ఆసియా కప్ టోర్నీలో భాగంగా గ్రూఫ్ దశలో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక సూపర్-4 దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌పై లంక మ్యాచ్ గెలిచిన అనంతరం ఆ జట్టు బ్యాటర్ చమిక కరుణరత్నే నాగిన్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ట్విటర్‌ను షేక్ చేశాయి.
తాజాగా నాగిన్ డ్యాన్స్ చేయడంపై కరుణరత్నే స్పందించాడు. నాలుగేళ్ల పగను మనుసులో దాచుకున్నానని.. అందుకే ఇవాళ నాగిన్ డ్యాన్స్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. 2018 నిదహాస్ ట్రోఫీలో శ్రీలంకను ఓడించి బంగ్లాదేశ్ ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ చేరిన క్రమంలో బంగ్లాదేశ్ కోచ్ సహా ప్రధాన ఆటగాళ్లంతా మైదానంలో వచ్చి నాగిన్ డ్యాన్స్ చేయడం అప్పట్లో అందరిని ఆశ్చర్యపరిచింది.
అప్పటి శ్రీలంక జట్టులో కరుణరత్నే లేకపోయినప్పటికి ఆ మ్యాచ్‌ను టీవీలో చూశాడు. అయితే తాను జట్టులోకి వచ్చిన తర్వాత బంగ్లదేశ్‌తో మ్యాచ్‌లు ఆడినప్పటికి అలాంటి అవకాశం రాలేదు. తాజాగా ఆసియా కప్ రూపంలో బంగ్లాదేశ్‌ను నాకౌట్ చేయడం.. కరుణరత్నే నాలుగేళ్ల పగను నాగిన్ డ్యాన్స్ రూపంలో బయటికి తీసి బంగ్లాపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక శనివారం జరిగిన సూపర్-4 లీగ్ దశలో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించిన లంక ప్రతీకారం తీర్చుకుంది.
What a view
— Sumit Raj (@Iam_SUMITRAJ) September 1, 2022
Nagin Dance 🐍 🐍 By Chamika karunaratne #AsiaCupT20 #BANVSSL @ChamikaKaru29 pic.twitter.com/47yxsHLelL
చదవండి: బంగ్లాదేశ్‌పై సంచలన విజయం.. నాగిన్ డాన్స్ చేసిన శ్రీలంక ఆటగాడు!
Comments
Please login to add a commentAdd a comment