Former Ranji cricketer Praveen Hinganikar injured in an accident, wife dies on the spot - Sakshi
Sakshi News home page

Praveen Hinganikar: మాజీ క్రికెటర్‌కు యాక్సిడెంట్‌.. స్పాట్‌లోనే భార్య కన్నుమూత

Published Wed, Apr 19 2023 7:49 PM | Last Updated on Wed, Apr 19 2023 9:05 PM

Former Ranji Cricketer Praveen Hinganikar Injured-Wife Spot-Dead-Accident - Sakshi

మాజీ రంజీ క్రికెటర్‌.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ క్రికెబ్‌ బోర్డుకు చీఫ్‌ క్యురేటర్‌గా వ్యవహరిస్తున్న ప్రవీణ్‌ హింగానికర్‌ బుధవారం ఘరో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని మెకర్‌ తాలుకా సమీపంలోని సంవృద్ది హైవేపై ఆగి ఉన్న ట్రక్‌ను కారు వెనుక నుంచి గుద్దింది.

ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా ప్రవీణ్‌ హింగానికర్‌ భార్య సువర్ణ హింగానికర్‌ స్పాట్‌లోనే కన్నుమూసింది. తీవ్ర గాయాలపాలైన ప్రవీణ్‌ను మెకర్‌ రూలర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందింస్తున్నారు. కాగా డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఇక ప్రవీణ్‌ హింగానికర్‌ విదర్భ తరపున రంజీ క్రికెట్‌ ఆడాడు. పలు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రవీణ్‌ 52 మ్యాచ్‌ల్లో 1400 పరుగులతో పాటు 47 వికెట్లు తీసుకున్నాడు. 11 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 271 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు పడగొట్టాడు. 

ఇక ఆటకు దూరమైన తర్వాత 2008 నుంచి 2018 వరకు నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియానికి క్యురేటర్‌గా వ్యవహరించాడు. పిచ్‌ క్యురేటర్‌ అందరి మన్ననలు అందుకున్న ప్రవీణ్‌ను బీసీసీఐ.. అప్పటికి మంచి పిచ్‌ క్యురేటర్‌ కోసం వెతుకుతున్న బీసీబీకి సిఫార్సు చేసింది. దీంతో 2018లో బీసీబీ ప్రవీణ్‌ హింగానికర్‌ను అసిస్టెంట్‌ పిచ్‌ క్యురేటర్‌గా నియమించుకుంది. ప్రస్తుతం ప్రవీణ్‌ హింగానికర్‌ బీసీబీ ప్రధాన పిచ్‌ క్యురేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

చదవండి: ఇది విన్నారా.. ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement