బాలీవుడ్ భామ, నటి కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 6న వెండితెరపైకి రానుంది. కంగనా సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.
తాజాగా కంగనాకు సంబంధించిన ఓ వార్త బీ టౌన్‌లో వైరల్‌గా మారింది. ముంబయిలోని తన ఇంటిని అమ్మకాని పెట్టారని టాక్ వినిపిస్తోంది. అందులోనే కంగనా నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ కార్యాలయం కూడా ఉంది. బాంద్రాలో దాదాపు 3,042 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న రెండు అంతస్తుల భవనం అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీటి ధరను రూ. 40 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కంగనా అధికారికంగా వెల్లడించలేదు.
అయితే గతంలో సెప్టెంబర్ 2020లో గ్రేటర్ ముంబయి అధికారులు కూల్చివేశారు. ఆ తర్వాత కంగనా కేసు దాఖలు చేయడంతో బాంబే హైకోర్టు స్టే విధించింది. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కావాలనే నన్ను టార్గెట్ చేశారని కంగనా ఆరోపించింది. అప్పట్లో రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. ఆ తర్వాత మే 2023లో కంగనాపై అభియోగాలను బీఎంసీ ఉపసంహరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment