తిరిమన్నె, కరుణరత్నే
గాలే: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక విజయానికి దగ్గరైంది. 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 133 పరుగులు చేసింది. ఓపెనర్లు కరుణరత్నే (71 బ్యాటింగ్; 2 ఫోర్లు), తిరిమన్నె (57 బ్యాటింగ్; 4 ఫోర్లు) శుభారంభాన్నిచ్చారు. పట్టుదలగా ఆడి అర్ధసెంచరీలు సాధించారు. అబేధ్యమైన తొలి వికెట్‌కు 133 పరుగులు జోడించారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా చేతిలో 10 వికెట్లున్న శ్రీలంక లంచ్ విరామంలోపే లక్ష్యాన్ని అధిగమించే అవకాశాలున్నాయి.
అంతకుముందు 196/7 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు శనివారం ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 106 ఓవర్లలో 285 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితంరోజు స్కోరుకు మరో 89 పరుగులు జతచేసి మిగిలిన 3 వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ వాట్లింగ్ (77; 6 ఫోర్లు), సోమర్‌విల్లే (40 నాటౌట్; 2 ఫోర్లు) ఎనిమిదో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో ఎంబుల్డెనియా 4, ధనంజయ డిసిల్వా 3 వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment