
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ గురించి తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది చంద్రముఖి-2 అలరించిన ముద్దుగుమ్మ.. ఈ ఏడాదిలో ఎమర్జన్సీ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఇందిరాగాంధీ ప్రధాని ఉన్న సమయంలో విధించిన ఎమర్జన్సీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు.
ఇదిలా ఉండగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా పెట్టిన తాజా పోస్ట్ వైరల్‌గా మారింది. తనకు తాను లతా మంగేష్కర్‌తో పోల్చుకున్న కంగనా.. డబ్బుల కోసం సెలబ్రిటీల వివాహాల్లో డ్యాన్స్ చేయనని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్‌పై నెట్టింట చర్చ మొదలైంది. తనకు డబ్బుల కంటే.. ఆత్మ గౌరవమే ముఖ్యమని తెలిపింది. కాగా.. స్టార్ సింగర్ లతా మంగేష్కర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంత డబ్బిచ్చినా పెళ్లిళ్లలో పాడనని చెప్పారు.
అయితే ఇటీవల అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు డ్యాన్స్‌లు వేస్తూ కనిపించారు. అంతే కాదు ఈ వేడుకల్లో డ్యాన్స్ చేసినందుకు భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కంగనా వారిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కంగనా చేసిన పోస్ట్‌కు కొందరు నెటిజన్స్ మద్దతుగా నిలవగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment