బరాత్‌ పెళ్లికొడుకుని ఎంతపనిచేసింది.. | groom died with heart attack at his wedding baraat | Sakshi
Sakshi News home page

బరాత్‌ పెళ్లికొడుకుని ఎంతపనిచేసింది..

Published Fri, May 12 2017 10:01 AM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

బరాత్‌ పెళ్లికొడుకుని ఎంతపనిచేసింది..

బరాత్‌ పెళ్లికొడుకుని ఎంతపనిచేసింది..

అహ్మదాబాద్‌: వివాహం ఓ వరుడుడికి విషాధంగా మారింది. తనకు పెళ్లయిన జోష్‌లో ఎగిరి గంతులేస్తూ అనుకోని రీతిలో అతడు మృత్యువాత పడ్డాడు. తీవ్ర గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని రనోడీ ప్రాంతానికి చెందిన సూరజ్‌ సోలంకీ(23) అనే యువకుడికి వివాహం అయింది.

సాధారణంగా వివాహం అనంతరం బరాత్‌ కార్యక్రమం జరిగే విషయం తెలిసిందే. ఇందులో అంతా సంతోషంతో ఎగిరి గంతులేస్తుండగా అతడి మిత్రులు కొందరు పెళ్లికొడుకును తమ భుజాలపైకి ఎక్కించుకున్నారు. అనంతరం డప్పుతోపాటు డీజే సౌండ్‌కు మైమరిచి ఎగరడం ప్రారంభించారు. స్నేహితుడి భుజాలపై ఉన్న పెళ్లి కొడుకు కూడా సంతోషంతో తెగ కేకలు పెడుతూ డ్యాన్స్‌ మాదిరిగా ఊగిపోతూ కుప్పకూలి ఒక్కసారిగా కిందపడిపోయాడు. తీవ్ర గుండెపోటు వచ్చి అక్కడికక్కడే బరాత్‌ వేడుకలోనే చనిపోయాడు.  వధువు ఇంటికి ఊరేగింపుగా వెళుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement