రేప్ చేశాడు.. పుట్టిన పాపనూ అమ్మేశాడు!
బరేలి: యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ యువకుడు.. పెద్దల ఒత్తిడితో ఆమెను పెళ్లిచేసుకున్నాడు. పుట్టిన బిడ్డను పాతిక వేలకు అమ్మేసి, ఆమెను మరో ముసలాడికిచ్చి కట్టబెట్టేందుకు ప్రయత్నించాడు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ పోలీస్ స్టేషన్ లో నమోదయిన కేసు వివరాలు ఇలాఉన్నాయి..
కుట్టు మిషన్ సామాగ్రి అమ్మే షవీజ్ అనే యువకుడికి 2013లో దర్జీగా పనిచేస్తోన్న ఓ యువతి పరిచయమైంది. దారాలు, సూదుల కోసం షాపునకు వచ్చే ఆ యువతిని ప్రేమ పేరుతో లోబర్చుకున్న షవీజ్.. పెళ్లిచేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. తీరా ఆమె గర్భం దాల్చిన తర్వాత ప్లేటు ఫిరాయించాడు. దీంతో యువతి తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదుచేసేందుకు సిద్ధమైంది. అయితే ఊరిపెద్దల జోక్యంతో చివరికి షవీజ్.. ఆ అమ్మాయినే పెళ్లిచేసుకున్నాడు. కొద్ది కాలానికి పాప పుట్టింది.
ఎలాగౌనాసరే భార్యాపిల్లల్ని ఒదిలించుకోవాలనుకున్న షవీజ్.. పుట్టిన పాపాయిని.. పిల్లలు లేని ఓ జంటకు రూ.25 వేలకు అమ్మేశాడు. ఇక భార్యను.. అప్పటికే ఏడుగురు సంతానం ఉండి, మొదటి భార్య చనిపోయిన ఓ వక్తికి ఇచ్చి కట్టబెట్టేందుకు ప్రయత్నించాడు. ఎలాగోలా అతని చెరనుంచి తప్పించుకుని పుట్టింటికి వచ్చిన ఆ యువతి ఆదివారం బరేలీ పోలసు ఉన్నతాధికులకు ఫిర్యాదుచేసింది. భర్త, అతని కుటుంబ సభ్యులను శిక్షించాలని, తన పాపను తిరిగి ఇప్పించాలని పోలీసులను వేడుకుంది. ఈ కేసుపై డీఐజీ అసుతోష్ కుమార్ మాట్లాడుతూ మహిళా సీఐని దర్యాప్తు అధికారిగా నియమించామని, అన్ని కోణాల్లో వాస్తవాలను పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.