ఆసియాకప్-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి మరో నాలుగు బంతులు మిగిలూండగానే ఛేదించింది. అయితే మ్యాచ్ సగం వరకు బంగ్లాదేశ్‌కే గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ.. అఖరి ఓవర్లలో బౌలింగ్ తప్పిదాల వల్ల మ్యాచ్‌ను కోల్పోయింది.
ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు ఏకంగా నాలుగు నో బాల్స్ వేశారు. అఖరికి శ్రీలంకకు విన్నింగ్ రన్ కూడా నో బాల్ రూపంలోనే వచ్చింది. ఈ క్రమంలో శ్రీలంక ఆటగాళ్లతో పాటు మేనేజేమెంట్ సైతం గెలుపు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ముఖ్యంగా శ్రీలంక ఆల్ రౌండర్ చమికా కరుణరత్నే 'నాగిన్ డాన్స్' చేస్తే తన సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. అతడు డ్యాన్స్ చేయడం ప్రారంభించిన వెంటనే స్టాండ్స్‌లో ఉన్న శ్రీలంక అభిమానులు కూడా నాగిన్ డాన్స్ చేయడం మొదలపెట్టారు.
కాగా 2018 నిదాహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకపై విజయం సాధించిన అనంతరం బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ నాగిన్ డ్యాన్ చేసి గెలుపు సంబారాలు జరపుకున్నాడు. అతడితో పాటు మిగితా ఆటగాళ్లు కూడా చిందులు వేశారు. అప్పటి నుంచి బంగ్లా ఆటగాళ్ల నాగిని డ్యాన్స్ ఫేమస్ అయింది. ఇప్పడు దానికి బదలుగా కరుణరత్నే డ్యాన్స్ చేస్తూ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
What a view
— Sumit Raj (@Iam_SUMITRAJ) September 1, 2022
Nagin Dance 🐍 🐍 By Chamika karunaratne #AsiaCupT20 #BANVSSL @ChamikaKaru29 pic.twitter.com/47yxsHLelL
చదవండి: Asia Cup 2022: బంగ్లాదేశ్ కొంపముంచిన నో బాల్.. ఒక్కడికే మూడు ఛాన్స్‌లు!
Comments
Please login to add a commentAdd a comment