జోరు వానలోనూ.. వాళ్ల డెడికేషన్‌కు అంతా ఫిదా! | Baarat Battles Rain MP Indore Video Viral | Sakshi
Sakshi News home page

జోర్దార్‌ వీడియో: జోరు వానలోనూ.. నీ యవ్వ తగ్గేదే లే!

Published Wed, Jul 6 2022 9:15 PM | Last Updated on Wed, Jul 6 2022 9:15 PM

Baarat Battles Rain MP Indore Video Viral - Sakshi

వైరల్‌: పెళ్లంటే.. మామూలు హడావిడి ఉండదు మన దేశంలో. బారాత్‌లు, ఊరేగింపుల కోసం ప్రిపరేషన్లు కూడా ముందు నుంచే ఉంటాయి కూడా.  మరి ఆ జోష్‌ను దెబ్బ తీసే పరిస్థితులు ఎదురైతే!. 

భారీగా జోరు వాన కురుస్తుండడంతో ఆ పెళ్లి వేడుకలు నీరుగారినట్లే అని అంతా భావించారు. కానీ, చుట్టాలు ఎవరూ తగ్గలేదు. అంత వానలోనూ పైన పెద్ద టార్ఫలిన్‌ పట్టాను కప్పేసుకుని మరీ బారాత్‌ను నిర్వహించారు వాళ్లు. 

వానలోనే తడుస్తూ.. చిందులేసిన వాళ్లు కొందరైతే.. ఆ కవర్‌ కింద నిల్చుని వేడుకలను వీక్షిస్తూ వెంట నడిచిన వాళ్లు మరికొందరు. వీళ్ల డెడికేషన్‌కు ఇంటర్నెట్‌ ఫిదా అయిపోయింది. అందుకే వీడియో తెగ వైరల్‌ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఊరేగింపు చోటు చేసుకుందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement