ముంబై: తన కుమార్తె తల్లి కోసం ఏడుస్తోందని, తనకు తల్లిని ఎలా తీసుకురావాలని ముంబై బీఎండబ్ల్యూ కారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కావేరీ నక్వా భార్త ప్రదీప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరు అయ్యారు.
‘ప్రమాదం జరిగిన వెంటనే మా స్కూటీని ఢికొట్టిన కారు వెంటనే 500 మీటర్ల వరకు పరిగెత్తాను. అయినా భార్య కనిపించలేదు. నేను ఎంత ఏడ్చినా కారు నడిపే యువకుడు అస్సలు కారును ఆపలేదు. అతను ఒక్క సెకండ్ కారు ఆపి ఉంటే.. ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. నా కూతురు తల్లి కోసం తీవ్రంగా ఏడుస్తోంది.
.. అమ్మ ఎక్కడి వెళ్లిందని అడుగుతోంది. నేను ఇప్పుడు నా బిడ్డకు ప్రాణాలు కోల్పోయిన తల్లిని ఎలా తీసుకురావాలి?. కారు నడిపిన యువకుడు పలుకుబడి ఉన్న వ్యక్తి కుమారుడు. నేను చాలా పేదవాడిని. నాలాంటి పేదవాడిని ఎవరూ పట్టించుకోరు’అని ప్రదీప్ కన్నీరు పెట్టుకున్నారు. చేపలు అమ్ముకొని జీవించే ఈ దంపతులు ఆదివారం ఉదయం సాసూన్ డాక్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
చదవండి: ముంబై హిట్ అండ్ రన్ కేసు: ఒళ్లు గగుర్పొడిచేలా.. వెలుగులోకి సంచలన విషయాలు
ఆదివారం ఉదయం ముబబైలోని వర్లీ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు.. ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టడంతో దానిపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు కావేరి నక్వా పైనుంచి దూసుకువెళ్లటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త ప్రదీప్‌కు స్వల్పగాయాలయ్యాయి.
ఈ ఘటనలో మద్యం మత్తులో లగ్జరీ కారు నడుపుతూ దంపతులను ఢీకొట్టి మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైన నిందితుడు మిహిర్ షాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అతడు పరారీలో ఉండగా.. 72 గంటల తర్వాత ముంబయికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరార్‌లోని అపార్ట్‌మెంట్‌లో మిహిర్ షాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతని తల్లి, సోదరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని వర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే గత మూడు రోజులుగా కొడుకును దాచి పెట్టడంతో తండ్రి, శివసేన(ఏక్‌నాథ్ షిండే) నేత రాజేష్ షాా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక షాు అరెస్టుకు ముందు అతడి తప్పతాగి రూ. 18 వేల బిల్ చేసిన ద వైస్ గ్లోబల్ తపస్ బార్‌ను పోలీసులు సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment