wedding baraat
-
మందుబాబు చెంప చెల్లుమనిపించిన ఎస్ఐ రాజు
-
పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు.. ఆసుపత్రి బెడ్‌పై కొన ఊపిరితో..!
లఖ్‌నవూ: కొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. పెళ్లి కోసం అంతా సిద్ధం చేసుకుని వధువు ఇంటికి బయలుదేరిన వరుడు తరపు బంధువులను మార్గ మధ్యలోనే మృత్యువు కబళించింది. ట్రక్కు రూపంలో వారికి మృత్యువు ఎదురైంది. వారు వెళ్తున్న జీపు ట్రక్కును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతెపుర్ సిక్రి సమీపంలో ఆగ్రా-జైపూర్ హైవేపై శనివారం తెల్లవారు జామున 5 గంటలకు జరిగింది. జీపు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవటంతో కొరాయి టోల్ ప్లాజా వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. టోల్ ప్లాజా సిబ్బంది, స్థానికులు హుటాహుటిన స్పందించి క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. రాజస్థాన్‌లోని అజ్మెర్‌కు చెందిన వరుడి కుటుంబం పెళ్లి కోసం బిహార్‌లోని పట్నాకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వరుడి కుటుంబంలోని ముగ్గురు చనిపోగా.. జీపు డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. క్షతగాత్రులు ఆగ్రాలోని సీహెచ్‌సీ, ఎస్ఎన్ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నట్లు ఆగ్రా ఎస్పీ సత్యజీత్ గుప్తా తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: ఢిల్లీ అల్లర్ల కేసులో నిర్దోషిగా జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్ ఉమర్ ఖలిద్! -
వాటర్ ట్యాంకర్‌పై వధూవరుల ఊరేగింపు... అసలు సంగతి ఇది..
ఈరోజుల్లో వైరల్ అయిపోవడం చిటికేసినంత ఈజీ అయిపోయింది. చేసే పని ఎలాంటిదైనా కెమెరాకి చిక్కితే చాలూ అన్నట్లు ఉంది పరిస్థితి. కావాలని కొందరు.. అనుకోకుండా కొందరు మీమ్ స్టఫ్ అయిపోతున్నారు. అదే సమయంలో చర్చలకు సైతం దారి తీస్తున్నారు మరికొందరు. అలాంటి జంట గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. వాటర్ ట్యాంకర్‌పై వధువు వరుడిని ఊరేగించిన ఘటన తాలుకా ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. వీళ్లేదో దేశాన్ని ఉద్దరిస్తున్నారా? అనుకోకండి.. సమస్య మీద పోరాటంలో భాగమే ఈ ఊరేగింపు. మహారాష్ట్ర కోల్హాపూర్‌కు చెందిన విశాల్ కోలేకర్(32) వివాహం అపర్ణ అనే యువతితో గురువారం జరిగింది. వివాహం తర్వాత ఆ ఇద్దరినీ ఓ వాటర్ ట్యాంకర్‌పై ఎక్కించి మరీ ఊరేగించారు బంధువులు. రోడ్లు, వీధుల వెంట వెళ్తున్న ఆ ఊరేగింపును చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే వాళ్లు అలా చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. కరువు.. చాలాచోట్ల సీజన్‌తో సంబంధంలేని సమస్యగా మారిపోయింది. అధికారులు కూడా నీటి కొరత తీర్చడంలో అసమర్థత ప్రదర్శిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో తమ ప్రాంతానికి నీటి సరఫరా ఉండట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ జంట ఇలా చేసింది. ‘‘నగరంలో మంచి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మా ఏరియా(మంగళ్వార్ పేట్)లో నెలకొన్న సమస్యను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. కానీ, ఫలితం లేకుండా పోతోంది. ప్రిన్స్ క్లబ్ అనే సోషల్ గ్రూప్ తరపున చాలా కాలంగా పోరాడుతూనే ఉన్నాం.. అయినా నీరు సకాలంలో రావట్లేదు. అందుకే చాలా కుటుంబాలు వాటర్ ట్యాంకర్లనే నమ్ముకున్నాయి’’ అని వరుడు విశాల్ కోలేకర్ వాపోయాడు. Maharashtra | A Kolhapur couple rode a water-tanker on their wedding day, to call attention to the ongoing water crisis in the city. The newly-weds have vowed "not to go on a honey-moon until this crisis ends," according to the message on the tanker. (Source: self-made) pic.twitter.com/1kWM97ogTB — ANI (@ANI) July 9, 2022 ఈ నిరసన ఇక్కడితోనే ఆగిపోలేదు. వివాహ ఊరేగింపులో వాటర్ ట్యాంకర్‌కు ఓ బ్యానర్ కట్టింది ఈ జంట. అందులో నీటి సమస్య తీరేంత వరకు హనీమూన్ కూడా వెళ్లమంటూ పేర్కొన్నారు. విశాల్‌తో పాటు అతని ఆశయానికి అండగా నిలిచిన అపర్ణను చాలామంది అభినందిస్తున్నారు. -
జోరు వానలోనూ.. వాళ్ల డెడికేషన్‌కు అంతా ఫిదా!
వైరల్: పెళ్లంటే.. మామూలు హడావిడి ఉండదు మన దేశంలో. బారాత్‌లు, ఊరేగింపుల కోసం ప్రిపరేషన్లు కూడా ముందు నుంచే ఉంటాయి కూడా. మరి ఆ జోష్‌ను దెబ్బ తీసే పరిస్థితులు ఎదురైతే!. భారీగా జోరు వాన కురుస్తుండడంతో ఆ పెళ్లి వేడుకలు నీరుగారినట్లే అని అంతా భావించారు. కానీ, చుట్టాలు ఎవరూ తగ్గలేదు. అంత వానలోనూ పైన పెద్ద టార్ఫలిన్ పట్టాను కప్పేసుకుని మరీ బారాత్‌ను నిర్వహించారు వాళ్లు. వానలోనే తడుస్తూ.. చిందులేసిన వాళ్లు కొందరైతే.. ఆ కవర్ కింద నిల్చుని వేడుకలను వీక్షిస్తూ వెంట నడిచిన వాళ్లు మరికొందరు. వీళ్ల డెడికేషన్‌కు ఇంటర్నెట్ ఫిదా అయిపోయింది. అందుకే వీడియో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఊరేగింపు చోటు చేసుకుందని తెలుస్తోంది. This called pure #dedication #Barat #Indore 😂🤣 pic.twitter.com/0AyZxVzRE2 — शैलेंद्र यादव (@ShailenderYadu) July 6, 2022 -
నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్
ఓ పక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు హీరోయిన్లు. సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాలు, విహార యాత్రలకు సంబంధించిన పోస్టులు, వీడియోలు పెడుతూ అభిమానులను, ఫాలోవర్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ పోస్టులతో మూవీ ప్రమోషన్స్ చేస్తూ కొత్త ఫాలోవర్స్, సినిమా అవకాశాలను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తను పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. 'ఎఫ్3'తో సక్సెస్ జోష్‌లో ఉన్న బ్యూటిఫుల్ మెహ్రీన్ పిర్జాదా. ఇటీవల తన దగ్గరి బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గోంది హీరోయిన్ మెహ్రీన్. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో నిర్వహించిన బారాత్‌లో నడిరోడ్డుపై స్టెప్పులేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. మరో అమ్మాయితో కలిసి తీన్మార్ ఉత్సాహంగా చిందులేసింది. పెళ్లి బరాత్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది మెహ్రీన్. ఈ పోస్ట్‌కు 'పంజాబీ వెడ్డింగ్ సీన్స్' అనే క్యాప్షన్స్ ఇవ్వగా.. ఈ వీడియో అతి కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. కాగా 'కృష్ణగాడి వీర ప్రేమకథ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ పంజాబీ భామ. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
విషాదం: పెళ్లి బారాత్‌లో ఆగిన గుండె
సాక్షి, వేములవాడ: పెళ్లి బారాత్‌లో ఏర్పాటు చేసిన డీజే పాటలతో యువకులు డ్యాన్స్‌లు, కేరింతలు, ఈలలతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో డీజే సౌండ్ కారణంగా పెళ్లి వాహనంలో ఉన్న వృద్దురాలికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సంతోష క్షణాల మధ్య గడుపుతున్న బంధువులు, కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహానికి కోనరావుపేట గ్రామానికి చెందిన నక్క విజయ (58) అనే మహిళ హాజరైంది. అప్పగింతలు పూర్తి కాగానే పెళ్లి కుమారుని వాహనంలో అనంతపల్లి గ్రామానికి శుక్రవారం రాత్రి చేరుకుంది. చదవండి: ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య.. ‘నా భర్త సైకో..’ పెళ్లి బారత్‌లో భాగంగా డీజే ఏర్పాటు చేశారు. ఈ డీజే సౌండ్ శబ్ధానికి మహిళ చాతిలో నొప్పితో కుప్పకూలింది. అప్పటి వరకు డీజే పాటలకు స్టెప్పులు వేసిన యువకుల డ్యాన్సులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏమైందని అక్కడున్న వారందూ తెరుకునేలోపే మహిళ మృతిచెందింది. దీంతో శుభకార్యం జరిగే ఇంట్లో విషాదం అలుముకుంది. సంబరాలు జరుపుకోవాల్సిన బంధువులు మహిళ మృతదేహంతో కోనరావుపేటకు చేరుకున్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ఆమె లేకపోతే బతకలేనంటూ భార్యతో చెప్పి.. -
వేములవాడలో ‘బుల్లెట్టు బండి’ కపుల్.. ఎగబడ్డ జనం
సాక్షి, వేములవాడ: ‘బుల్లెట్టు బండి’ పాటకు డ్యాన్స్ చేసి ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన జంట శుక్రవారం సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈనెల 14న వీరి పెళ్లి అవ్వగా నేడు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని రాజన్నకు పూజలు చేశారు. దైవ దర్శనం కోసం వచ్చిన దంపతులు అశోక్ సాయిశ్రీయలను చూసేందుకు జనం ఎగబడ్డారు. సోషల్ మీడియా ట్రెండింగ్ కపుల్ కోసం మీడియా సైతం కవరేజీ కోసం పోటీ పడింది. కాగా బుల్లెట్ బండి పాటపై బారాత్ లో సాయి ప్రియ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిన విషయం తెలిసిందే. చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్.. భర్త ఫిదా రచయిత లక్ష్మణ్ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఎస్కే బాజి సంగీతం అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైన పాట ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకోగా ఇక లైక్‌లు లక్షల్లో.. షేర్లు, కామెంట్లు వేలల్లో వస్తున్నాయి. -
పెళ్లి కొడుకు నిర్వాకం.. పీటలపై ఆగిన పెళ్లి
లక్నో : వరుడి మితిమీరిన ప్రవర్తనతో ఓ పెళ్లి పీటలమీద ఆగిపోయింది. ఆచారం కాస్తా వివాదానికి దారి తీయడంతో చివరకు పెళ్లి రద్దయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. వివేక్ కుమార్ (22) వివాహం పట్టణానికి చెందిన ఓ యువతితో శనివారం జరగాల్సి ఉంది. అయితే, వరుడిని పెళ్లి మండపంలోకి తోడ్కొని వెళ్లే క్రమంలో వివాదం చోటుచేసుకుంది. ‘జూతా చురాయి’ అనే ఆచారం ప్రకారం వరుడికి మరదలు వరసయ్యే యువతి వివేక్ చెప్పులు దాచిపెట్టింది. డబ్బులు ఇస్తేనే వాటిని తిరిగి ఇస్తానని అతన్ని ఆటపట్టించింది. అయితే, ఆగ్రహంతో ఊగిపోయిన వివేక్ ఆమెను బండ బూతులు తిట్టాడు. సర్ది చెప్పుదామని చూసిన వ్యక్తిపై చేయి కూడా చేసుకున్నాడు. ఈ వివాదం పెళ్లి కూతురికి తెలియడంతో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ తేల్చిచెప్పింది. వధువు తల్లిదండ్రులు కూడా వివేక్ వ్యవహారం నచ్చకపోవడంతో పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. పెళ్లి కొడుకును, అతని తండ్రి, మరో ఇద్దరు బంధువులను నిర్భంధించారు. వరకట్నం కింద తీసుకున్న రూ.10 లక్షలు తిరిగి చెల్లించేందుకు పెళ్లి కొడుకు తరపువారు అంగీకరించడంతో వారిని విడిచి పెట్టారు. ఈ ఘటనపై మజఫర్‌నగర్ స్టేషన్ ఆఫీసర్ వీరేంద్ర కసానా మాట్లాడుతూ.. పెద్ద మనుషుల సమక్షంలో ఇరు కుటుంబాలు సమస్య పరిష్కరించుకున్నాయని తెలిపారు. ఎలాంటి ఫిర్యాదు అందలేదని వెల్లడించారు. -
పెళ్లిలో ఘర్షణ: చితక్కొట్టుకున్నారు!
సాక్షి, సూర్యాపేట : వివాహ వేడుక అనంతరం నిర్వహించే బరాత్‌లో వరుడు తరఫువారు డీజే సాంగ్స్ పెట్టి డ్యాన్స్‌లు వేద్దామని, వధువు తరఫు వారు వద్దని అనడంతో చిన్నగా మొదలైన ఘర్షణ చినికిచినికి గాలి వానలా మారింది. ఈ ఘర్షణను కొందరు వీడియోలు తీసి వాట్సప్, ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. వివరాలు..మూడు రోజుల క్రితం మండల పరిధిలోని తొగర్రాయిలో బొంతలు కుట్టి జీవనం సాగించే వారి కుటుంబంలో వివాహం జరిగింది. వరుడిది కోదాడ కాగా వధువుది ప్రకాశం జిల్లా. వివాహ అనంతరం డిజే ఏర్పాటు చేసి బరాత్ నిర్వహించేందుకు వరుడు బంధువులు, స్నేహితులు సిద్ధమయ్యారు. వధువు తరఫు వారు మాత్రం తమ ఊరు చాలా దూరమని డీజే వద్దని అనడంతో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి అక్కడ ఉన్న కుర్చీలు, కర్రలు తీసుకుని ఒకరిపై దాడి చేసుకోవడం ప్రారంభించారు. మహిళలు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్లారు. దీంతో స్థానికులు 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో రూరల్ పోలీసులకు అక్కడకు చేరుకుని ఘర్షణ చేస్తున్న వారిని చెదరగొట్టారు. సినిమాలో జరిగే ఫైట్ మాదిరిగా జరుగుతున్న ఈ ఘర్షణను అక్కడే ఉన్న కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషయంపై రూరల్ పోలీసులను సంప్రదించగా ఘర్షణ జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఎవరు ఫిర్యాదు కూడా చేయలేదని తెలిపారు. -
పిలిస్తే రాలేదని..
బంజారాహిల్స్: బస్తీలో తమను కాదని హల్చల్ చేస్తున్నావంటూ పెళ్లి బరాత్‌లో ఓ యువకుడిపై స్థానిక నాయకులు దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2, ఇందిరానగర్‌కు చెందిన వినోద్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి అతను తన బావ పెళ్లి బారాత్‌లో పాల్గొన్నాడు. అదే సమయంలో బస్తీకి చెందిన నాయకుడు లడ్డురాజు యాదవ్ వినోద్‌ను తన వద్దకు రమ్మని పిలిచాడు. అతను రాకపోవడంతో పది నిమిషాల తర్వాత అక్కడికి వెళ్లిన రాజుయాదవ్ తమాషా చేస్తున్నావా..? నేను పిలిస్తే రావా...? ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నావ్.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఉద్రిక్తతకు నెలకొంది. అదే రోజు రాత్రి సంతోష్ అనే యువకుడి ఇంటికి వెళ్లిన రాజు యాదవ్, రాజేష్, వడ్డెర శ్రీనివాస్ అతడి తల్లి పుష్పలతను దూషించారు. ఈ విషయం తెలియడంతో అక్కడికి వెళ్లిన వినోద్‌ను మరోసారి బెదిరించారు. తెల్లవారుజామున వినోద్, తన స్నేహితులు శివ, ఆంథోనితో కలిసి స్థానిక గణేశ్మండపం వద్ద టిఫిన్ చేస్తుండగా అక్కడికి వెళ్లిన లడ్డురాజుయాదవ్, అతడి కుమారులు అభిమన్యు, సంతోష్, అనుచరులు రాజేష్, వడ్డెర శ్రీను, శ్రీనివాస్, వికాస్, రాకేష్ కర్రలతో శివ, ఆంథోనిలపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. -
తల్వార్లతో విన్యాసాలు.. మెడతెగి మైనర్ మృతి
సాక్షి, హైదరాబాద్ : పెండ్లి బరాత్‌లో తల్వార్లతో విన్యాసాలు (మర్ఫా డాన్స్) చేసిన మైనర్లు.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితులు పిలిస్తే వెళ్లి.. : షేక్‌పేటకు చెందిన సయ్యద్ హమీద్ స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. స్నేహితులు పిలవడంతో మూడురోజుల కిందట అతను ఓ పెండ్లి బరాత్‌కు వెళ్లి డాన్స చేశాడు. అక్కడ కొందరు మైనర్లు.. అనుభవం లేకున్నా కత్తులు, తల్వార్లతో విన్యాసాలు చేశారు. ఆ క్రమంలోనే దూసుకొచ్చిన తల్వార హమీద్ మెడకు తగిలింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను కుప్పకూలిపోయాడు. అనంతరం ఆ బాలుడిని దారుసలాంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం అతను ప్రాణాలు విడిచారు. పోలీసుల అదుపులో 10 మంది : ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో బాధితుడి తల్లి ఫిర్యాదుమేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తులో భాగంగా బరాత్‌లో తల్వార్లతో విన్యాసాలు చేసిన 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోన్న తల్లి.. వేడుకల్లో ఆయుధాలతో విన్యాసాలు వద్దని పిలుపునిస్తున్నారు. -
బరాత్ పెళ్లికొడుకుని ఎంతపనిచేసింది..
అహ్మదాబాద్: వివాహం ఓ వరుడుడికి విషాధంగా మారింది. తనకు పెళ్లయిన జోష్‌లో ఎగిరి గంతులేస్తూ అనుకోని రీతిలో అతడు మృత్యువాత పడ్డాడు. తీవ్ర గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని రనోడీ ప్రాంతానికి చెందిన సూరజ్ సోలంకీ(23) అనే యువకుడికి వివాహం అయింది. సాధారణంగా వివాహం అనంతరం బరాత్ కార్యక్రమం జరిగే విషయం తెలిసిందే. ఇందులో అంతా సంతోషంతో ఎగిరి గంతులేస్తుండగా అతడి మిత్రులు కొందరు పెళ్లికొడుకును తమ భుజాలపైకి ఎక్కించుకున్నారు. అనంతరం డప్పుతోపాటు డీజే సౌండ్‌కు మైమరిచి ఎగరడం ప్రారంభించారు. స్నేహితుడి భుజాలపై ఉన్న పెళ్లి కొడుకు కూడా సంతోషంతో తెగ కేకలు పెడుతూ డ్యాన్స్ మాదిరిగా ఊగిపోతూ కుప్పకూలి ఒక్కసారిగా కిందపడిపోయాడు. తీవ్ర గుండెపోటు వచ్చి అక్కడికక్కడే బరాత్ వేడుకలోనే చనిపోయాడు. వధువు ఇంటికి ఊరేగింపుగా వెళుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.