కూతురి కోసం ప్రియాంక చోప్రా ఏం చేసిందంటే? | Priyanka Chopra Reunites With Daughter Malti After Attending Brother's Wedding In Mumbai, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Priyanka Chopra: కూతురి కోసం ప్రత్యేక ఖాతా.. షేర్ చేసిన ప్రియాంక చోప్రా!

Published Thu, Aug 29 2024 7:43 AM | Last Updated on Thu, Aug 29 2024 9:23 AM

Priyanka Chopra reunites with daughter Malti after Mumbai trip

బాలీవుడ్ నటి, హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవల తన సోదరుడి ఎంగేజ్‌మెంట్‌ వేడుకలకు హాజరైంది. ముంబయిలో జరిగిన సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థ వేడుకలో సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పోస్ట్ చేసింది.

అయితే హాలీవుడ్ సింగర్ నిక్‌జోనాస్‌ను పెళ్లాడిన ప్రియాంక చోప్రాకు మాల్టీ మేరీ అనే కూతురు కూడా ఉంది. ఇండియా పర్యటన ముగించుకుని అమెరికా వెళ్లింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన కూతురి ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా తన కూతురి పేరుతో ఇన్‌స్టా అకౌంట్‌ పేరును పంచుకుంది.తన కుమార్తె మాల్టీ మేరీతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. కూతురి పేరుతో ఖాతాను ఓపెన్ చేసిన ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది.

కాగా.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం పానీ అనే మరాఠీ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా హెడ్స్ ఆఫ్ స్టేట్‌లో అనే మూవీలో నటిస్తున్నారు. ఆ తర్వాత యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తోన్న ది బ్లఫ్‌ మూవీలో ప్రియాంక కనిపించనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement