గావస్కర్‌ నాగిని డాన్స్‌.. రైటా? రాంగా? | Sunil Gavaskar Nagin Dance During Nidahas Trophy Final | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 19 2018 3:45 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Sunil Gavaskar Nagin Dance During Nidahas Trophy Final - Sakshi

గావస్కర్‌ నాగిని స్టెప్పు వేసిన దృశ్యం

సాక్షి, స్పోర్ట్స్‌ : నిదాహస్‌ ముక్కోణపు టీ20 సిరీస్‌ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ ఓటమి సంగతి ఏమోగానీ.. గత మ్యాచ్‌లో వాళ్లు చేసిన నాగిని స్టెప్పులే వాళ్ల పాలిట ఇప్పుడు విలన్‌గా మారాయి. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన బంగ్లా ప్లేయర్లను ట్రోలింగ్‌తో ఓ ఆటాడేసుకుంటున్నారు.

ఇందులో భాగంగా దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌(68) వేసిన నాగిని స్టెప్పు వీడియో కూడా వైరల్‌ అవుతుండటం విశేషం. మ్యాచ్‌ 9 ఓవర్లో ఉండగా.. కామెంటరీ బాక్స్‌లో ఉన్న గావస్కర్‌.. రోహిత్‌ బ్యాటింగ్‌ ధాటిని చూసి ఆపుకోలేకపోయారు. తన చెయిర్‌ నుంచి అమాంతం లేచిన ఆయన నాగిని స్టెప్పు వేసేశాడు. అది చూస్తూ మిగతా ఇద్దరు కామెంటేటర్లు తెగ నవ్వుకున్నారు. 

అఫ్‌కోర్స్‌ ఆ వీడియోను లైవ్‌లో చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో చూస్తున్న వాళ్లు సరదాగానే తీసుకుని కామెంట్లు చేస్తున్నారు. కానీ, బంగ్లా క్రికెట్‌ అభిమానులకు మాత్రం అది ఏ మాత్రం రుచించలేదు. ‘దిగ్గజ ఆటగాడు మర్యాదపూర్వకంగా వ్యవహరించలేదంటూ కొందరు మండిపడుతుంటే.. ఆయన అలా చేయటం సరికాదంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఆయన చేసింది రైటా? రాంగా? అన్నది పక్కనపెడితే బంగ్లా ఆటగాళ్లు చేసిన పనికి వాళ్లపై మంటతో ఉన్నవాళ్లకు ఆ వీడియో తెగ కిక్కునిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement