Bangladesh win
-
World Cup 2023: గట్టెక్కిన బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో అద్భుతం సాధిద్దామనే లక్ష్యంతో భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్ తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసింది. ఆ తర్వాత ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. వరుసగా ఆరు పరాజయాలను చవిచూసి సెమీఫైనల్ రేసు నుంచి ని్రష్కమించింది. ఈ ప్రపంచకప్‌లో టాప్–7లో నిలిస్తేనే 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశం ఉండటంతో బంగ్లాదేశ్‌కు ఎనిమిదో మ్యాచ్ కీలకంగా మారింది. మాజీ విశ్వవిజేత శ్రీలంకతో జరిగిన ఈ పోరులో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో నెగ్గి మళ్లీ గెలుపుబాట పట్టింది. గెలుపుదారిలో వికెట్లను చేజార్చుకోవడం కలవరపెట్టినా... చివరకు బంగ్లాదేశ్ నుంచి విజయం మాత్రం చేజారలేదు. ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంకపై బంగ్లాదేశ్‌కిదే తొలి విజయం కావడం విశేషం. 280 పరుగుల లక్ష్య ఛేదనలో నజ్ముల్ హొస్సేన్ షాంతో (101 బంతుల్లో 90; 12 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (65 బంతుల్లో 82; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకపాత్ర పోషించారు. చివర్లో తౌహిద్ హ్రిదయ్ (7 బంతుల్లో 15 నాటౌట్; 2 సిక్సర్లు) నిలబడి బంగ్లాదేశ్ విజయాన్ని ఖాయం చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగుల వద్ద ఆలౌటైంది. చరిత్ అసలంక (105 బంతుల్లో 108; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లు తంజిమ్ హసన్ (3/80), షోరిఫుల్ (2/51), షకీబుల్ హసన్ (2/57) సమష్టిగా వికెట్లు పడగొట్టారు. అనంతరం బంగ్లాదేశ్ 41 పరుగులకే ఓపెనర్లు తంజిద్ హసన్ (9), లిటన్ దాస్ (23) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నజ్ముల్, షకీబ్ అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. 210 వద్ద షకీబ్, మరో పరుగు తర్వాత నజ్ముల్ నిష్క్రమించారు. మహ్ముదుల్లా (22), ముషి్ఫకర్ (10), మిరాజ్ (3) స్వల్ప వ్యవధిలో అవుటవ్వడంతో బంగ్లాదేశ్‌కు ఇబ్బంది ఎదురైంది. అయితే తౌహిద్, తంజిమ్ జట్టును విజయతీరానికి చేర్చారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) తంజిమ్ 41; పెరీరా (సి) ముష్ఫికర్ (బి) షోరిఫుల్ 4; మెండిస్ (సి) షోరిఫుల్ (బి) షకీబ్ 19; సమరవిక్రమ (సి) మహ్ముదుల్లా (బి) షకీబ్ 41; అసలంక (సి) లిటన్ (బి) తంజిమ్ 108; మాథ్యూస్ (టైమ్డ్ అవుట్) 0; ధనంజయ (స్టంప్డ్) ముష్ఫికర్ (బి) మిరాజ్ 34; తీక్షణ (సి) సబ్–అహ్మద్ (బి) షోరిఫుల్ 21; చమీర (రనౌట్) 4; రజిత (సి) లిటన్ (బి) తంజిమ్ 0; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 279. వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–135, 5–135, 6–213, 7–258, 8–278, 9–278, 10–279. బౌలింగ్: షోరిఫుల్ 9.3–0–51–2, టస్కిన్ 10–1–39–0, తంజిమ్ హసన్ 10–0–80–3, షకీబ్ 10–0–57–2, మిరాజ్ 10–0–49–1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తంజిద్ (సి) నిసాంక (బి) మదుషంక 9; లిటన్ దాస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 23; నజ్ముల్ (బి) మాథ్యూస్ 90; షకీబ్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 82; మహ్ముదుల్లా (బి) తీక్షణ 22; ముష్ఫికర్ (బి) మదుషంక 10; తౌహిద్ (నాటౌట్) 15; మిరాజ్ (సి) అసలంక (బి) తీక్షణ 3; తంజిమ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (41.1 ఓవర్లలో 7 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–17, 2–41, 3–210, 4–211, 5–249, 6–255, 7– 269. బౌలింగ్: మదుషంక 10–1–69–3, తీక్షణ 9–0–44–2, కసున్ రజిత 4–0–47–0, చమీర 8–0–54–0, మాథ్యూస్ 7.1–1–35–2, ధనంజయ డిసిల్వా 3–0–20–0. ప్రపంచకప్‌లో నేడు ఆ్రస్టేలియా X అఫ్గానిస్తాన్ వేదిక: ముంబై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం
ధర్మశాల: క్వాలిఫయంగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో నెదర్లాండ్‌పై విజయం సాధించింది. నిర్ణీత 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్ చివరి వరకు పోరాడి ఓడింది. తొలి నుంచి కూడా వికెట్లు తీయడంలో బంగ్లా బౌలర్లు సఫలం కావడంతో విజయం సులభమైంది. ఓ దశలో నెదర్లాండ్ 10 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. కానీ, బ్యాట్స్‌మెన్స్ భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. స్టెఫాన్ మైబర్గ్ 29, కెప్టెన్ పీటర్ బోరెన్ 29, బెన్ కూపర్ 20, టామ్ కూపర్ 15 పరుగులు చేసినా చివర్లో బౌలర్లు చేతులేత్తేశారు. బంగ్లా బౌలర్లు అమిన్ హుస్సేన్ రెండు, షకిబుల్ హసన్ 2 వికెట్లు తీయగా, నాసిర్ హుస్సన్, మొర్తజా తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసినా బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ 15 పరుగులకే వెనుతిరిగినా... మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 58 బంతుల్లో 83 (3 సిక్సర్లు, 6 ఫోర్లు) పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు. వరుస వికెట్లు కోల్పోతున్న ఇక్బాల్ ధీటుగా ఆడుతూ టీమ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. నెదర్లాండ్ బౌలర్లు వేన్ డెర్ గుగ్టెన్ మూడు వికెట్లు, వాన్ మీకెరెన్ రెండు వికెట్లు తీయగా మెర్వీ, బోర్రెన్ తలో వికెట్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా తమీమ్ ఇక్బాల్ ఎంపికయ్యాడు. మరో మ్యాచ్ ధర్మశాలలో రాత్రి 7 గంటలకు ఐర్లాండ్, ఒమన్ ల మధ్య జరుగును. -
శ్రీలంకపై బంగ్లాదేశ్ ఘనవిజయం
మిర్పూర్ : ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వరుసగా రెండు విజయాలను సాధించిన అతిథ్య జట్టు ఫైనల్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. 148 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు 124 పరుగులకే కట్టడి చేశారు. 8 వికెట్లు కోల్పోయిన లంక ఏ దశలోనూ పోరాడలేకపోయింది. లంక బ్యాట్స్‌మెన్స్ చండీమల్ 37, జయసూరియ 26 పరుగుల చేశారు. బంగ్లా బౌలర్లు టస్కిన్ అహ్మద్, అమీన్ చెరో 3 వికెట్లు తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. రెండు పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాను షబ్బీర్, షకిబుల్ హసన్ ఆదుకున్నారు. నాల్గో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యంతో షబ్బీర్ (80; 54 బంతుల్లో), హసన్(32) జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. శ్రీలంక బౌలర్లలో చమీరా మూడు వికెట్లు సాధించగా, మాథ్యూస్, కులశేఖరలకు తలో వికెట్ దక్కింది. షబ్బీర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. సోమవారం యూఏఈతో పాకిస్తాన్ తలపడనుంది. -
పరువు ‘బంగ్లా’ఖాతంలో!
-
పరువు ‘బంగ్లా’ఖాతంలో!
►చిత్తుగా ఓడిన భారత్ ► 79 పరుగులతో బంగ్లాదేశ్ ఘనవిజయం ► చెలరేగిన ముస్తఫిజుర్ ► రాణించిన తమీమ్, సర్కార్ బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోవడం కొత్తేం కాదు... ఇది మొదటిసారేం కాదు... కాకపోతే ఇప్పుడు ఓడిపోవడం దారుణమైన పరాభవం. మూడు నెలల క్రితం ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో అంపైర్ ‘నోబాల్’ ఇవ్వకుంటే భారత్‌పై గెలిచేవాళ్లమని ఇన్నాళ్లూ ఆ జట్టు చెబుతూ వచ్చింది. ఆ మ్యాచ్ తర్వాత భారత్ ఎదురైన తొలిసారే కసికసిగా ఆడింది. అలా ఇలా కాదు... తమ చరిత్రలోనే భారత్‌పై అతి పెద్ద విజయాన్ని సాధించింది. 19 ఏళ్ల కొత్త కుర్రాడు... ముస్తఫిజుర్ అరంగేట్రంలోనే ఐదు వికెట్లతో చెలరేగి బంగ్లాదేశ్‌లో పండగ వాతావరణాన్ని సృష్టించాడు. మిర్పూర్: ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్ ఆటతీరును చూసిన తర్వాత ఆ జట్టును టీమిండియా తక్కువగా అంచనా వేయలేదు. అందుకే ఈ సారి పూర్తి స్థాయి జట్టుతో సిరీస్‌కు సిద్ధమైంది. కానీ ఫలితం మాత్రం రివర్స్ అయింది. బంగ్లా అద్భుత ప్రదర్శన ముందు ధోని సేన తలవంచింది. గురువారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 79 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (62 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (40 బంతుల్లో 54; 8 ఫోర్లు, 1 సిక్స్), షకీబ్ అల్ హసన్ (68 బంతుల్లో 52; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్‌కు 3 వికెట్లు పడ్డాయి. భారత్ 46 ఓవర్లలో 228 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (68 బంతుల్లో 63; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, రైనా (40 బంతుల్లో 40; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే చెలరేగి ముస్తఫిజుర్ (5/50) సంచలన బౌలింగ్ నమోదు చేశాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇక్కడే ఆదివారం జరుగుతుంది. చెలరేగిన ఓపెనర్లు: బంగ్లాదేశ్ ఓపెనర్లు సౌమ్య, తమీమ్ తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించి అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న సౌమ్య, తమీమ్‌తో సమన్వయ లోపంతో రనౌట్ కావడంతో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో వర్షం కారణంగా దాదాపు గంట పాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. విరామం తర్వాత ఒక్కసారిగా అశ్విన్ విజృంభించాడు. ఫలితంగా 23 పరుగుల వ్యవధిలో బంగ్లా 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షకీబ్, షబ్బీర్ (44 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఐదో వికెట్‌కు 83 పరుగులు జత చేసిన తర్వాత షబ్బీర్‌ను అవుట్ చేసిన జడేజా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కొద్ది సేపటికే షకీబ్ కూడా వెనుదిరగడంతో బంగ్లా జోరుకు బ్రేక్ పడింది. నాసిర్ హొస్సేన్ (27 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు చివర్లో మొర్తజా (21) వేగంగా ఆడటంతో బంగ్లా స్కోరు 300 పరుగులు దాటింది. భారత్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే అత్యధిక స్కోరు. రోహిత్ మినహా అందరూ విఫలం: భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్, ధావన్ (38 బంతుల్లో 30; 3 ఫోర్లు) నెమ్మదిగా మొదలు పెట్టినా క్రమంగా వేగం పెంచారు. నిలకడగా ఆడిన రోహిత్ 53 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మరో వైపు ధావన్ తడబడ్డాడు. 13, 15 పరుగుల వద్ద రెండు సార్లు కీపర్ ముష్ఫికర్ సునాయాస క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన ధావన్... దానిని ఉపయోగించుకోలేక కొద్ది సేపటికి వెనుదిరిగాడు. ఆ వెంటనే కోహ్లి (1) కూడా అవుట్ కావడంతో భారత్‌కు మరో షాక్ తగిలింది. కోలుకునే లోపే కొత్త కుర్రాడు ముస్తఫిజుర్... రోహిత్‌ను అవుట్ చేసి బంగ్లా శిబిరంలో ఆనందం నింపాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు శ్రమించిన రహానే (9), ఆ వెంటనే ధోని (5) కూడా పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాలు మరింత పెరిగాయి. ఈ దశలో రైనా, జడేజా (42 బంతుల్లో 32; 2 ఫోర్లు) కలిసి జాగ్రత్తగా ఆడారు. ఆరో వికెట్‌కు వీరిద్దరు 60 పరుగులు జత చేసిన అనంతరం రైనా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఎవరూ పోరాడలేకపోయారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 60; సర్కార్ (రనౌట్) 54; దాస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 8; ముష్ఫికర్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 14; షకీబ్ (సి) జడేజా (బి) ఉమేశ్ 52; షబ్బీర్ (బి) జడేజా 41; హొస్సేన్ (సి) జడేజా (బి) ఉమేశ్ 34; మొర్తజా (సి) రోహిత్ (బి) మోహిత్ 21; రూబెల్ (సి) మోహిత్ (బి) భువనేశ్వర్ 4; తస్కీన్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 2; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 307. వికెట్ల పతనం: 1-102; 2-123; 3-129; 4-146; 5-229; 6-267; 7-282; 8-286; 9-298; 10-307. బౌలింగ్: భువనేశ్వర్ 7-0-37-2; ఉమేశ్ 8-0-58-2; అశ్విన్ 10-0-51-3; మోహిత్ 4.4-0-53-1; రైనా 10-0-40-0; జడేజా 8-0-48-1; కోహ్లి 2-0-12-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మొర్తజా (బి) ముస్తఫిజుర్ 63; ధావన్ (సి) ముష్ఫికర్ (బి) తస్కీన్ 30; కోహ్లి (సి) ముష్ఫికర్ (బి) తస్కీన్ 1; రహానే (సి) హొస్సేన్ (బి) ముస్తఫిజుర్ 9; రైనా (బి) ముస్తఫిజుర్ 40; ధోని (సి) ముష్ఫికర్ (బి) షకీబ్ 5; జడేజా (సి) సర్కార్ (బి) ముస్తఫిజుర్ 32; అశ్విన్ (సి) ముష్ఫికర్ (బి) ముస్తఫిజుర్ 0; భువనేశ్వర్ నాటౌట్ 25; మోహిత్ (సి) ముష్ఫికర్ (బి) మొర్తజా 11; ఉమేశ్ (ఎల్బీ) (బి) షకీబ్ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్) 228. వికెట్ల పతనం: 1-95; 2-101; 3-105; 4-115; 5-128; 6-188; 7-188; 8-195; 9-219; 10-228. బౌలింగ్: ముస్తఫిజుర్ 9.2-1-50-5; తస్కీన్ 6-1-21-2; మొర్తజా 10-0-53-1; రూబెల్ 6-0-36-0; హొస్సేన్ 6.4-0-31-0; షకీబ్ 8-0-33-2.