
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో శ్రీలంక బ్యాట్స్‌మన్ దిముత్ కరుణరత్నే, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జాసన్ హోల్డర్‌లు తమ కెరీర్ అత్యుత్తమ ర్యాంకులను సాధించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 158 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 60 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కరుణరత్నే 21 స్థానాలు ఎగబాకి 10వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ జరిగిన రెండో టెస్టులో మొత్తంగా 11 వికెట్లు సాధించి విండీస్ గెలుపులో ముఖ‍్య భూమిక పోషించిన హోల్డర్ తొమ్మిది స్థానాలు పైకి ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు.
ఇక టెస్టు ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హోల్డర్ తొలిసారి టాప్-5లో నిలిచాడు. ఇక జట్టు ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించగా, బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment