
ప్రపంచాన్నే అబ్బురపరిచిన సినిమాల్లో అవతార్ (Avatar Movie) ఒకటి. వేల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాలో ఆఫర్ వస్తే చేయనని చెప్పేశాడట బాలీవుడ్ నటుడు గోవిందా (Actor Govinda). అసలు అవతార్ సినిమా ఛాన్స్ తనకెలా వచ్చింది? ఎందుకు రిజెక్ట్ చేశాడు? వంటి విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గోవిందా మాట్లాడుతూ.. అమెరికాలో నేనొక సర్దార్‌ను కలిశాను. ఆయనకు నేనిచ్చిన బిజినెస్ ఐడియా బాగా వర్కవుట్ అయింది.
అవతార్ టైటిల్ నేనే ఇచ్చా..
కొన్నేళ్ల తర్వాత ఆయన నన్ను జేమ్స్ కామెరూన్‌కు పరిచయం చేశాడు. జేమ్స్‌తో కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. సరేనని తనను డిన్నర్‌కు పిలిచి సినిమా గురించి మాట్లాడాం. ఆయన చెప్పిన కథ విని దానికి అవతార్ అన్న టైటిల్ పెడితే బాగుంటుందని చెప్పాను. సినిమాలో హీరో దివ్యాంగుడు అని చెప్పాడు. వెంటనే నేను చేయనని చెప్పేశాను. రూ.18 కోట్లు ఇస్తానన్నా వద్దన్నాను.
శరీరానికి రంగు పూసుకోవడం..
దాదాపు 410 రోజులు ఆయన సినిమాకే కేటాయించాలి. అది పర్వాలేదు కానీ నా శరీరానికి రంగు పూసుకునే ఉండాలి. అలా చేస్తే నేను ఆస్పత్రిపాలవుతాను. నటుడిగా నాకు శరీరం అనేది చాలా అవసరం. పెయింట్ పూసుకోవడం వల్ల ఏవైనా దుష్ఫలితాలు ఎదురైతే జీవితాంతం బాధను అనుభవించాల్సి ఉంటుంది. అలాగే ఇలాంటి మంచి సినిమాలకు నో చెప్తే అందరూ లైట్ తీసుకోలేరు. వారు దగ్గరివారైనా సరే ఇగో చూపిస్తారు.
బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా అవతార్
అలాంటప్పుడు ఏళ్ల తరబడి క్షమాపణలు చెప్తూనే ఉండాలి అని చెప్పుకొచ్చాడు. జేమ్స్ కామెరూన్ తీసిన అద్భుత చిత్రాల్లో అవతార్ ఒకటి. 2009లో రిలీజైన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తర్వాత దీనికి కొనసాగింపుగా 2022లో అవతార్: ద వే ఆఫ్ వాటర్ రిలీజైంది. గోవిందా విషయానికి వస్తే ఆయన నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయని ఇటీవల అతడే స్వయంగా ఓ షోలో వెల్లడించాడు.
చదవండి: ఎన్నో దారుణమైన సౌత్ సినిమాలకంటే కంగువా బెటర్: జ్యోతిక
Comments
Please login to add a commentAdd a comment