సౌతీకి 5 వికెట్లు: శ్రీలంక 275/9  | The Sri Lankan team lost the Test series by 03 in England | Sakshi
Sakshi News home page

సౌతీకి 5 వికెట్లు: శ్రీలంక 275/9 

Published Sun, Dec 16 2018 2:11 AM | Last Updated on Sun, Dec 16 2018 4:40 AM

The Sri Lankan team lost the Test series by 03 in England - Sakshi

వెల్లింగ్టన్‌: ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్‌ చేతిలో 0–3తో టెస్టు సిరీస్‌ కోల్పోయిన శ్రీలంక జట్టు న్యూజిలాండ్‌ పర్యటననూ అదే ఆటతీరుతో మొదలెట్టింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం ప్రారంభమైన మొదటి టెస్టులో ఆట ముగిసే సమయానికి లంక తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. కివీస్‌ పేసర్‌ టిమ్‌ సౌతీ (5/67) ధాటికి 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ లంకను కరుణరత్నే (79; 11 ఫోర్లు), మాథ్యూస్‌ (83; 9 ఫోర్లు, సిక్స్‌) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 133 పరుగులు జతచేశారు. చివర్లో డిక్‌వెలా (91 బంతుల్లో 73 బ్యాటింగ్‌; 10 ఫోర్లు) ధాటిగా ఆడటంతో లంక ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement