
కొన్నేళ్లుగా ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదంటోంది బిగ్‌బాస్ బ్యూటీ, నటి సనా మక్బుల్ (Sana Makbul). సమంతలాగే తనకు ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చిందని వాపోయింది. శరీరంలోని కణాలు.. అవయవాలపై దాడి చేస్తున్నాయంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో సనా మక్బుల్ మాట్లాడుతూ.. కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను ఈ మధ్యే శాఖాహారిగా మారిపోయాను. నేను ఆటోఇమ్యూన్ హెపటైటిస్ రోగినని చాలామందికి తెలియదు.
2020లో బయటపడింది
నాకు కాలేయ వ్యాధి ఉంది. ఇది 2020లో బయటపడింది. ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో ఈ వ్యాధి ఉందన్న విషయం ఆలస్యంగా తెలిసింది. ఈ వ్యాధి కారణంగా నా శరీరంలోని కణాలు నా అవయవాలపై దాడి చేస్తున్నాయి. అది శరీరమంతటా పాకొచ్చు, కిడ్నీలపైనా దాడి చేయొచ్చు, మోకాళ్ల నొప్పులకు కారణం కావచ్చు, ఇలా ఏదైనా జరగొచ్చు. సమంతకు ఉన్న ఆటోఇమ్యూన్ వ్యాధి మయోసైటిస్. దీని వల్ల ఆమె కండరాల బలహీనతను ఎదుర్కొంటోంది. అలాగే నాకున్న ఆటోఇమ్యూన్ వ్యాధి వల్ల కాలేయం డ్యామేజ్ అవుతోంది.
నయమవుతుందో.. లేదో!
స్టెరాయిడ్స్, కొన్నిరకాల ఔషధాలు తీసుకున్నాను. జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల ఇది వచ్చిందనుకుంటున్నాను. నా ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుందో, లేదో కూడా తెలియదు అని చెప్పుకొచ్చింది. సనా మక్బుల్.. దిక్కులు చూడకు రామయ్య, మామ ఓ చందమామ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్ విజేతగానూ నిలిచింది. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటిస్తోంది.
చదవండి: అవతార్ సినిమాలో ఛాన్స్.. కోట్లు ఇస్తానన్నా 'నో' చెప్పా: గోవిందా
Comments
Please login to add a commentAdd a comment