shakibul Hassan
-
World Cup 2023: గట్టెక్కిన బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో అద్భుతం సాధిద్దామనే లక్ష్యంతో భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్ తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసింది. ఆ తర్వాత ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. వరుసగా ఆరు పరాజయాలను చవిచూసి సెమీఫైనల్ రేసు నుంచి ని్రష్కమించింది. ఈ ప్రపంచకప్‌లో టాప్–7లో నిలిస్తేనే 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశం ఉండటంతో బంగ్లాదేశ్‌కు ఎనిమిదో మ్యాచ్ కీలకంగా మారింది. మాజీ విశ్వవిజేత శ్రీలంకతో జరిగిన ఈ పోరులో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో నెగ్గి మళ్లీ గెలుపుబాట పట్టింది. గెలుపుదారిలో వికెట్లను చేజార్చుకోవడం కలవరపెట్టినా... చివరకు బంగ్లాదేశ్ నుంచి విజయం మాత్రం చేజారలేదు. ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంకపై బంగ్లాదేశ్‌కిదే తొలి విజయం కావడం విశేషం. 280 పరుగుల లక్ష్య ఛేదనలో నజ్ముల్ హొస్సేన్ షాంతో (101 బంతుల్లో 90; 12 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (65 బంతుల్లో 82; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకపాత్ర పోషించారు. చివర్లో తౌహిద్ హ్రిదయ్ (7 బంతుల్లో 15 నాటౌట్; 2 సిక్సర్లు) నిలబడి బంగ్లాదేశ్ విజయాన్ని ఖాయం చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగుల వద్ద ఆలౌటైంది. చరిత్ అసలంక (105 బంతుల్లో 108; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లు తంజిమ్ హసన్ (3/80), షోరిఫుల్ (2/51), షకీబుల్ హసన్ (2/57) సమష్టిగా వికెట్లు పడగొట్టారు. అనంతరం బంగ్లాదేశ్ 41 పరుగులకే ఓపెనర్లు తంజిద్ హసన్ (9), లిటన్ దాస్ (23) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నజ్ముల్, షకీబ్ అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. 210 వద్ద షకీబ్, మరో పరుగు తర్వాత నజ్ముల్ నిష్క్రమించారు. మహ్ముదుల్లా (22), ముషి్ఫకర్ (10), మిరాజ్ (3) స్వల్ప వ్యవధిలో అవుటవ్వడంతో బంగ్లాదేశ్‌కు ఇబ్బంది ఎదురైంది. అయితే తౌహిద్, తంజిమ్ జట్టును విజయతీరానికి చేర్చారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) తంజిమ్ 41; పెరీరా (సి) ముష్ఫికర్ (బి) షోరిఫుల్ 4; మెండిస్ (సి) షోరిఫుల్ (బి) షకీబ్ 19; సమరవిక్రమ (సి) మహ్ముదుల్లా (బి) షకీబ్ 41; అసలంక (సి) లిటన్ (బి) తంజిమ్ 108; మాథ్యూస్ (టైమ్డ్ అవుట్) 0; ధనంజయ (స్టంప్డ్) ముష్ఫికర్ (బి) మిరాజ్ 34; తీక్షణ (సి) సబ్–అహ్మద్ (బి) షోరిఫుల్ 21; చమీర (రనౌట్) 4; రజిత (సి) లిటన్ (బి) తంజిమ్ 0; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 279. వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–135, 5–135, 6–213, 7–258, 8–278, 9–278, 10–279. బౌలింగ్: షోరిఫుల్ 9.3–0–51–2, టస్కిన్ 10–1–39–0, తంజిమ్ హసన్ 10–0–80–3, షకీబ్ 10–0–57–2, మిరాజ్ 10–0–49–1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తంజిద్ (సి) నిసాంక (బి) మదుషంక 9; లిటన్ దాస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 23; నజ్ముల్ (బి) మాథ్యూస్ 90; షకీబ్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 82; మహ్ముదుల్లా (బి) తీక్షణ 22; ముష్ఫికర్ (బి) మదుషంక 10; తౌహిద్ (నాటౌట్) 15; మిరాజ్ (సి) అసలంక (బి) తీక్షణ 3; తంజిమ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (41.1 ఓవర్లలో 7 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–17, 2–41, 3–210, 4–211, 5–249, 6–255, 7– 269. బౌలింగ్: మదుషంక 10–1–69–3, తీక్షణ 9–0–44–2, కసున్ రజిత 4–0–47–0, చమీర 8–0–54–0, మాథ్యూస్ 7.1–1–35–2, ధనంజయ డిసిల్వా 3–0–20–0. ప్రపంచకప్‌లో నేడు ఆ్రస్టేలియా X అఫ్గానిస్తాన్ వేదిక: ముంబై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
బంగ్లాదేశ్‌పై శ్రీలంక సంచలన విజయం..
దుబాయ్: ఓటమికి చేరువైన మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకున్న శ్రీలంక ఆసియా కప్‌లో ‘సూపర్ 4’లోకి అడుగు పెట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో లంక 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి 2 ఓవర్లలో గెలుపు కోసం 25 పరుగులు చేయాల్సి ఉండగా, బంగ్లా విజయం ఖాయమనిపించింది. అయితే 19వ ఓవర్ వేసిన ఇబాదత్ 17 పరుగులు సమర్పించుకోవడంతో లంక పని సులువైంది. 8 వైడ్లు, 4 నోబాల్‌లు వేసిన బంగ్లా ఫలితం అనుభవించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. అఫీఫ్ హుస్సేన్ (22 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెహదీ హసన్ (26 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం శ్రీలంక 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు సాధించింది. కుశాల్ మెండిస్ (37 బంతుల్లో 60; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), దసున్ షనక (33 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. -
వేలంలో షకీబ్ బ్యాట్‌కు రూ. 18 లక్షల 20 వేలు
కరోనా బాధితుల సహాయార్థం నిధుల సేకరణకు తనకెంతో ఇష్టమైన బ్యాట్‌ను వేలానికి పెట్టిన బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ ప్రయత్నానికి మంచి స్పందన లభించింది. ఆన్లైన్ వేలంలో అతని బ్యాట్ 24 వేల డాలర్లు (రూ. 18 లక్షల 20 వేలు) పలికింది. న్యూయార్క్‌లో స్థిరపడ్డ ఓ బంగ్లాదేశీ ఈ బ్యాట్‌ను దక్కించుకున్నాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఈ బ్యాట్‌తోనే విశేషంగా రాణించిన షకీబ్ 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలతో మొత్తం 606 పరుగులు సాధించాడు. బుకీల గురించి బోర్డుకు సరైన సమయంలో సమాచారం ఇవ్వని కారణంగా అతనిపై రెండేళ్ల నిషేధం విధించారు. ఈ అక్టోబర్‌తో నిషేధం ముగియనుంది. -
ఆ ‘స్పెషల్’ జాబితాలో రోహిత్‌శర్మ
టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన రోహిత్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన స్పెషల్-5 బ్యాట్స్‌మెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలతో రోహిత్ శర్మ 648 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిన హిట్‌మ్యాన్ 81 సగటుతో పరుగులు చేశాడు. అయితే, సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో రోహిత్ కృషి వృధా అయింది. తాజాగా ఐసీసీ.. తన ట్విటర్ పేజీలో టాప్-5 స్పెషల్ బ్యాట్స్‌మెన్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో డేవిడ్ వార్నర్, మూడోస్థానంలో షకీబుల్ హసన్, నాలుగో స్థానంలో కేన్ విలియమ్సన్, ఐదో స్థానంలో జోయి రూట్ ఉన్నారు. ఇక పరుగుల ప్రకారం చూసుకుంటే.. రోహిత్ కన్నా ఒక్క పరుగు తక్కువ చేసిన డేవిడ్ వార్నర్ 647 పరుగులతో, 71.89 సగటుతో రెండో స్థానాన్ని సాధించాడు. బంగ్లాదేశ్ లీగ్ దశలోనే తన పోరాటాన్ని ముగించినప్పటికీ.. ఆ జట్టు తరఫున అద్భుతంగా ఆడిన షకీబుల్ 86.57 సగటుతో 606 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 578 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోయి రూట్ 556 పరుగులు చేశాడు. -
భారత్‌ను ఓడించగలం
సౌతాంప్టన్: శక్తి మేర ఆడితే తాము భారత్‌ను ఓడించగలమని అంటున్నాడు బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న షకీబ్... ప్రపంచ కప్‌లో 1000 పరుగులు చేసిన తొలి బంగ్లా బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. అఫ్గాన్‌పై గెలుపు అనంతరం ఏడు మ్యాచ్‌ల్లో ఏడు పాయింట్లతో ఉందీ జట్టు. సెమీఫైనల్స్ చేరాలంటే భారత్ (జూలై 2), పాకిస్తాన్‌పై (జూలై 5) విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో షకీబ్ మాట్లాడుతూ... ‘భారత్ అగ్ర జట్టు. టైటిల్‌కు గట్టి పోటీదారుగా ఉన్న అలాంటి జట్టును ఓడించడం కష్టమే. కానీ, అత్యుత్తమ స్థాయి ఆటతో మా శక్తి మేర ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నాడు. ఫలితాన్ని మార్చగల ప్రపంచ స్థాయి ఆటగాళ్లున్న టీమిండియాతో మ్యాచ్‌లో అనుభవం ప్రధాన పాత్ర పోషిస్తుందని షకీబ్ అన్నాడు. కప్‌లో తన ఫామ్ (476 పరుగులు, 10 వికెట్లు)పై అతడు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. వ్యక్తిగత రాణింపుతో అవసరమైన సమయంలో జట్టుకు ఉపయోగపడుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. -
షకీబుల్ ఆల్‌రౌండ్ షో
ఢాకా: కెప్టెన్ షకీబుల్ హసన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో బంగ్లాదేశ్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్ లిటన్ దాస్ (34 బంతుల్లో 60; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత షకీబుల్ (26 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), మహ్ముదుల్లా (21 బంతుల్లో 43 నాటౌట్; 7 ఫోర్లు) ధాటిగా ఆడారు. అబేధ్యమైన ఐదో వికెట్‌కు చివరి 7 ఓవర్లలో 91 పరుగులు జోడించారు. బంతుల్ని బౌండరీలు బాదేందుకు ఇద్దరు పోటీపడ్డారు. దీంతో స్కోరు బోర్డు వాయువేగంతో దూసుకెళ్లింది. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 175 పరుగులు చేసి ఆలౌటైంది. పావెల్ (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్), హోప్ (19 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించగా, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ షకీబుల్ 5, ముస్తఫిజుర్ రహ్మాన్ 2 వికెట్లు తీశారు. మూడు టి20ల సిరీస్ ప్రస్తుతం 1–1తో సమమైంది. రేపు (శనివారం) చివరి టి20 కూడా ఇక్కడే జరుగుతుంది. -
బంగ్లా పులిలా...
►ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం ►షకీబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ఢాకా: సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాను తాము క్లీన్‌స్వీప్ చేస్తామన్న బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ వ్యాఖ్యలపై ఆసీస్ జట్టు సారథి స్టీవ్ స్మిత్ హేళనగా స్పందించాడు. బంగ్లాదేశ్ వంద టెస్టులాడితే పట్టుమని పదైనా గెలవలేకపోయిందన్నాడు. అన్నట్లుగానే షకీబ్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లాకు శుభారంభం ఇచ్చాడు. తొలి టెస్టులో బంగ్లాదేశ్ 20 పరుగుల తేడాతో మాజీ టెస్టు నంబర్‌వన్ ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించింది. టెస్టు క్రికెట్లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్ అయిన షకీబ్ తన హోదాకు న్యాయం చేసే ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్‌లో 84 పరుగులు చేసిన షకీబ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు (5/68, 5/85) పడగొట్టాడు. వార్నర్ (112; 16 ఫోర్లు, 1 సిక్స్) శతకం సాధించాడు. నాలుగు రోజు 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 109/2 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 244 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ వార్నర్ 121 బంతుల్లో సెంచరీని పూర్తిచేశాడు. టెస్టుల్లో అతనికిది 19వ సెంచరీ కాగా... మిగతా బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ స్మిత్ (37), కమిన్స్ (33) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తొలి సెషన్లో స్మిత్ అండతో సెంచరీ పూర్తిచేసిన వార్నర్‌ను కాసేపటికే షకీబ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో మూడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత స్మిత్ కూడా షకీబ్ స్పిన్‌కే చిక్కడంతో ఆసీస్ పతనం జోరందుకుంది. రెండో టెస్టు సెప్టెంబర్ 4 నుంచి చిట్టగాంగ్‌లో జరుగుతుంది. ► 11 భారత ఉపఖండంలో ఆడిన గత 13 టెస్టుల్లో ఆస్ట్రేలియా 11 మ్యాచ్‌ల్లో ఓడింది. కేవలం ఒక్కటంటే ఒకటే గెలవగా... మరొకటి డ్రా అయింది. ► 10 బంగ్లాదేశ్ ఇప్పటివరకు 101 టెస్టులు ఆడి పదింటిలో గెలిచింది. బంగ్లా చేతిలో ఓడిన ఐదో దేశం ఆస్ట్రేలియా. ► 5 తమ జట్టు ఆడిన 50వ టెస్టులో పది వికెట్లు తీసిన ఐదో బౌలర్ షకీబ్. గతంలో బెయిలీ, హ్యాడ్లీ, మురళీధరన్, హర్భజన్ ఇలా చేశారు. -
బంగ్లాకు భారీ ఆధిక్యం
షకీబుల్ హసన్ సెంచరీ కొలంబో: బంగ్లాదేశ్ తమ వందో టెస్టులో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరుస్తోంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 129 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. షకీబుల్ హసన్ (159 బంతుల్లో 116; 10 ఫోర్లు) సెంచరీతో చెలరేగడం విశేషం. శుక్రవారం 214/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ షకీబుల్, ముష్ఫికర్ రహీమ్ (81 బంతుల్లో 52; 6 ఫోర్లు) లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని ఆరో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. అర్ధసెంచరీ అనంతరం రహీమ్ నిష్క్రమించగా తర్వాత వచ్చిన ముసాదిక్ హŸస్సేన్ (155 బంతుల్లో 75; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా షకీబ్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 131 పరుగులు జతచేయడంతో బంగ్లాదేశ్ 400 పరుగుల స్కోరుని అధిగమించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన శ్రీలంక మూడో రోజు ఆట నిలిచే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసింది. ఓపెనర్లు కరుణరత్నే (25 బ్యాటింగ్), తరంగ (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు మరో 75 పరుగులు వెనుకబడి ఉంది.