Asia Cup 2022: Full Schedule Venue Time Live Streaming Check All Details - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: ఆసియా కప్‌ 15వ ఎడిషన్‌ పూర్తి షెడ్యూల్‌, ఇతర వివరాలు

Published Sat, Aug 27 2022 10:56 AM | Last Updated on Sat, Aug 27 2022 5:07 PM

Asia Cup 2022: Full Schedule Venue Time Live Streaming Check All Details - Sakshi

Twitter Pic

Asia Cup 2022: Full Schedule: మరికొన్ని గంటల్లో క్రికెట్‌ మెగా ఈవెంట్‌ ఆసియా కప్‌- 2022 టోర్నీకి తెరలేవనుంది. దుబాయ్‌ వేదికగా శ్రీలంక- అఫ్గనిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ 15వ ఎడిషన్‌ ఆరంభం కానుంది.

ఇక భారత్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌తో పాటు క్వాలిఫైయర్స్‌లో నెగ్గిన హాంకాంగ్‌ సైతం పాల్గొననుంది. గ్రూపు- ఏలో భారత్‌, పాకిస్తాన్‌, హాంకాంగ్‌ జట్టు ఉండగా.. గ్రూప్‌- బిలో శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్నాయి. 

మరి.. క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్‌-2022 ఈవెంట్‌ పూర్తి షెడ్యూల్‌, మ్యాచ్‌లు జరిగే వేదికలు, మ్యాచ్‌ ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ? తదితర పూర్తి వివరాలు...

ఆసియా కప్‌- 2022 షెడ్యూల్‌
1. ఆగష్టు 27- శనివారం- శ్రీలంక వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌(గ్రూప్‌- బి)- దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం, దుబాయ్‌
2. ఆగష్టు 28- ఆదివారం- ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌(గ్రూప్‌- ఏ)- దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం, దుబాయ్‌
3. ఆగష్టు 30- మంగళవారం- బంగ్లాదేశ్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌(గ్రూప్‌- బి)- షార్జా క్రికెట్‌ స్టేడియం
4. ఆగష్టు 31- బుధవారం- ఇండియా వర్సెస్‌ హాంకాంగ్‌(గ్రూప్‌-ఏ)- దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం, దుబాయ్‌
5. సెప్టెంబరు 1- గురువారం- శ్రీలంక వర్సెస్‌ బంగ్లాదేశ్‌(గ్రూప్‌ బి)- దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం, దుబాయ్‌
6. సెప్టెంబరు 2- శుక్రవారం- పాకిస్తాన్‌ వర్సెస్‌ హాంకాంగ్‌(గ్రూప్‌- ఏ)- షార్జా క్రికెట్‌ స్టేడియం- షార్జా

సూపర్‌ 4 స్టేజ్‌ మ్యాచ్‌లు- వేదిక- దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం, దుబాయ్‌
7. సెప్టెంబరు 3- శనివారం- గ్రూప్‌ బి టాపర్‌ వర్సెస్‌ గ్రూప్‌ బి సెకండ్‌ టాపర్‌
8. సెప్టెంబరు 4- ఆదివారం- గ్రూప్‌ ఏ టాపర్‌ వర్సెస్‌ గ్రూప్‌ ఏ సెకండ్‌ టాపర్‌
9. సెప్టెంబరు 6- మంగళవారం- గ్రూప్‌ ఏ టాపర్‌ వర్సెస్‌ గ్రూప్‌ బి టాపర్‌

10. సెప్టెంబరు 7- బుధవారం- గ్రూప్‌ ఏ సెకండ్‌ టాపర్‌ వర్సెస్‌​ గ్రూప్‌ బి సెకండ్‌ టాపర్‌
11. సెప్టెంబరు 8- గురువారం- గ్రూప్‌ ఏ టాపర్‌ వర్సెస్‌ గ్రూప్‌ బి సెకండ్‌ టాపర్‌
12. సెప్టెంబరు 9- శుక్రవారం- గ్రూప్‌ బి టాపర్‌ వర్సెస్‌ గ్రూప్‌ ఏ సెకండ్‌ టాపర్‌
13. సెప్టెంబరు 11- ఫైనల్‌

మ్యాచ్‌ ఆరంభ సమయం
టీ20 ఫార్మాట్‌లో జరుగనున్న ఆసియా కప్‌ 15 ఎడిషన్‌ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం

ప్రసార వేదికలు
స్టార్‌ స్పోర్ట్స్‌ చానెల్‌
లైవ్‌ స్ట్రీమింగ్‌: డిస్నీ+ హాట్‌స్టార్‌

చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌ టోర్నీలో పాల్గొనబోయే టీమ్‌లు.. అన్ని జట్ల ఆటగాళ్ల వివరాలు
Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్‌! కానీ కోహ్లి మాత్రం..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement