శ్రీలంక విజయలక్ష్యం 148
మిర్పూర్: ఆసియాకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో బంగ్లాదేశ్ 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ ఆదిలో తడబడినా షబ్బీర్ రెహ్మాన్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో తేరుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ రెండు పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత ముష్ఫికర్ రహీమ్(4) రనౌట్ రూపంలో పెవిలియన్ చేరడంతో బంగ్లాదేశ్ 26 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. ఆ తరుణంలో షకిబుల్ హసన్తో కలిసి షబ్బీర్ రెహ్మాన్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఈ జోడీ నాల్గో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
ఈ క్రమంలోనే షబ్బీర్ (80; 54 బంతుల్లో) హాఫ్ సెంచరీ నమోదు చేయగా, షకిబుల్ హసన్(32) సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అనంతరం మహ్మదుల్లా(23 నాటౌట్) ఫర్వాలేదనిపించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో చమీరా మూడు వికెట్లు సాధించగా, మాథ్యూస్, కులశేఖరలకు తలో వికెట్ దక్కింది.