Priyanka Chopra Reveals Why She leaves Bollywood - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: అందుకే బాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేశా: ప్రియాంక చోప్రా

Published Tue, Mar 28 2023 4:17 PM | Last Updated on Tue, Mar 28 2023 4:39 PM

Priyanka Chopra Reveals Why She leaves Bollywood - Sakshi

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. తాజాగా బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను హాలీవుడ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ప్రియాంక చోప్రా వెల్లడించింది. బాలీవుడ్‌లో తనకు వచ్చిన అవకాశాల పట్ల సంతోషంగా లేనని తెలిపింది. దీనికి కారణం తాను అభద్రతాభావానికి గురి కావడమేనని పేర్కొంది. కాగా.. ప్రియాంక చోప్రా 2015 టెలివిజన్ సిరీస్ క్వాంటికోలో నటించిన తర్వాత హాలీవుడ్‌లోకి ప్రవేశించింది.

ప్రియాంక మాట్లాడుతూ.. 'తనను బాలీవుడ్‌లో ఓ మూలన పడేశారు. అంతేకాకుండా కొందరితో విభేదాలు ఏర్పడ్డాయి. ఆ రాజకీయాలు చేసే ఉద్దేశం నాకు లేదు. బాలీవుడ్‌ రాజకీయాలతో నేను విసిగిపోయా. అందుకే బాలీవుడ్ నుంచి పూర్తిగా బ్రేక్ తీసుకోవాలనిపించింది. అందుకే అమెరికా వచ్చేశా.' అని ప్రియాంక వివరించింది. ఆ సమయంలోనే తన మేనేజర్ అంజులా ఆచార్య తన మ్యూజిక్ వీడియోను చూసి యూఎస్‌లో పనిచేసే అవకాశం ఇచ్చారని ఆమె చెప్పింది.

మ్యూజిక్ కెరీర్‌ సక్సెస్‌ కాకపోతే సినిమాల్లో ప్రయత్నించి చూడాలని ఒకరు సూచించారని ప్రియాంక తెలిపింది. అందుకే క్వాంటికోలో నటించానని చెప్పింది. ఆ తర్వాత బేబీవాచ్, మ్యాట్రిక్స్, రెవల్యూషన్స్, ద వైట్ టైగర్‌లో అవకాశాలను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. త్వరలో సిటాడెల్ సెకండ్ షోతోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియాంక నటించిన లవ్ ఎగైన్ అనే సినిమా మేలో విడుదల కానుంది.  

గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రియాంక.. నిక్‌ జోనస్‌ను 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్' సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. ఇందులో ఆమె రిచర్డ్ మాడెన్‌తో పాటు గూఢచారి పాత్రలో నటించారు. ఈ సిరీస్ ఏప్రిల్ 28 నుండి ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement