
సాక్షి, వేములవాడ: ‘బుల్లెట్టు బండి’ పాటకు డ్యాన్స్ చేసి ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన జంట శుక్రవారం సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈనెల 14న వీరి పెళ్లి అవ్వగా నేడు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని రాజన్నకు పూజలు చేశారు. దైవ దర్శనం కోసం వచ్చిన దంపతులు అశోక్ సాయిశ్రీయలను చూసేందుకు జనం ఎగబడ్డారు. సోషల్ మీడియా ట్రెండింగ్ కపుల్ కోసం మీడియా సైతం కవరేజీ కోసం పోటీ పడింది. కాగా బుల్లెట్ బండి పాటపై బారాత్ లో సాయి ప్రియ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిన విషయం తెలిసిందే.
చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్.. భర్త ఫిదా
రచయిత లక్ష్మణ్ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఎస్‌కే బాజి సంగీతం అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైన పాట ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకోగా ఇక లైక్‌లు లక్షల్లో.. షేర్లు, కామెంట్లు వేలల్లో వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment