షకీబుల్‌ ఆల్‌రౌండ్‌ షో | Shakib Al Hasan all round show sinks West Indies | Sakshi
Sakshi News home page

షకీబుల్‌ ఆల్‌రౌండ్‌ షో

Published Fri, Dec 21 2018 3:57 AM | Last Updated on Fri, Dec 21 2018 2:01 PM

Shakib Al Hasan all round show sinks West Indies - Sakshi

ఢాకా: కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో బంగ్లాదేశ్‌ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (34 బంతుల్లో 60; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత షకీబుల్‌ (26 బంతుల్లో 42 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), మహ్ముదుల్లా (21 బంతుల్లో 43 నాటౌట్‌; 7 ఫోర్లు) ధాటిగా ఆడారు. అబేధ్యమైన ఐదో వికెట్‌కు చివరి 7 ఓవర్లలో 91 పరుగులు జోడించారు.

బంతుల్ని బౌండరీలు బాదేందుకు ఇద్దరు పోటీపడ్డారు. దీంతో స్కోరు బోర్డు వాయువేగంతో దూసుకెళ్లింది. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్‌ 19.2 ఓవర్లలో 175 పరుగులు      చేసి ఆలౌటైంది. పావెల్‌ (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్‌), హోప్‌ (19 బంతుల్లో 36; 6 ఫోర్లు)     రాణించగా, మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. కెప్టెన్‌ షకీబుల్‌ 5, ముస్తఫిజుర్‌ రహ్మాన్‌ 2 వికెట్లు తీశారు. మూడు టి20ల సిరీస్‌ ప్రస్తుతం 1–1తో సమమైంది. రేపు (శనివారం) చివరి టి20 కూడా ఇక్కడే జరుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement