Karunaratne
-
పట్టు బిగించిన కివీస్.. ఫాలోఆన్ గండం తప్పేదెలా?
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. కివీస్ బౌలర్ల దాటికి లంక తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. తద్వారా కివీస్‌కు 416 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో లంకను ఫాలోఆన్ ఆడించడానికే కివీస్ మొగ్గుచూపింది. లంక ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే. ఫాలోఆన్ ఆడుతున్న లంక ప్రస్తుతం వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. కరుణరత్నే 21, కుషాల్ మెండిస్ క్రీజులో ఉన్నారు. రెండు వికెట్ల నష్టానికి 26 పరుగుల క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను కొనసాగించిన లంక ఇన్నింగ్స్ ముగియడానికి పెద్దగా సమయం పట్టలేదు. 66.5 ఓవర్ల పాటు ఆడిన లంక 164 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కరుణరత్నే 89 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చండిమల్ 37 పరుగులు మినహా మిగతావారంతా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, మైకెల్ బ్రాస్‌వెల్ చెరో మూడు వికెట్లు తీయగా.. సౌథీ, టింక్నర్, బ్రాస్‌వెల్‌లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 580 పరుగులు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. కేన్ విలియమ్సన్(215 పరుగులు), హెన్రీ నికోల్స్(200 పరుగులు) డబుల్ సెంచరీలతో చెలరేగగా.. కాన్వే 78 పరుగులు చేసింది. నాలుగో రోజు ఉదయం సెషన్‌లోగా మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. చదవండి: విండీస్ ఘన విజయం; కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు New Zealand vs Sri Lanka 2nd Test: విలియమ్సన్, నికోల్స్ ‘డబుల్’ సెంచరీలు -
'నాలుగేళ్ల పగను మనసులో దాచుకున్నా'.. అందుకే నాగిన్ డ్యాన్స్
ఆసియా కప్ టోర్నీలో భాగంగా గ్రూఫ్ దశలో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక సూపర్-4 దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌పై లంక మ్యాచ్ గెలిచిన అనంతరం ఆ జట్టు బ్యాటర్ చమిక కరుణరత్నే నాగిన్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ట్విటర్‌ను షేక్ చేశాయి. తాజాగా నాగిన్ డ్యాన్స్ చేయడంపై కరుణరత్నే స్పందించాడు. నాలుగేళ్ల పగను మనుసులో దాచుకున్నానని.. అందుకే ఇవాళ నాగిన్ డ్యాన్స్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. 2018 నిదహాస్ ట్రోఫీలో శ్రీలంకను ఓడించి బంగ్లాదేశ్ ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ చేరిన క్రమంలో బంగ్లాదేశ్ కోచ్ సహా ప్రధాన ఆటగాళ్లంతా మైదానంలో వచ్చి నాగిన్ డ్యాన్స్ చేయడం అప్పట్లో అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పటి శ్రీలంక జట్టులో కరుణరత్నే లేకపోయినప్పటికి ఆ మ్యాచ్‌ను టీవీలో చూశాడు. అయితే తాను జట్టులోకి వచ్చిన తర్వాత బంగ్లదేశ్‌తో మ్యాచ్‌లు ఆడినప్పటికి అలాంటి అవకాశం రాలేదు. తాజాగా ఆసియా కప్ రూపంలో బంగ్లాదేశ్‌ను నాకౌట్ చేయడం.. కరుణరత్నే నాలుగేళ్ల పగను నాగిన్ డ్యాన్స్ రూపంలో బయటికి తీసి బంగ్లాపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక శనివారం జరిగిన సూపర్-4 లీగ్ దశలో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించిన లంక ప్రతీకారం తీర్చుకుంది. What a view Nagin Dance 🐍 🐍 By Chamika karunaratne #AsiaCupT20 #BANVSSL @ChamikaKaru29 pic.twitter.com/47yxsHLelL — Sumit Raj (@Iam_SUMITRAJ) September 1, 2022 చదవండి: బంగ్లాదేశ్‌పై సంచలన విజయం.. నాగిన్ డాన్స్ చేసిన శ్రీలంక ఆటగాడు! -
లంక క్రికెటర్‌ను చుట్టుముట్టిన కష్టాలు.. రెండురోజుల పాటు
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే.తినడానికి సరైన తిండి దొరక్క అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆర్ధిక సంక్షోభానికి.. రాజకీయ సంక్షోభం కూడా తోడవ్వడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. లంక అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆ దేశ ప్రజలు ప్రెసిడెన్షియల్ భవనాన్ని ముట్టడించారు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవడంతో గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ముందుగా మాల్దీవులు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్ చేరుకున్న ఆయన అక్కడి నుంచి తన రాజీనామా పత్రాన్ని ఈమెయిల్ ద్వారా పంపించారు. కాగా తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టి దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఇదిలా ఉంటే దేశంలో నిత్యవసరాలు సహా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్ కోసం రోజుల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. తాజాగా ఆ ప్రభావం లంక క్రికెటర్లపై కూడా పడింది. దేశంలో పెట్రోల్, డీజిల్ దొరకక.. ఎందరో ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటున్నారు.గ్రౌండ్ వరకు వెళ్లాలంటే రవాణావ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి దారుణమైన పరిస్థితిని శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు రెండు రోజుల పాటు క్యూలో నిల్చున్న కరుణరత్నే పెట్రోల్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఏఎన్ఐ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కరుణరత్నే మాట్లాడుతూ.. ''దొరికిన పది వేల రూపాయల పెట్రోల్ తో రెండు మూడు రోజుల వరకు ప్రాక్టీస్‌కు వెళ్లాలి. దేశంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే బాధ కలుగుతుంది. దేశానికి అండగా నిలబడుతూనే మా ఆటపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. గొటబాయ రాజపక్స రాజీనామా తర్వాతైనా లంకకు అధ్యక్షుడిగా మంచి వ్యక్తులు వస్తారని ఆశిస్తున్నా. త్వరలోనే అంతా సర్దుకుంటుందని.. శ్రీలంక ప్రజలకు కచ్చితంగా మంచి జరుగుతుందని'' ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఆసియా కప్ 2022కు శ్రీలంకనే ఆతిధ్యం ఇవ్వనుంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను లంక క్రికెటర్లను కలవరపెడుతోంది. ఆసియా కప్ లో రాణించాలంటే కనీస ప్రాక్టీస్ ఎంతో అవసరం. అయితే లంక క్రికెటర్లు చాలా మంది కూడా పెట్రోల్, డీజిల్ కొరతతో గ్రౌండ్ లకు వెళ్లి ప్రాక్టీస్ కూడా చేయలేకపోతున్నారు. మరి ఆసియా కప్ వేదికను ఐసీసీ మారుస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే మ్యాచ్ లు జరిగే సమయంలో ఆటగాళ్లను మైదానాలకు తీసుకెళ్లడం.. హోటల్ కు తీసుకురావడం కోసం ఎంతగానో చమురు అవసరం పడుతుంది. శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ముదిరి పాకానా పడ్డప్పటికి గత నెలలో ఆస్ట్రేలియా జట్టు లంక పర్యటనకు వచ్చింది. కష్టాల్లో ఉన్న లంకతో సిరీస్ ఆడి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొంది. టి20 సిరీస్ ను ఆస్ట్రేలియా.. వన్డే సిరీస్ ను శ్రీలంక గెలుచుకుంది. రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్‌లో మాత్రం ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి డ్రా చేసుకున్నాయి. ఇక కరుణరత్నే 2019లో అంతర్జాతీయ క్రికెట్ లో కి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్ తో పాటు 18 వన్డే, 25 టీట్వంటీ మ్యాచ్ లు ఆడాడు. #WATCH | Sri Lankan cricketer Chamika Karunaratne speaks to ANI; says, "We've to go for practices in Colombo&to different other places as club cricket season is on but I've been standing in queue for fuel for past 2 days. I got it filled for Rs 10,000 which will last 2-3 days..." pic.twitter.com/MkLyPQSNbZ — ANI (@ANI) July 16, 2022 చదవండి: Gotabaya Rajapaksa: అందుకోసం శతవిధాల ప్రయత్నం చేశా: గొటబయ Virat Kohli: సెంచరీ కోసం కోహ్లి కూడా ఇంతలా తపించి ఉండడు.. -
చివరి వన్డేలో ఆసీస్ విజయం.. ఆస్ట్రేలియాకు లంక ఫ్యాన్స్ కృతజ్ఞతలు
శ్రీలంకతో శుక్రవారం జరిగిన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇప్పటికే లంక వరుసగా మూడు వన్డేలు గెలవడంతో సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. 1992 తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాపై శ్రీలంక వన్డే సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. ఇక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకకు ఆసీస్ క్రికెట్ ఆడేందుకు రావడం దేశానికి కాస్త ఊరటనిచ్చింది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆసీస్ క్రికెట్ బోర్డు పెద్ద మనసుతో లంక పర్యటనకు రావడం కాస్త ఆదాయాన్ని తెచ్చి పెట్టిందనే చెప్పొచ్చు. ఇక లంక జట్టు టి20 సిరీస్ కోల్పోయినప్పటికి.. వన్డే సిరీస్‌ను మాత్రం కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో లంక అభిమానులు కష్టాల్లో ఉన్న తమ దేశానికి వచ్చిన ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు తెలిపారు. చివరి వన్డే సందర్భంగా హాజరైన ప్రేక్షకులు ''లంక పర్యటనకు వచ్చినందుకు థాంక్యూ ఆస్ట్రేలియా'' అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు ప్రదర్శించడం ఆసక్తి రేపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. లంక అభిమానులు తమ చర్యతో అందరి హృదయాలను దోచుకున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన లంక ఒక దశలో 85 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో చమీర కరుణరత్నే 75 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి ప్రమోద్ మధుసూదన్ 15 పరుగులతో సహకరించాడు. కాగా లంక 43.1 ఓవర్లలో 160 పరుగులు చేయగా.. కరుణరత్నేవి 75 పరుగులు ఉండడం విశేషం. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కూడా మొదట్లో తడబడింది. డేవిడ్ వార్నర్(10), ఆరోన్ ఫించ్(0), జోష్ ఇంగ్లిష్(5) తొందరగానే వెనుదిరగడంతో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మిచెల్ మార్ష్ (24 పరుగులు), మార్నస్ లబుషేన్(31 పరుగులు) ఆదుకున్నారు. ఆ తర్వాత అలెక్స్ క్యారీ 45 నాటౌట్, కామెరున్ గ్రీన్ 25 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. The sea of blue has turned yellow 💛 A lovely gesture from the Sri Lanka fans for Australia 🤩#SLvAUS pic.twitter.com/zfip5VV7Zf — ICC (@ICC) June 24, 2022 చదవండి: సిక్సర్‌తో పంత్ అర్థశతకం.. ఫామ్‌లోకి వచ్చినట్టేనా! Daryl Mitchell: 73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్.. దిగ్గజాల సరసన చోటు -
ఆసీస్‌కు కలిసిరాని వర్షం.. రెండో వన్డేల్లో లంక గెలుపు
పల్లెకెలె: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య శ్రీలంక జట్టు 26 పరుగుల తేడాతో డక్‌వర్త్ లూయిస్(డీఎల్) పద్ధతిలో గెలిచింది. వర్షంతో మొదట 47.4 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్లకు 220 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (36), ధనంజయ (34), కెప్టెన్ షనక (34) మెరుగ్గా ఆడారు. తర్వాత మళ్లీ వర్షం రావడంతో డీఎల్ పద్ధతిలో ఆస్ట్రేలియాకు 43 ఓవర్లలో 221 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ఆసీస్ 37.1 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. వార్నర్ (37) టాప్ స్కోరర్ కాగా, లంక బౌలర్లలో కరుణరత్నే 3, వెల్లలగే, చమీర, ధనంజయ తలా 2 వికెట్లు తీశారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు 1–1తో సమంగా ఉన్నాయి. -
పాపం వెస్టిండీస్.. ఘోర ఓటమి
గాలే: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 187 పరుగుల తేడాతో గెలుపొందింది. 348 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన విండీస్ లంక స్పిన్నర్ల ధాటికి నిలబడలేక 160 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లు రమేశ్ మెండిస్ 5 వికెట్లు, లసిత్ ఎంబుల్డేనియా 4 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించారు. చదవండి: ‘చాంపియన్’తో సమరానికి సై అంతకు ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటై 156 పరుగుల ఆధిక్యం కోల్పోయిం ది. శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 191 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కరుణరత్నే (83), మాథ్యూస్ (69) అర్ధ సెంచరీలు చేశారు. చదవండి: టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బంగ్లా టి20 కెప్టెన్ -
SL Vs WI: కరుణరత్నే సెంచరీ.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక
గాలె: వెస్టిండీస్‌తో ఆదివారం మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 3 వికెట్లకు 267 పరుగులు సాధించింది. కెప్టెన్, ఓపెనర్ దిముత్ కరుణరత్నే (265 బంతుల్లో 132 బ్యాటింగ్; 13 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు.దీంతో ఈ ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 2021లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అత్యధికంగా 6 సెంచరీలు చేశాడు. కాగా మరో ఓపెనర్ పథుమ్ నిసాంక (140 బంతుల్లో 56; 7 ఫోర్లు)తో కలిసి కరుణరత్నే తొలి వికెట్‌కు 139 పరుగులు జోడించి లంకకు శుభారంభం ఇచ్చాడు. కరుణరత్నే టెస్టు కెరీర్లో ఇది 13వ సెంచరీ. నిసాంక అవుటయ్యాక ఒషాడా ఫెర్నాండో (3), మాథ్యూస్ (3) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అనంతరం కరుణరత్నేతో ధనంజయ డిసిల్వా (77 బంతుల్లో 55 బ్యాటింగ్; 5 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించారు. చదవండి: IND Vs NZ: పాపం హర్షల్ పటేల్.. రాహుల్ తర్వాత ఆ చెత్త రికార్డు నమోదు.. -
లంక క్రికెటర్‌కు అపురూపమైన కానుక అందించిన భారత స్టార్ ఆల్‌రౌండర్
కొలంబో: భారత్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ చమిక కరుణరత్నే అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. శ్రీలంక కోచ్ మికీ అర్థర్ అతడిని ‘ఫైండ్ ఆఫ్ ది సిరీస్’గా అభివర్ణించాడు. భారత్‌తో నిన్న జరిగిన తొలి టీ20లో శ్రీలంక ఓడినప్పటికీ కరుణరత్నేకు మాత్రం నిన్నటి రోజు గొప్ప మధురానుభూతిగా మిగిలిపోనుంది. తాను రోల్‌మోడల్‌గా భావించే హార్దిక్ పాండ్యా నుంచి బ్యాట్‌ను గిఫ్ట్‌గా అందుకోవడమే ఇందుకు కారణం. View this post on Instagram A post shared by Chamika Karunaratne (@chamikakarunaratne) హార్దిక్ నుంచి బ్యాట్ అందుకున్న అనంతరం కరుణరత్నే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోను పోస్టు చేశాడు. అరంగేట్ర టీ20లో రోల్ మోడల్ హార్దిక్ పాండ్యా నుంచి బ్యాట్‌ను అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ రోజును తానెప్పటికీ మర్చిపోలేనని, హార్దిక్‌ను భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షించాడు. కరుణరత్నే శ్రీలంక తరపున ఇప్పటి వరకు ఓ టెస్టు, ఏడు వన్డేలు, టీ20 ఆడాడు. భారత్‌తో జరిగిన తొలి వన్డేలో కరుణరత్నే 8వ స్థానంలో బరిలోకి దిగి 35 బంతుల్లో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, నిన్నటి తొలి టీ20లో ధవన్ సేన శ్రీలంకపై 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. -
ఆటగాళ్లకు షాకిచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డు
కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆటగాళ్ల జీతాలు తగ్గించడంపై వివాదం తలెత్తింది. ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకొన్నది. దీంతో కెప్టెన్ కరుణరత్నే, మాథ్యూస్,సురంగ లక్మల్,దినేష్ చండిమల్ సహా పలువురు సీనియర్ క్రికెటర్లు ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. కొత్త కేంద్ర ఒప్పందం ప్రకారం వికెట్ కీపర్లు నిరోషన్ దిక్వేలా, ధనంజయ్ డి సిల్వా మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల నెలసరి జీతం దాదాపు రూ.73 లక్షలు. బోర్డు వీరిని టాప్ క్యాటగిరిలో వేసింది. దీంతో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మే 23 నుంచి బంగ్లాదేశ్‌లో ఈ జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడవలసి ఉన్నది. కెప్టెన్‌కు కూడా తగ్గనున్న జీతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కరుణరత్నేకు కూడా ఆయన జీతంలో రూ.22 లక్షలు కోత విధించారు. ఈ ఏడాది జనవరిలో వాండరర్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన కరునరత్నే.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌లలో 427 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయినప్పటికీ బోర్డు నుంచి ఏమాత్రం ఉపశమనం లభించలేదు. కొత్త కాంట్రాక్టులో కరుణరత్నే జీతం రూ.73 లక్షల నుంచి రూ.51 లక్షలకు తగ్గించారు. (చదవండి:10-12 ఏళ్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సచిన్) -
శ్రీలంక గెలుపు దిశగా...
గాలే: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక విజయానికి దగ్గరైంది. 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 133 పరుగులు చేసింది. ఓపెనర్లు కరుణరత్నే (71 బ్యాటింగ్; 2 ఫోర్లు), తిరిమన్నె (57 బ్యాటింగ్; 4 ఫోర్లు) శుభారంభాన్నిచ్చారు. పట్టుదలగా ఆడి అర్ధసెంచరీలు సాధించారు. అబేధ్యమైన తొలి వికెట్‌కు 133 పరుగులు జోడించారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా చేతిలో 10 వికెట్లున్న శ్రీలంక లంచ్ విరామంలోపే లక్ష్యాన్ని అధిగమించే అవకాశాలున్నాయి. అంతకుముందు 196/7 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు శనివారం ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 106 ఓవర్లలో 285 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితంరోజు స్కోరుకు మరో 89 పరుగులు జతచేసి మిగిలిన 3 వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ వాట్లింగ్ (77; 6 ఫోర్లు), సోమర్విల్లే (40 నాటౌట్; 2 ఫోర్లు) ఎనిమిదో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో ఎంబుల్డెనియా 4, ధనంజయ డిసిల్వా 3 వికెట్లు తీశారు. -
మలింగపై వేటు... ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు కెప్టెన్‌గా కరుణరత్నె
శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వెటరన్ పేసర్ లసింత్ మలింగను తప్పించారు. ఇంగ్లండ్‌లో మే 30 నుంచి జూలై 14 వరకు జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే శ్రీలంక బృందానికి టెస్టు జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నె సారథ్యం వహిస్తాడు. మిగతా సభ్యులను నేడు ప్రకటిస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. కరుణరత్నె చివరి వన్డేను 2015 ప్రపంచకప్‌లో ఆడటం గమనార్హం. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కరుణరత్నె కెప్టెన్సీలో శ్రీలంక 2–0తో నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా రికార్డు సృష్టించింది. -
సౌతీకి 5 వికెట్లు: శ్రీలంక 275/9
వెల్లింగ్టన్: ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో 0–3తో టెస్టు సిరీస్ కోల్పోయిన శ్రీలంక జట్టు న్యూజిలాండ్ పర్యటననూ అదే ఆటతీరుతో మొదలెట్టింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం ప్రారంభమైన మొదటి టెస్టులో ఆట ముగిసే సమయానికి లంక తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. కివీస్ పేసర్ టిమ్ సౌతీ (5/67) ధాటికి 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ లంకను కరుణరత్నే (79; 11 ఫోర్లు), మాథ్యూస్ (83; 9 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 133 పరుగులు జతచేశారు. చివర్లో డిక్వెలా (91 బంతుల్లో 73 బ్యాటింగ్; 10 ఫోర్లు) ధాటిగా ఆడటంతో లంక ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంకులతో మెరిశారు..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో శ్రీలంక బ్యాట్స్‌మన్ దిముత్ కరుణరత్నే, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జాసన్ హోల్డర్లు తమ కెరీర్ అత్యుత్తమ ర్యాంకులను సాధించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 158 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 60 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కరుణరత్నే 21 స్థానాలు ఎగబాకి 10వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ జరిగిన రెండో టెస్టులో మొత్తంగా 11 వికెట్లు సాధించి విండీస్ గెలుపులో ముఖ్య భూమిక పోషించిన హోల్డర్ తొమ్మిది స్థానాలు పైకి ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. ఇక టెస్టు ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హోల్డర్ తొలిసారి టాప్-5లో నిలిచాడు. ఇక జట్టు ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించగా, బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
కరుణరత్నే సెంచరీ
గాలె: ఓపెనర్ దిముత్ కరుణరత్నే (222 బంతుల్లో 158 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకంతో మెరిసినా...ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో శ్రీలంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి రోజు లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌గా బరిలోకి దిగి చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన నాలుగో శ్రీలంక బ్యాట్స్‌మన్‌గా కరుణరత్నే ఘనత సాధించాడు. అనంతరం దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 4 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. చండిమాల్ ఔట్... గత నెలలో విండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన చండిమాల్, కోచ్ చండిక హతురసింఘే, మేనేజర్ అశాంక గురుసిన్హా ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. విండీస్‌తో టెస్టులో నిర్దేశిత సమయానికి మైదానంలోకి రాకుండా వీరు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడంపై ఐసీసీ విచారణ సాగుతోంది. ఐసీసీ తుది తీర్పు ఇవ్వకపోయినా, తాము తప్పు చేసినట్లు అంగీకరించి ఈ ముగ్గురు స్వచ్ఛందంగా సిరీస్‌కు దూరమయ్యారు. -
శ్రీలంక 227/4
అబుదాబి: పాకిస్తాన్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టును శ్రీలంక జాగ్రత్తగా ప్రారంభించింది. మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. దిముత్ కరుణరత్నే (205 బంతుల్లో 93; 5 ఫోర్లు) త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. ఒకదశలో లంక 61/3 స్కోరు వద్ద నిలవగా... కరుణరత్నే ఆదుకున్నాడు. కెప్టెన్ దినేశ్ చండిమాల్ (60 బ్యాటింగ్)తో కలిసి నాలుగో వికెట్‌కు 100 పరుగులు జోడించాడు. ప్రస్తుతం చండిమాల్‌తో పాటు డిక్వెలా (42 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 66 పరుగులు జత చేశారు. యాసిర్ షాకు 2 వికెట్లు దక్కాయి. -
నడి సంద్రాన...
►దారి తెలియని స్థితిలో శ్రీలంక క్రికెట్ ►వరుస పరాజయాలతో పతనం కెప్టెన్‌కు ఏం చేయాలో తెలియడం లేదు... బౌలర్లకు కనీసం క్రమశిక్షణతో లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం రావడం లేదు... కనీస అవగాహన లేని విధంగా ఫీల్డింగ్ ఏర్పాట్లతో ఆశ్చర్యపోయే వ్యూహాలు... గత ఐదు వారాలుగా భారత్‌తో జరుగుతున్న పోరులో శ్రీలంక క్రికెట్ జట్టు ఆట, పరిస్థితి చూస్తే జాలి కలగక మానదు. సొంతగడ్డపై బెబ్బులిలా ఒకప్పుడు ప్రత్యర్థులను ఆటాడించిన శ్రీలంక ఇప్పుడు బేలగా కనిపిస్తోంది. టెస్టు సిరీస్ 0–3తో పోయింది. వన్డే సిరీస్‌లో ఇప్పటికే 0–4. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత గత రెండు దశాబ్దాల కాలంలో లంక ఇంత ఘోరంగా ఎప్పుడూ ఓడలేదు. అన్నింటికి మించి ఇప్పుడు భవిష్యత్తు కూడా అంతా చీకటిగానే కనిపిస్తోంది. సాక్షి క్రీడా విభాగం : ‘శ్రీలంక క్రికెట్ సంధి దశలో ఉంది అంటూ ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు. సంగక్కర రిటైర్ అయి కూడా రెండేళ్లు దాటింది. హెరాత్ వీల్‌చెయిర్‌లో కూర్చొని మ్యాచ్‌కు 150 ఓవర్లు బౌలింగ్ చేసినా కూడా అలాగే ఆడమని ఇంకా చెబుతారేమో. ఒక్క ఏడాదిలో వన్డేల కోసం 40 మందిని ఎంపిక చేస్తే మంచి జట్టు ఎలా తయారవుతుంది’... శ్రీలంక క్రికెట్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఒక అడ్మినిస్ట్రేటర్ కమ్ అభిమాని ప్రశ్న ఇది. దిగ్గజాలు రిటైర్ అయ్యారు కాబట్టి ఫలితాలు రావడం లేదని, కుర్రాళ్లు తడబడుతున్నారనే వాదనలో నిజంగానే పస లేదు. చాలా జట్లు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొన్నా...ఆ సమస్యను చాలా తొందరగానే అధిగమించాయి. సీనియర్లు ఉన్న సమయంలోనే కొత్త ఆటగాళ్లను సానబెట్టి తగిన మార్గనిర్దేశనం చేశాయి. కానీ శ్రీలంక మాత్రం అందులో విఫలమైంది. దాంతో టెస్టులైనా, వన్డేలైనా ఆ జట్టులో ప్రతీ సిరీస్‌కు కొత్త మొహాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. గురువారం జరిగిన నాలుగో వన్డేలో బరిలోకి దిగిన లంక తుది జట్టులో ముగ్గురిని మినహాయిస్తే మిగిలిన వారిలో ఎవరికీ 37 వన్డేలకు మించి ఆడిన అనుభవం లేదు. సరిగ్గా చెప్పాలంటే ఐదుగురు 10 వన్డేల లోపే ఆడారు. నాసిరకం ప్రదర్శన... భారత్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో శ్రీలంక ఒకే ఒకసారి 300 పరుగులు దాటగలిగింది. కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే చెరో సెంచరీ చేయగలిగితే, కేవలం ఆరు అర్ధ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. భారత బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే ఇది చాలా పేలవమైన ఆట కిందే లెక్క. రెగ్యులర్ బౌలర్లలో ఒక్కరికి కూడా మూడు టెస్టులు ఆడే అవకాశమే రాలేదు. మూడో టెస్టులో హార్దిక్ పాండ్యాౖకైతే సెంచరీని వారు కానుకగా ఇచ్చారు. అతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక దశలో బౌండరీ వద్ద తొమ్మిది మంది ఫీల్డర్లు ఉండటం ఆ జట్టు పనికిమాలిన వ్యూహాలకు సరైన ఉదాహరణ! వన్డే సిరీస్‌లో కూడా ఆ జట్టు ప్రదర్శన గురించి చెప్పేదేమీ లేదు. రెండో మ్యాచ్‌లో ధనంజయ సంచలన ప్రదర్శన మినహా జట్టును గెలిపించగల సామర్థ్యం ఏ ఒక్కరిలో కనిపించలేదు. దెబ్బ తీస్తున్న రాజకీయాలు... ‘మైదానంలో లంక కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడుతున్నాడు. ఎందుకంటే అతను ఇంకా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాడు’... తాజా సిరీస్‌లో లంక క్రికెట్ గురించి ఒక అభిమాని వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య ఇది. ఇందులో వాస్తవం కూడా అంతే స్థాయిలో ఉంది. శ్రీలంక బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల తన ఇష్టారాజ్యంగా బయటి నుంచి జట్టును నడిపిస్తున్నారని ఆరోపణ ఉంది. జట్టు ఎంపికలో సుమతిపాలదే ప్రధాన పాత్రగా మారింది. ఆరు జట్లతో పటిష్టంగా ఉండాల్సిన దేశవాళీ క్రికెట్‌ను ఆయన భ్రష్టు పట్టించారు. తమ దేశవాళీ క్రికెట్ బాగుపడితే గానీ పరిస్థితి మారదని ఓపెనర్ కరుణరత్నే బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. గత సంవత్సర కాలంలో శ్రీలంక ఆటగాళ్లు తమ దేశవాళీలో ఐదంటే ఐదు వన్డేలు ఆడారు! అలాంటి ఆటగాళ్లు వచ్చి భారత్‌లాంటి జట్టుపై చెలరేగుతారని భావించడం అత్యాశే అవుతుంది. శ్రీలంక ఆశలు విండీస్ ఆటపై... ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ ఇటీవల చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోవడం ఒక విషాదంలా కనిపించింది. కానీ ఇప్పుడు 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేందుకు మరో మాజీ ప్రపంచ చాంపియన్ కూడా క్వాలిఫయింగ్ ఆడాల్సిన పరిస్థితికి చేరువైంది. భారత్‌తో సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే శ్రీలంక నేరుగా తమ స్థానాన్ని ఖాయం చేసుకునేది. అయితే ఇప్పుడు నాలుగో వన్డేలో ఓటమితో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆ జట్టు అవకాశాలు ఇప్పుడు విండీస్‌పై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ చివరి మ్యాచ్‌లో భారత్‌పై లంక గెలిస్తే... ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో కలిపి ఆరు వన్డేల్లో విండీస్ ఐదు గెలిచిందంటే లంక కథ ముగుస్తుంది. ఆఖరి వన్డేలోనూ లంక ఓడితే... లంకను అధిగమించి అర్హత సాధించేందుకు విండీస్ 4 మ్యాచ్‌లు గెలిచినా సరిపోతుంది. -
ఈ జట్టు ఇంకా దూసుకెళ్తుంది
వరుస టెస్టుల్లో 600 పైచిలుకు పరుగులు చేసిన భారత జట్టుకు ఎదురీదడం అంత సులభం కాదు. రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. అయితే ఫాలోఆన్‌లో కరుణరత్నే, కుశాల్ మెండిస్‌లు పోరాడారు. ఇది పరాజయాన్ని ఆలస్యం చేస్తుందే తప్ప ఓటమిని దూరం చేయదని వారిద్దరికి బాగా తెలుసు. ఇక్కడ వాతావరణం తప్ప ఇంకేదీ లంకను ఆదుకోలేదు. నిజానికి ఈ ఇద్దరూ బాగా ఆడారు. ఓపెనర్ కరుణరత్నే చక్కని స్ట్రోక్స్‌తో అలరించాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్లను చక్కగా ఎదుర్కొన్నాడు. ఇక మెండిస్ కూడా అంతే. గతేడాది ఇతను ఆస్ట్రేలియాపై 176 పరుగులు బాదిన ప్రదర్శనను మర్చిపోలేం. ఈ టెస్టులో అతను స్వీప్ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆడుతున్నంత సేపు స్పిన్నర్లపై పట్టు కనబరిచాడు. డ్రైవ్, కట్ ఇలా చక్కని షాట్లు అతని బ్యాట్ నుంచి జాలువారాయి. మెండిస్ నిష్క్రమణ తర్వాత కరుణరత్నే, మాథ్యూస్‌ల భాగస్వామ్యం కూడా లంక ఇన్నింగ్స్‌ను కాసేపు నడిపించింది. అయితే భారీ ఆధిక్యం దృష్ట్యా భారత శిబిరాన్ని ఇదేమంత కలవరపర్చలేదు. స్వల్ప విరామంలో జడేజా కరుణరత్నేతో పాటు మాథ్యూస్‌ను బోల్తాకొట్టించడంతో ఇక లంక పతనం ఊపందుకుంది. ఎడం చేతి బ్యాట్స్‌మెన్‌పై రౌండ్ ద వికెట్ బౌలింగ్‌తో జడేజా ఫలితాలు రాబట్టాడు. ఈ మ్యాచ్ కూడా నాలుగు రోజుల్లోనే ముగియడానికి స్పిన్నర్లే కారణం. బౌలింగ్, బ్యాటింగ్, పుష్కలమైన ఆల్‌రౌండ్ నైపుణ్యమున్న ఈ జట్టు (భారత్) ఇక ముందు కూడా మరిన్ని విజయాలు సాధిస్తుంది. సునీల్ గావస్కర్ -
40 టెస్టుల తర్వాత తొలి వికెట్..
కొలంబో: భారత-శ్రీలంక మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. 344/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కోహ్లి సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 92వ ఓవర్లో కరుణరత్నే వేసిన ఐదో బంతిని ఎదుర్కొన్న పుజారా(133) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ఇప్పటి వరకు 40 టెస్టులాడిన ఈ లంక ఆటగాడికి ఇదే తొలి వికెట్ కావడం విశేషం. బ్యాట్స్‌మన్ అయిన కరుణరత్నే అప్పుడప్పుడు పార్ట్‌టైమ్ బౌలర్ అవతారమెత్తుతాడు. ఇంత వరకు కనీసం 10 ఓవర్లు కూడా వేయని కరుణరత్నే బౌలింగ్‌లో పుజారా అవుటవ్వడం మరో విశేషం. -
భారీ ఆధిక్యంలో శ్రీలంక
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు ప్రస్తుతం 411 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్సలో లంక 61.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 247 పరుగులు చేసింది. ఓపెనర్ కరుణరత్నే (173 బంతుల్లో 110; 7 ఫోర్లు) తన కెరీర్లో నాలుగో సెంచరీ సాధిం చాడు. ధనంజయ డి సిల్వా (82 బంతుల్లో 64; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. కార్ల్ ముంబాకు నాలుగు వికెట్లు దక్కారుు. -
శ్రీలంక 137/1
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు లార్డ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు శుక్రవారం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో వికెట్ నష్టానికి 137 పరుగులు చేసింది. కౌశల్ సిల్వ (64 బ్యాటింగ్), కరుణరత్నే (50) తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించారు. సిల్వతో పాటు కుషాల్ మెండిస్ (15 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు 279/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (167 నాటౌట్) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హెరాత్‌కు 4 వికెట్లు దక్కాయి. -
శ్రీలంక పోరాటం
కరుణరత్నే సెంచరీ రెండో ఇన్నింగ్స్‌లో 293/5 కివీస్‌తో తొలి టెస్టు క్రైస్ట్‌చర్చ్: ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక జట్టును ఓపెనర్ కరుణరత్నే (363 బంతుల్లో 152; 17 ఫోర్లు) తన అద్భుత సెంచరీతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 125 ఓవర్లలో ఐదు వికెట్లకు 293 పరుగులు చేసింది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (108 బంతుల్లో 53 బ్యాటింగ్; 6 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. తనకు తోడుగా క్రీజులో కౌశల్ (5 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకుముందు 84/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు ఆటను ప్రారంభించిన లంక మరో పది పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. అయితే కివీస్ దూకుడును కరుణరత్నే సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఎనిమిది గంటలకు పైగా ఓపిగ్గా క్రీజులో నిలిచిన తను 255 బంతుల్లో కెరీర్లో తొలి సెంచరీని సాధించాడు. అయితే ఆట చివర్లో బౌల్ట్ వడివడిగా రెండు వికెట్లు తీసి లంక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ప్రస్తుతం శ్రీలంక మరో 10 పరుగులు వెనుకబడి ఉంది.