
ఘోర ప్రమాదం: 22 మంది మృతి
బరేలీ: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బరేలీ సమీపంలో బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 22 మంది మృతి చెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో బస్సు డీజిల్ ట్యాంక్ పగలడంతో.. రెండు వాహనాలకు మంటలంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. మంటలు బస్సులోకి వ్యాపించడంతో.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్షతగాత్రులను జిల్లా అసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఢిల్లీ నుంచి తూర్పు యూపిలోని గోండా జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని అధికారులు వెల్లడించారు.