
ఇదో వెరైటీ నిరసన
ముంబై: తమ సమస్యలను పరిష్కరించమని పాలకులకు ప్రజలు విన్నపాలు పెట్టుకోవడం సర్వ సాధారణం. విధాన నిర్ణేతలకు విజ్ఞాపనపత్రాలు కూడా సమర్పిస్తుంటారు. అప్పటికీ పరిష్కారం లభించకపోతే నిరసన, ఆందోళన తెలుపుతారు. మహారాష్ట్రలోని బుల్దనా జిల్లా వాసులు కూడా నిరసన తెలిపారు కాస్త వెరైటీగా.
ప్రజా పనుల శాఖ తమ ప్రాంతంపై చూపుతున్న వివక్షను నిరసిస్తూ పీడబ్ల్యూడీ కార్యాలయంలో స్థానికులు నాగిని నృత్యం చేశారు. నాగిని డాన్స్ చేస్తూ అధికారులు చుట్టూ తిరిగారు. స్థానికుల వెరైటీ నిరసనతో అధికారులు అవాక్కయ్యారు. ఈ వీడియో మీడియాకు ఎక్కడంతో బుల్దనా వాసుల సమస్యలు పాలకుల దృష్టికి వెళ్లాయి.
ఛత్రపతి శివాజీ మార్కెట్ సమీపంలోని రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో విసుగెత్తిపోయి నాగిని నృత్యంతో నిరసనకు దిగినట్టు చెప్పారు.