యువరాజుకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయి?
బరేలీ: ఎన్నికల ముందు మాత్రమే కాంగ్రెస్ పేదల జపం చేస్తుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 365 రోజులూ ఏప్రిల్ పూల్స్ డే పాటిస్తుందని ఎద్దే వా చేశారు. పేదరికంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా తిప్పికొట్టారు. యువరాజుకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయంటూ కౌంటర్ ఇచ్చారు.
రైతులను, సైనికులను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. జై జవాన్, జై కిసాన్ స్ఫూర్తి యూపీఏకు తెలుసా అని ప్రశ్నించారు. యూపీఏ పాలనలో రైతులకు భరోసా లేదన్నారు. అందుకే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో సమాజ్వాది పార్టీ కుమ్మక్కయిందని ఆరోపించారు. ఇందులో భాగంగానే సోనియా, రాహుల్పై సమాజ్వాది పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టలేదన్నారు.