
సాక్షి, వేములవాడ: పెళ్లి బారాత్‌లో ఏర్పాటు చేసిన డీజే పాటలతో యువకులు డ్యాన్స్‌లు, కేరింతలు, ఈలలతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో డీజే సౌండ్ కారణంగా పెళ్లి వాహనంలో ఉన్న వృద్దురాలికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సంతోష క్షణాల మధ్య గడుపుతున్న బంధువులు, కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహానికి కోనరావుపేట గ్రామానికి చెందిన నక్క విజయ (58) అనే మహిళ హాజరైంది. అప్పగింతలు పూర్తి కాగానే పెళ్లి కుమారుని వాహనంలో అనంతపల్లి గ్రామానికి శుక్రవారం రాత్రి చేరుకుంది.
చదవండి: ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య.. ‘నా భర్త సైకో..’
పెళ్లి బారత్‌లో భాగంగా డీజే ఏర్పాటు చేశారు. ఈ డీజే సౌండ్ శబ్ధానికి మహిళ చాతిలో నొప్పితో కుప్పకూలింది. అప్పటి వరకు డీజే పాటలకు స్టెప్పులు వేసిన యువకుల డ్యాన్సులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏమైందని అక్కడున్న వారందూ తెరుకునేలోపే మహిళ మృతిచెందింది. దీంతో శుభకార్యం జరిగే ఇంట్లో విషాదం అలుముకుంది. సంబరాలు జరుపుకోవాల్సిన బంధువులు మహిళ మృతదేహంతో కోనరావుపేటకు చేరుకున్నారు.
చదవండి: వివాహేతర సంబంధం: ఆమె లేకపోతే బతకలేనంటూ భార్యతో చెప్పి..
Comments
Please login to add a commentAdd a comment