డెహ్రాడూన్: మైదానంలో మళ్లీ నాగినీ డ్యాన్స్.. జస్ట్ సీన్ మారింది అంతే.. అప్పుడు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఈ తరహా సంబరాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే.. ఇప్పుడు అదే స్టైల్‌ను ఆ జట్టుపైనే గెలిచి అఫ్గాన్ ఆటగాళ్లు రిపీట్ చేశారు. అయితే ఈ స్టైల్ అప్పట్లో పెద్ద వివాదానికే అగ్గి రాజేసిన విషయం తెలిసిందే. శ్రీలంకలో జరిగిన నిదహాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు విజయానందంలో తొలి సారి నాగిని డ్యాన్స్‌లు చేశారు. మరుసటి మ్యాచ్‌ల్లో శ్రీలంక ఆటగాళ్లు ఈ డ్యాన్స్‌కు ప్రతీకగా వికెట్లు పడగొట్టి నాదస్వరం ఊదారు. దీంతో ఆటగాళ్ల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. అసహనంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూం అద్దాలుకూడా ధ్వంసం చేశారు.
ఇక గురువారం డెహ్రాడూన్ వేదికగా జరిగిన మూడో టీ20లో అఫ్గాన్ బంగ్లాపై ఒక్కపరుగు తేడాతో నెగ్గి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయానంతరం అఫ్గాన్ వికెట్ కీపర్ మహమ్మద్ షజాద్ నాగిని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. మరి కొంతమంది ఆటగాళ్లు కూడా షజాద్ బాటలో నడిచారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. చివరి ఓవర్ చివరి బంతికి బంగ్లా విజయానికి 4 పరుగులు కావాల్సి ఉండగా రషీద్ బౌలింగ్, షఫికుల్లా అద్భుత ఫీల్డింగ్ అఫ్గాన్‌ను గట్టెక్కించాయి. సిక్స్ వెళ్లే బంతిని షఫికుల్లా అద్భుతంగా అడ్డుకొని బంగ్లా బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేశాడు. ఈ తరహా ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్న నెటిజన్లు షఫికుల్లాను అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment