లంకను చిత్తుచేసిన ఆనందంలో బంగ్లా ఆటగాళ్లు
మిర్పూర్ : ఆసియాకప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వరుసగా రెండు విజయాలను సాధించిన అతిథ్య జట్టు ఫైనల్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.
148 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు 124 పరుగులకే కట్టడి చేశారు. 8 వికెట్లు కోల్పోయిన లంక ఏ దశలోనూ పోరాడలేకపోయింది. లంక బ్యాట్స్‌మెన్స్ చండీమల్ 37, జయసూరియ 26 పరుగుల చేశారు. బంగ్లా బౌలర్లు టస్కిన్ అహ్మద్, అమీన్ చెరో 3 వికెట్లు తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. రెండు పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాను షబ్బీర్, షకిబుల్ హసన్ ఆదుకున్నారు. నాల్గో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యంతో షబ్బీర్ (80; 54 బంతుల్లో), హసన్(32) జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. శ్రీలంక బౌలర్లలో చమీరా మూడు వికెట్లు సాధించగా, మాథ్యూస్, కులశేఖరలకు తలో వికెట్ దక్కింది. షబ్బీర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. సోమవారం యూఏఈతో పాకిస్తాన్ తలపడనుంది.