Asia Cup 2022 SL Vs BAN: Sri Lanka Win Against Bangladesh, Check Full Score Details - Sakshi
Sakshi News home page

Asia Cup 2022 SL Vs BAN: బంగ్లాదేశ్‌పై శ్రీలంక సంచలన విజయం..

Published Fri, Sep 2 2022 5:09 AM | Last Updated on Fri, Sep 2 2022 11:09 AM

Asia Cup 2022: Sri Lanka Win Against Bangladesh - Sakshi

దుబాయ్‌: ఓటమికి చేరువైన మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకున్న శ్రీలంక ఆసియా కప్‌లో ‘సూపర్‌ 4’లోకి అడుగు పెట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో లంక 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి 2 ఓవర్లలో గెలుపు కోసం 25 పరుగులు చేయాల్సి ఉండగా, బంగ్లా విజయం ఖాయమనిపించింది. అయితే 19వ ఓవర్‌ వేసిన ఇబాదత్‌ 17 పరుగులు సమర్పించుకోవడంతో లంక పని సులువైంది.

8 వైడ్‌లు, 4 నోబాల్‌లు వేసిన బంగ్లా ఫలితం అనుభవించింది. ముందుగా బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. అఫీఫ్‌ హుస్సేన్‌ (22 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెహదీ హసన్‌ (26 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం శ్రీలంక 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు సాధించింది. కుశాల్‌ మెండిస్‌ (37 బంతుల్లో 60; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), దసున్‌ షనక (33 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement