Buldhana
-
మాజీ క్రికెటర్‌కు యాక్సిడెంట్.. స్పాట్లోనే భార్య కన్నుమూత
మాజీ రంజీ క్రికెటర్.. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెబ్ బోర్డుకు చీఫ్ క్యురేటర్‌గా వ్యవహరిస్తున్న ప్రవీణ్ హింగానికర్ బుధవారం ఘరో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని మెకర్ తాలుకా సమీపంలోని సంవృద్ది హైవేపై ఆగి ఉన్న ట్రక్‌ను కారు వెనుక నుంచి గుద్దింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా ప్రవీణ్ హింగానికర్ భార్య సువర్ణ హింగానికర్ స్పాట్లోనే కన్నుమూసింది. తీవ్ర గాయాలపాలైన ప్రవీణ్‌ను మెకర్ రూలర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందింస్తున్నారు. కాగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రవీణ్ హింగానికర్ విదర్భ తరపున రంజీ క్రికెట్ ఆడాడు. పలు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రవీణ్ 52 మ్యాచ్‌ల్లో 1400 పరుగులతో పాటు 47 వికెట్లు తీసుకున్నాడు. 11 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 271 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆటకు దూరమైన తర్వాత 2008 నుంచి 2018 వరకు నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి క్యురేటర్‌గా వ్యవహరించాడు. పిచ్ క్యురేటర్ అందరి మన్ననలు అందుకున్న ప్రవీణ్‌ను బీసీసీఐ.. అప్పటికి మంచి పిచ్ క్యురేటర్ కోసం వెతుకుతున్న బీసీబీకి సిఫార్సు చేసింది. దీంతో 2018లో బీసీబీ ప్రవీణ్ హింగానికర్ను అసిస్టెంట్ పిచ్ క్యురేటర్‌గా నియమించుకుంది. ప్రస్తుతం ప్రవీణ్ హింగానికర్ బీసీబీ ప్రధాన పిచ్ క్యురేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. Ranji cricket coach Pravin Hinganikar was injured in an accident at Mehkar taluka near Samruddhi Highway in Buldhana district. In this accident, Hinganikar's wife Suvarna Hinganikar died on the spot. The injured Hinganikar has been admitted to a hospital for treatment: Buldhana… — ANI (@ANI) April 19, 2023 చదవండి: ఇది విన్నారా.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి! -
కరోనా పేషెంట్ల మరుగుదొడ్లు కడిగిన చిన్నారి.. వీడియో వైరల్
ముంబై(బుల్దానా): కరోనా పేషంట్లకు ఉపయోగిస్తున్న మరుగుదొడ్లను 8 ఏళ్ల చిన్నారితో కడిగించిన అవమానీయ ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సంగ్రామ్పూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరోడ్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషద్ పాఠశాలను కొద్ది రోజల క్రితం కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌గా మార్చారు. ప్రస్తుతం ఈ ఐసోలేషన్ సెంటర్లో 15 మంది కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఉన్నారు. కాగా మే 29న ఐసోలేషన్ సెంటర్ నిర్వహణ ఎలా ఉందో చూడడానికి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వస్తున్నట్లు గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సంగ్రామ్పూర్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఇన్స్పెక్షన్ నేపథ్యంలో పాఠశాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అక్కడి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అయితే పనిచేయడానికి పారిశుధ్య కార్మికులు రాకపోవడంతో సెంటర్ నిర్వాహకుడు.. ఊరిలో బంధువులను చూడడానికి వచ్చిన 8 ఏళ్ల చిన్నారిని బలవంతంగా పాఠశాలకు తీసుకెళ్లాడు. కరోనా పేషంట్ల మరుగుదొడ్లను శుభ్రం చేయాలని.. లేకపోతే కట్టెతో కొడతానని బెదిరించాడు.దీంతో భయపడిన ఆ చిన్నారి మరుగుదొడ్లను ఏడుస్తూనే శుభ్రం చేశాడు. పని పూర్తయ్యాకా 50 రూపాయలు ఆ పిల్లాడి చేతిలో పెట్టి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడినుంచి పంపిచేశాడు. కాగా దీనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో పిల్లాడు మరుగుదొడ్లు శుభ్రం చేస్తుంటే నిర్వాహకుడు అతనికి మరాఠిలో సూచనలు ఇవ్వడం కనిపించింది. విషయం తెలుసుకున్న అధికారులు సదరు వ్యక్తిని విధుల నుంచి తొలగించి పోలీసులకు అప్పజెప్పారు. కాగా పోలీసులు ఆ వ్యక్తిపై బాలకార్మిక చట్టం కింద కేసు నమోదు చేశారు. చదవండి: కరోనా సెకండ్ వేవ్: 624 మంది డాక్టర్లు మృతి 8 yr old school kid was forced to clean toilet of quarantine centre with 15 covid +ve patients in it; in buldhana, maharashtra. This is world's best CM @OfficeofUT 's maharashtra model. pic.twitter.com/sJXCt5aNAP — आलू बोंडा (@ek_aalu_bonda) June 1, 2021 -
బీజేపీ టీషర్ట్ ధరించి ఉరేసుకున్న రైతు
బుల్దానా (మహారాష్ట్ర): కమలం గుర్తున్న బీజేపీ టీషర్ట్ ధరించి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడిని రాజు తల్వారే (38)గా గుర్తించారు. ఆదివారం ఉదయం ఖాట్కేడ్ గ్రామంలోని చెట్టుకు అతడు వేలాడుతూ కనిపించాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతోనే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతడి టీషర్ట్ మీద ‘ప్రస్తుతమున్న ప్రభుత్వాన్నే తిరిగి ఎన్నుకుందాం’ అన్న వాక్యం ఉంది. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఈ టీషర్ట్లను పంచింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడే రైతు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. -
ఇదో వెరైటీ నిరసన
ముంబై: తమ సమస్యలను పరిష్కరించమని పాలకులకు ప్రజలు విన్నపాలు పెట్టుకోవడం సర్వ సాధారణం. విధాన నిర్ణేతలకు విజ్ఞాపనపత్రాలు కూడా సమర్పిస్తుంటారు. అప్పటికీ పరిష్కారం లభించకపోతే నిరసన, ఆందోళన తెలుపుతారు. మహారాష్ట్రలోని బుల్దనా జిల్లా వాసులు కూడా నిరసన తెలిపారు కాస్త వెరైటీగా. ప్రజా పనుల శాఖ తమ ప్రాంతంపై చూపుతున్న వివక్షను నిరసిస్తూ పీడబ్ల్యూడీ కార్యాలయంలో స్థానికులు నాగిని నృత్యం చేశారు. నాగిని డాన్స్ చేస్తూ అధికారులు చుట్టూ తిరిగారు. స్థానికుల వెరైటీ నిరసనతో అధికారులు అవాక్కయ్యారు. ఈ వీడియో మీడియాకు ఎక్కడంతో బుల్దనా వాసుల సమస్యలు పాలకుల దృష్టికి వెళ్లాయి. ఛత్రపతి శివాజీ మార్కెట్ సమీపంలోని రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో విసుగెత్తిపోయి నాగిని నృత్యంతో నిరసనకు దిగినట్టు చెప్పారు.