పథకాలు చేరడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చౌడేపల్లె మండలం చారాలలో ప్రోటోకాల్ వివాదంతో నెలకొన్న ఉద్రిక్తత పోలీసు బందోబస్తు నడుమ జన్మభూమి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ఆరో విడత జన్మభూమి– మా ఊరు కార్యక్రమ నిర్వహణకు వెళ్లిన అధికారులకు ఛీత్కారాలు, ప్రజల తిరుగుబాటు, ఆగ్రహజ్వాలలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమం పోలీసు బందోబస్తు నడుమ కొనసాగాల్సిన దుస్థితి నెలకొంది.అయితే జన్మభూమి – మా ఊరు కార్యక్రమం ద్వారా ప్రజల చెంతకే అధికారుల వచ్చి, ప్రజా సమస్యలు విని పరిష్కరిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొడుతోంది. ఇందుకోసం రూ.కోట్ల ఖర్చు పెడుతోంది. కాగా ఇప్పటివరకు జరిగిన ఐదు విడతల జన్మభూమి–మా ఊరు కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న ప్రజలకు న్యాయం జరగలేదు. దీంతో గతంలో ఇచ్చిన అర్జీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన వారిని ప్రభుత్వం పోలీసులతో బెదిరిస్తోంది. ఈ క్రమంలో జన్మభూమి సభల్లో అధికార పార్టీ నాయకులు, నేతలు మాట్లాడే ప్రసంగాలను ప్రజలు మౌనంగా వినడం తప్ప, మరో మార్గాంతరం లేకుండాపోతోంది. ప్రజలిచ్చే అర్జీలను తామైనా పరిష్కారం చేద్దామని అధికారులు భావిస్తున్న ఉద్యోగులపై టీడీపీ నేతలు ఒత్తిడి పెంచి, ఇబ్బందులు సృష్టిస్తున్నారు. సీఎం సభకు వచ్చిన అర్జీలే నిదర్శనం గత ఐదు విడతల జన్మభూమిలో ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదనడానికి గురువారం కుప్పంలో జరిగిన సీఎం చంద్రబాబు పర్యటనలో వచ్చిన అర్జీలే నిదర్శనం. సీఎం కుప్పంలో జరిగిన జన్మభూమిలో పాల్గొన్న సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 875 మందికి పైగా పాల్గొని, అర్జీలు అందజేసినట్లు అధికారులే చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కా రం కాకపోవడంతోనే ప్రజలు నేరుగా సీఎంకైనా తమ ఆవేదనను చెప్పుకుందామని వచ్చి, వినతులు ఇచ్చారనడానికి సాక్షం. ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు, టీడీపీ నేతలు అధికారులను బెదిరించడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడి పిల్లలతో నాగినీ డ్యాన్స్‌లు జన్మభూమిలో నిర్వాకం గంగవరం: మండలంలోని గండ్రాజుపల్లెలో జరిగిన జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో బడిపిల్లలతో నాగినీ డ్యాన్సులు వేయించారు. గురువారం గండ్రాజుపల్లె, కీలపల్లె పంచాయతీల్లో జన్మభూమి నిర్వహించారు. గండ్రాజుపల్లిలో జన్మభూమి కార్యక్రమం ప్రారంభానికి ముందు బడి పిల్లలతో నాగినీ డ్యాన్స్‌లు వేయించారు. ఇలా సభా ప్రాంగణం మధ్యలో బాల, బాలికలతో డ్యాన్స్‌లు వేయించడం విమర్శలకు దారితీసింది. బడిలో చక్కగా చదువుకోవాల్సిన పిల్లలను ఇలా జన్మభూమికి రప్పించి వారితో డ్యాన్సులు వేయించడం ఏమిటని పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వెలుగు మహిళలను రప్పించడానికి అధికారులు ముప్పుతిప్పలు పడ్డారు. ఆగ్రహజ్వాలలు.. ఆందోళనలు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరో విడత జన్మభూమి– మాఊరు కార్యక్రమంలో రెండో రోజైన గురువారం కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు చేశారు. అధికారులను నిలదీశారు. గత ఐదు విడతల్లో ఇచ్చిన అర్జీల మాటేమిటని? వాటికే దిక్కులేదని, మళ్లీ ఇప్పుడు జన్మభూమి ఎందుకు నిర్వహిస్తున్నారని సభలను అడ్డుకున్నారు. జనాగ్రహం, నిలదీతలు, ఆందోళనలు ఎదుర్కొని, వారికి సంజాయిషీ చెప్పుకోలేక అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ♦ ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలకు స్థలాలు చూపకుంటే చంద్రగిరి మండలంలో జరిగే జన్మభూమిని అడ్డుకుంటామని మామండూరు గ్రామస్తులు అధికారులను హెచ్చరించారు. ♦ ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు ప్రోటోకాల్ పాటిం చడం లేదని టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు గీతాయాదవ్ ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కార్వేటినగరం మండలం కేఎం పురంలో నిర్వహించిన జన్మభూమి–మా ఊరు సభలో అధికారకంగా స్టేజీపై కూర్చోవారిని పక్కనపెట్టి ఎలాంటి అర్హత లేని వారిని వేదికపై కూర్చోపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ♦ నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజాపాలనను విస్మరిం చింది. గతంలో జరిగిన ఐదు జన్మభూమి–మా ఊరు సభల్లో ఇచ్చిన ఫిర్యాదులకు ఇప్పటికీ పరిష్కారం చూపలేదు. మళ్లీ ఆరో విడత ఏం వెలగబెట్టడానికని జన్మభూమి గ్రామసభలు జరుపుతున్నారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి నిలదీశారు. ♦ చౌడేపల్లె మండలం చారాలలో ప్రోటోకాల్ పాటించకపోవడంతో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, టీడీపీ ఇన్చార్జి అనూషారెడ్డి, శ్రీనాథరెడ్డి గోబ్యాక్ అంటూ ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు నినాదాలు చేశారు. అయినా వారు వేదికపైనే కూర్చోని ఉండడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ♦ సమస్యలుంటే జన్మభూమి కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్ష్యంలోనే చెప్పమంటారు... తర్వాత అధి కారులు ఏమీ పట్టించుకోరు. ఇదేమిటని తవణంపల్లె మండలం చెర్లోపల్లె గ్రామ సభలో అధికారులపై డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ♦ కుశస్థలి నది కుడి, ఎడమ కాలువలు దురాక్రమణకు గురవుతున్నాయని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందిం చడం లేదని సీపీఐ నాయకులు నగరిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అధికారులను నిలదీశారు. ♦ నాగలాపురం మండలం కడివేడులో జరిగిన జన్మభూమి– మా ఊరు గ్రామ సభను ఆ గ్రామ దళితులు బహిష్కరించారు. జన్మభూమి ప్రారంభంలో వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ మండల కన్వీనర్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో దళితులు జన్మభూమి గ్రామసభను అడ్డుకున్నారు. ♦ తంబళ్లపల్లె మండలంలోని వేమారెడ్డిగారిపల్లె, పంచాలమర్రి గ్రామాల్లో జరిగిన గ్రామ సభలు రసాభాసగా సాగాయి. సమస్యలపై ప్రజలు అధికారులను నిలదీశారు. ప్రజలు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ♦ జన్మభూమి సభల్లో దరఖాస్తు చేస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదని స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. తిరుపతి నగరంలోని 2, 12, 22, 32, 42 వార్డుల్లో జన్మభూమి సభల్లో ఎమ్మెల్యే సుగుణమ్మకు ఈ అనుభవం ఎదురైంది. -
అప్పుడు బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. ఇప్పుడు అఫ్గాన్ ఆటగాళ్లు..
-
నాగినీ డ్యాన్స్ : జస్ట్ సీన్ మారిందంతే!
డెహ్రాడూన్: మైదానంలో మళ్లీ నాగినీ డ్యాన్స్.. జస్ట్ సీన్ మారింది అంతే.. అప్పుడు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఈ తరహా సంబరాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే.. ఇప్పుడు అదే స్టైల్‌ను ఆ జట్టుపైనే గెలిచి అఫ్గాన్ ఆటగాళ్లు రిపీట్ చేశారు. అయితే ఈ స్టైల్ అప్పట్లో పెద్ద వివాదానికే అగ్గి రాజేసిన విషయం తెలిసిందే. శ్రీలంకలో జరిగిన నిదహాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు విజయానందంలో తొలి సారి నాగిని డ్యాన్స్‌లు చేశారు. మరుసటి మ్యాచ్‌ల్లో శ్రీలంక ఆటగాళ్లు ఈ డ్యాన్స్‌కు ప్రతీకగా వికెట్లు పడగొట్టి నాదస్వరం ఊదారు. దీంతో ఆటగాళ్ల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. అసహనంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూం అద్దాలుకూడా ధ్వంసం చేశారు. ఇక గురువారం డెహ్రాడూన్ వేదికగా జరిగిన మూడో టీ20లో అఫ్గాన్ బంగ్లాపై ఒక్కపరుగు తేడాతో నెగ్గి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయానంతరం అఫ్గాన్ వికెట్ కీపర్ మహమ్మద్ షజాద్ నాగిని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. మరి కొంతమంది ఆటగాళ్లు కూడా షజాద్ బాటలో నడిచారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. చివరి ఓవర్ చివరి బంతికి బంగ్లా విజయానికి 4 పరుగులు కావాల్సి ఉండగా రషీద్ బౌలింగ్, షఫికుల్లా అద్భుత ఫీల్డింగ్ అఫ్గాన్‌ను గట్టెక్కించాయి. సిక్స్ వెళ్లే బంతిని షఫికుల్లా అద్భుతంగా అడ్డుకొని బంగ్లా బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేశాడు. ఈ తరహా ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్న నెటిజన్లు షఫికుల్లాను అభినందిస్తున్నారు. -
పూనకంతో ఊగిపోతూ హల్ చల్ చేసిన యువకుడు
-
నెత్తిపై రాయి.. నాగిని డాన్స్
సాక్షి, ప్రకాశం: మూఢనమ్మకాలను రూపుమాపేందుకు జన విజ్ఞాన వేదికలు కృషి చేస్తుంటే.. కొందరు మాత్రం ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ కుర్రాడు పూనకంతో ఊగిపోతూ హల్ చల్ చేశాడు. స్వయంభూ శివలింగం వెలిసిందంటూ దర్శి మండలం శివరాజ్ నగర్లో హడావుడి చేసాడు. శ్రీను అనే యువకుడు స్థానికంగా కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ, హఠాత్తుగా ఓ రాయిని శివలింగంగా చెబుతూ నెత్తిన పెట్టుకొని పూనకంతో ఊగిపోయాడు. తనను ముట్టుకోవద్దంటూ ఊగిపోతూ ప్రజల మధ్యలోకి వచ్చి ఆ రాయికి పూజలు చేశాడు. ఊరిపోలిమేరలో వెలసిన శివలింగానికి వెంటనే గుడికట్టాలని, లేదంటే ఊరికే అరిష్టం అంటూ నాగిని డాన్స్‌తో ఊగిపోయాడు. అతన్ని చూసిన గ్రామస్థులు స్వామి.. స్వామి అంటూ అతని చుట్టూ చేరటం విశేషం. ప్రస్తుతం వాట్సాప్‌లో అందుకు సంబంధించిన వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. -
గావస్కర్ నాగిని డాన్స్.. రైటా? రాంగా?
సాక్షి, స్పోర్ట్స్ : నిదాహస్ ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఓటమి సంగతి ఏమోగానీ.. గత మ్యాచ్‌లో వాళ్లు చేసిన నాగిని స్టెప్పులే వాళ్ల పాలిట ఇప్పుడు విలన్‌గా మారాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బంగ్లా ప్లేయర్లను ట్రోలింగ్‌తో ఓ ఆటాడేసుకుంటున్నారు. ఇందులో భాగంగా దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్(68) వేసిన నాగిని స్టెప్పు వీడియో కూడా వైరల్ అవుతుండటం విశేషం. మ్యాచ్ 9 ఓవర్లో ఉండగా.. కామెంటరీ బాక్స్‌లో ఉన్న గావస్కర్.. రోహిత్ బ్యాటింగ్ ధాటిని చూసి ఆపుకోలేకపోయారు. తన చెయిర్ నుంచి అమాంతం లేచిన ఆయన నాగిని స్టెప్పు వేసేశాడు. అది చూస్తూ మిగతా ఇద్దరు కామెంటేటర్లు తెగ నవ్వుకున్నారు. అఫ్కోర్స్ ఆ వీడియోను లైవ్‌లో చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్లు సరదాగానే తీసుకుని కామెంట్లు చేస్తున్నారు. కానీ, బంగ్లా క్రికెట్ అభిమానులకు మాత్రం అది ఏ మాత్రం రుచించలేదు. ‘దిగ్గజ ఆటగాడు మర్యాదపూర్వకంగా వ్యవహరించలేదంటూ కొందరు మండిపడుతుంటే.. ఆయన అలా చేయటం సరికాదంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఆయన చేసింది రైటా? రాంగా? అన్నది పక్కనపెడితే బంగ్లా ఆటగాళ్లు చేసిన పనికి వాళ్లపై మంటతో ఉన్నవాళ్లకు ఆ వీడియో తెగ కిక్కునిస్తోంది. Naagin dance performed by our Cricket experts...Take a bow #SunilGavaskar Sir !! 🙏😂😂 #INDvBAN #NidahasOnDSport #NidahasTrophy2018Final #SunilGavaskar pic.twitter.com/piad8GikZJ — Aritra Dey (@Captain_akshay) 18 March 2018 -
వైరల్ : బంగ్లాదేశ్ క్రికెటర్ నాగిని డ్యాన్స్!
కొలంబో : నిదహాస్ ట్రోఫీలో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ నాగిని డ్యాన్స్‌తో అలరించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు చారిత్రాత్మక విజయం అందించిన ఈ బంగ్లా ఆటగాడు పట్టరాని సంతోషంతో నాగిని డ్యాన్స్‌తో చిందేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ముష్ఫికర్ బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు నాగిని డ్యాన్స్ సైతం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ బంగ్లా క్రికెటర్‌ను ప్రశంసిస్తూ నెటిజన్లు వరుస ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. ‘నీ ప్రదర్శనతో మా మనసులు గెలుచుకున్నావు,’ అని ఒకరంటే.. ముష్పికర్ నీ డ్యాన్స్ ఇప్పటి వరకు చూడలేదని మరొకరు.. ఇండియన్ నాగిని డ్రామాలా ఉందని ఇంకొకరు ట్వీట్ చేస్తున్నారు. ముష్ఫికర్ రహీమ్ (35 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), లిటన్ దాస్ (19 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల వీరోచిత ఆటతో ఆతిథ్య శ్రీలంకపై బంగ్లాదేశ్ చరిత్రలో రికార్డు ఛేదన నమోదు చేసింది. -
బంగ్లాదేశ్ క్రికెటర్ నాగిని డ్యాన్స్!
-
ఇదో వెరైటీ నిరసన
ముంబై: తమ సమస్యలను పరిష్కరించమని పాలకులకు ప్రజలు విన్నపాలు పెట్టుకోవడం సర్వ సాధారణం. విధాన నిర్ణేతలకు విజ్ఞాపనపత్రాలు కూడా సమర్పిస్తుంటారు. అప్పటికీ పరిష్కారం లభించకపోతే నిరసన, ఆందోళన తెలుపుతారు. మహారాష్ట్రలోని బుల్దనా జిల్లా వాసులు కూడా నిరసన తెలిపారు కాస్త వెరైటీగా. ప్రజా పనుల శాఖ తమ ప్రాంతంపై చూపుతున్న వివక్షను నిరసిస్తూ పీడబ్ల్యూడీ కార్యాలయంలో స్థానికులు నాగిని నృత్యం చేశారు. నాగిని డాన్స్ చేస్తూ అధికారులు చుట్టూ తిరిగారు. స్థానికుల వెరైటీ నిరసనతో అధికారులు అవాక్కయ్యారు. ఈ వీడియో మీడియాకు ఎక్కడంతో బుల్దనా వాసుల సమస్యలు పాలకుల దృష్టికి వెళ్లాయి. ఛత్రపతి శివాజీ మార్కెట్ సమీపంలోని రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో విసుగెత్తిపోయి నాగిని నృత్యంతో నిరసనకు దిగినట్టు చెప్పారు.