
అబుదాబి: పాకిస్తాన్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టును శ్రీలంక జాగ్రత్తగా ప్రారంభించింది. మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. దిముత్ కరుణరత్నే (205 బంతుల్లో 93; 5 ఫోర్లు) త్రుటిలో సెంచరీ కోల్పోయాడు.
ఒకదశలో లంక 61/3 స్కోరు వద్ద నిలవగా... కరుణరత్నే ఆదుకున్నాడు. కెప్టెన్ దినేశ్ చండిమాల్ (60 బ్యాటింగ్)తో కలిసి నాలుగో వికెట్‌కు 100 పరుగులు జోడించాడు. ప్రస్తుతం చండిమాల్‌తో పాటు డిక్‌వెలా (42 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 66 పరుగులు జత చేశారు. యాసిర్ షాకు 2 వికెట్లు దక్కాయి.