న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో అద్భుతం సాధిద్దామనే లక్ష్యంతో భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్ తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసింది. ఆ తర్వాత ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. వరుసగా ఆరు పరాజయాలను చవిచూసి సెమీఫైనల్ రేసు నుంచి ని్రష్కమించింది. ఈ ప్రపంచకప్‌లో టాప్–7లో నిలిస్తేనే 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశం ఉండటంతో బంగ్లాదేశ్‌కు ఎనిమిదో మ్యాచ్ కీలకంగా మారింది.
మాజీ విశ్వవిజేత శ్రీలంకతో జరిగిన ఈ పోరులో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో నెగ్గి మళ్లీ గెలుపుబాట పట్టింది. గెలుపుదారిలో వికెట్లను చేజార్చుకోవడం కలవరపెట్టినా... చివరకు బంగ్లాదేశ్ నుంచి విజయం మాత్రం చేజారలేదు. ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంకపై బంగ్లాదేశ్‌కిదే తొలి విజయం కావడం విశేషం. 280 పరుగుల లక్ష్య ఛేదనలో నజ్ముల్ హొస్సేన్ షాంతో (101 బంతుల్లో 90; 12 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (65 బంతుల్లో 82; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకపాత్ర పోషించారు.
చివర్లో తౌహిద్ హ్రిదయ్ (7 బంతుల్లో 15 నాటౌట్; 2 సిక్సర్లు) నిలబడి బంగ్లాదేశ్ విజయాన్ని ఖాయం చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగుల వద్ద ఆలౌటైంది. చరిత్ అసలంక (105 బంతుల్లో 108; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లు తంజిమ్ హసన్ (3/80), షోరిఫుల్ (2/51), షకీబుల్ హసన్ (2/57) సమష్టిగా వికెట్లు పడగొట్టారు.
అనంతరం బంగ్లాదేశ్ 41 పరుగులకే ఓపెనర్లు తంజిద్ హసన్ (9), లిటన్ దాస్ (23) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నజ్ముల్, షకీబ్ అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. 210 వద్ద షకీబ్, మరో పరుగు తర్వాత నజ్ముల్ నిష్క్రమించారు. మహ్ముదుల్లా (22), ముషి్ఫకర్ (10), మిరాజ్ (3) స్వల్ప వ్యవధిలో అవుటవ్వడంతో బంగ్లాదేశ్‌కు ఇబ్బంది ఎదురైంది. అయితే తౌహిద్, తంజిమ్ జట్టును విజయతీరానికి చేర్చారు.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) తంజిమ్ 41; పెరీరా (సి) ముష్ఫికర్ (బి) షోరిఫుల్ 4; మెండిస్ (సి) షోరిఫుల్ (బి) షకీబ్ 19; సమరవిక్రమ (సి) మహ్ముదుల్లా (బి) షకీబ్ 41; అసలంక (సి) లిటన్ (బి) తంజిమ్ 108; మాథ్యూస్ (టైమ్డ్ అవుట్) 0; ధనంజయ (స్టంప్డ్) ముష్ఫికర్ (బి) మిరాజ్ 34; తీక్షణ (సి) సబ్–అహ్మద్ (బి) షోరిఫుల్ 21; చమీర (రనౌట్) 4; రజిత (సి) లిటన్ (బి) తంజిమ్ 0; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 279.
వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–135, 5–135, 6–213, 7–258, 8–278, 9–278, 10–279.
బౌలింగ్: షోరిఫుల్ 9.3–0–51–2, టస్కిన్ 10–1–39–0, తంజిమ్ హసన్ 10–0–80–3, షకీబ్ 10–0–57–2, మిరాజ్ 10–0–49–1.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తంజిద్ (సి) నిసాంక (బి) మదుషంక 9; లిటన్ దాస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 23; నజ్ముల్ (బి) మాథ్యూస్ 90; షకీబ్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 82; మహ్ముదుల్లా (బి) తీక్షణ 22; ముష్ఫికర్ (బి) మదుషంక 10; తౌహిద్ (నాటౌట్) 15; మిరాజ్ (సి) అసలంక (బి) తీక్షణ 3; తంజిమ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (41.1 ఓవర్లలో 7 వికెట్లకు) 282.
వికెట్ల పతనం: 1–17, 2–41, 3–210, 4–211, 5–249, 6–255, 7– 269.
బౌలింగ్: మదుషంక 10–1–69–3, తీక్షణ 9–0–44–2, కసున్ రజిత 4–0–47–0, చమీర 8–0–54–0, మాథ్యూస్ 7.1–1–35–2,
ధనంజయ డిసిల్వా 3–0–20–0.
ప్రపంచకప్‌లో నేడు
ఆ్రస్టేలియా X అఫ్గానిస్తాన్
వేదిక: ముంబై
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం.
Comments
Please login to add a commentAdd a comment