చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక పేసర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా ఆతిథ్య బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగులకే కుప్పకూలింది. అసిత ఫెర్నాండో 4, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార తలో 2 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో జకీర్ హసన్ (54) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మరో నలుగురు అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
హసన్ జాయ్ 21, తైజుల్ ఇస్లాం 22, మొమినుల్ హక్ 33, షకీబ్ 15 పరుగులు సాధించారు. షాంటో 1, లిటన్ దాస్ 4, షాదత్ హొసేన్ 8, మెహిది హసన్ 7, ఖలీద్ అహ్మద్ 1 పరుగు చేసి ఔటయ్యారు.
దీనికి ముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు అర్దసెంచరీలు సాధించారు. ఫలితంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 531 పరుగులు చేసింది. టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండా నమోదైన అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం.
లంక ఇన్నింగ్స్‌లో నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ (92 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి శ్రీలంక 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment