అట్టహాసంగా ఐఫా వేడుక.. సీనియర్ నటి డ్యాన్స్‌ అదుర్స్! | Senior Actress Rekha Dazzles At IIFA 2024 Awards Ceremony With Dance Performance, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Rekha: ఐఫా వేడుకల్లో మెరిసిన సీనియర్ నటి రేఖ!

Published Sun, Sep 29 2024 1:54 PM | Last Updated on Sun, Sep 29 2024 2:50 PM

Senior Actress Rekha dazzles at IIFA 2024 Awards Ceremony

ప్రతిష్టాత్మక సినీ అవార్డుల వేడుక ఐఫా-2024 అట్టహాసంగా జరుగుతోంది. సినీ ఇండస్ట్రీలో ఉత్తమ నటన కనబరిచిన వారికి అవార్డులను అందజేస్తారు. ఇప్పటికే పలువురు సినీతారలు ఈ అవార్డ్స్ దక్కించుకున్నారు. సెప్టెంబరు 27న మొదలైన ఈ వేడుక ఆదివారంతో ముగియనుంది. ఇప్పటికే సౌత్ ఇండియా, బాలీవుడ్ తారలకు అవార్డులను ప్రకటించారు.

అయితే ఈ వేడుకలకు హాజరైన సీనియర్ నటి రేఖ అందరి దృష్టిని ఆకర్షించింది. 1965లో వచ్చిన ఆమె నటించిన చిత్రం గైడ్‌లోని ఓ సాంగ్‌కు డ్యాన్స్‌తో అదరగొట్టింది. 150 మంది డ్యాన్సర్లతో కలిసి దాదాపు 20 నిమిషాల పాటు అభిమానులను  అలరించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.  పింక్ అనార్కలి సూట్‌లో రేఖ మిస్టర్ నట్వర్‌లాల్‌ చిత్రంలోని "పర్దేశియా" పాటకు డ్యాన్స్‌తో అదరగొట్టింది.

(ఇది చదవండి: ఐఫా- 2024 విజేతలు.. అవార్డ్స్‌ అందుకున్న బాలీవుడ్‌, సౌత్‌ ఇండియా స్టార్స్‌)

కాగా.. టాలీవుడ్‌లో ఉత్తమ నటుడిగా నాని(దసరా) నిలిచారు. ఉత్తమ చిత్రంగా దసరా మూవీకి అవార్డ్ దక్కింది. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్(జవాన్) ఉ‍త్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ నిలిచింది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement