April Fools Day
-
ఫేస్బుక్ లైవ్‌లో ఫ్రెండ్స్‌ను ఏప్రిల్ ఫూల్స్ చేయబోయి..
తిరువనంతపురం: ఏప్రిల్ 1వ తేదీని ఏప్రిల్ ఫూల్ డేగా భావిస్తారు. ఆ రోజు తమ వారిని కొంత ఫూల్‌ను చేద్దామని ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వింత వింత చేష్టలు చేస్తారు. అవి కొందరికి కోపం తెప్పిస్తాయి. మరికొన్ని తీవ్ర పరిస్థితులకు దారి తీస్తాయి. తాజాగా ఓ విద్యార్థి తన స్నేహితులను ఏప్రిల్ ఫూల్ చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫేస్బుక్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లైవ్ వీడియో తీసుకునేందుకు ప్రయత్నించి మరణించిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళ అలప్పుజ జిల్లాలోని తళవాడి పప్రాంతంలోని కిలిరోర్లో సిద్ధార్థ్ అజయ్ (17) తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి నివసిస్తున్నాడు. ఏప్రిల్ 1వ తేదీ సందర్భంగా గురువారం రాత్రి భోజనం అనంతరం తన గదిలోకి వెళ్లాడు. తన స్నేహితులను ఏప్రిల్ ఫూల్ చేద్దామని భావించి ఓ ప్రాంక్‌గా ఆత్మహత్య చేసుకున్నట్లు నటిద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా ఫేస్బుక్ లైవ్ ఆన్ చేశాడు. బెడ్ షీట్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు నటిద్దామని ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో ఆ బెడ్ షీట్ అతడికి బిగుతుగా బిగించుకుపోయి అతడికి ఊపిరాడకుండాపోయింది. అయితే కుమారుడిని పిలుద్దామని గదిలోకి వెళ్లిన తల్లి నిర్ఘాంతపోయింది. కుమారుడు ఫ్యాన్‌కు వేలాడుతుండడంతో కంగారుపడింది. వెంటనే కుటుంబసభ్యుల సహాయంతో అజయ్‌ని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అజయ్ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ యువకుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఇంకా ఫేస్బుక్ లైవ్ కొనసాగుతుండడం గమనార్హం. -
'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు!
ఇటీవల వచ్చిన చిన్న సినిమా జాతిరత్నాలు పెద్ద హిట్టు సాధించింది. థియేటర్లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత కామెడీని పంచిన చిత్రం మరొకటి లేదనడంలో ఆశ్చర్యమేమీ లేదు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తాజాగా ఆస్కార్‌కు ఎంపికైందట. ఈ మేరకు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన సర్టిఫికెట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బెస్ట్ జానే జిగర్ మూవీ కేటగిరీ కింద ఈ సినిమాకు నామినేషన్ అయ్యిందని సంస్థ తెలియజేసింది. అయితే ఈ మధ్యే ఆస్కార్ అవార్డుల ప్రదానం అయిపోతే కొత్తగా జాతిరత్నాలు సినిమా నామినేట్ అవడమేంటి అని బుర్రలు బద్ధలు చేసుకున్నారు. కానీ కాసేపటికే వారికి అసలు విషయం అర్థమైంది. ఈ రోజు ఏప్రిల్ 1 కావడంతో అందరినీ ఏప్రిల్ ఫూల్ చేశారని తెలిసొచ్చింది. అలా ఈ రోజు మన జాతిరత్నాలు అందరినీ వెర్రివెంగళప్పలను చేశారన్నమాట! Eeeeyyy... Congratulations 🥳#JathiRatnalu @NaveenPolishety @fariaabdullah2 @priyadarshi_i @eyrahul @anudeepfilm @vennelakishore @actorbrahmaji @ItsActorNaresh @murlisharma72 @radhanmusic #PriyankaDutt @nagashwin7 @SwapnaCinema @VyjayanthiFilms @LahariMusic pic.twitter.com/4PWLEJefti — Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 1, 2021 చదవండి: చిట్టీ అని పిలుస్తుంటే భలేగా ఉంది: ఫరియా ఏప్రిల్: రిలీజయ్యే కొత్త సినిమాలివే గురూ.. -
కరోనాపై ప్రాంక్ చేయండి: పుణె సీపీ
సాక్షి, పుణె: ఏప్రిల్ ఫూల్ డే సందర్భంగా సోషల్‌మీడియాలో దానికి సంబంధించిన పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అయితే పుణె పోలీస్ కమీషనర్ వెంకటేశం ట్విటర్లో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పొరాడుతున్నందున ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి కోవిడ్-19ను అంతమెందించే నాలుగు సూత్రాలను పాటిచాలని కోరుతూ నాలుగు ఫోటోలను జత చేశారు. ఏప్రిల్ ఫూల్ రోజు నెటిజన్లంతా కరోనాపై ప్రాంక్ చేసి దాన్ని తరిమికొట్టాలని పేర్కొన్నారు. ‘ఇంట్లోనే ఉండండి, చేతులను తరుచుగా శుభ్రం చేసుకోండి, అవసరమైతే తప్పా బయటికి వెళ్లకండి, అవాస్తవ ప్రచారం చేయకండి’ అంటూ కమిషనర్ వెంకటేశం ట్వీట్ చేశారు. నెటిజన్ల నుంచి ఈ ట్వీట్ కి మంచి స్పందన లభిస్తోంది. మేం కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాం సర్ అంటూ చాలామంది రీ ట్వీట్ చేస్తున్నారు. (కరోనా ఎఫెక్ట్: సీఎం వేతనం కట్!) -
ఏప్రిల్ ఫూల్ పేరిట తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు
స్టేషన్‌ఘన్‌పూర్: ఏప్రిల్ ఒకటిన సరదాగా చేసే ఫూల్ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తప్పుడు ప్రచారం చేయొద్దని సీఐ రాజిరెడ్డి ప్రజలు, ముఖ్యంగా యువతకు సూచించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియాలో ఎవరైనా పరిధి దాటితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. పోస్టులు చేసేవారితో పాటు ఆయా గ్రూపుల అడ్మిన్లపై చర్యలు ఉంటాయని తెలిపారు. తప్పుడు పోస్టులు పెట్టి అనవసరంగా కేసుల్లో ఇరుక్కొని జీవితాలు పాడు చేసకోవద్దన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి కోవిడ్ –19 బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్నారు. -
ఏప్రిల్ ఫూల్స్ డే : బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ట్రోల్ చేసేందుకు ట్విటర్లో పలువురు పప్పు దివస్‌ను సెలబ్రేట్ చేస్తుండగా, ‘మోదీ మత్ బనావ్’ హ్యాష్‌ట్యాగ్‌తో కాంగ్రెస్ కాషాయపార్టీని ట్రోల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏప్రిల్ 1న ఆల్ ఫూల్స్ డేను సెల్రబేట్ చేసుకుంటుండగా, గత కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌లు సైతం పరస్పరం తలపడుతూ ఫూల్స్ డేను రక్తికట్టిస్తున్నాయి. కాగా, 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ, బీజేపీ చేసిన వాగ్ధానాలను గుర్తుచేస్తూ వారిని నమ్మొద్దంటూ మోదీమత్‌బనావ్ హ్యాష్‌ట్యాగ్‌తో కాంగ్రెస్ సోమవారం ట్విటర్లో క్యాంపెయిన్ చేపట్టింది. ‘బ్లాక్ మనీ ఇంకా దేశానికి చేరలేదు..నీరవ్ మోదీ దేశానికి చేరలేదు..యువత ఇంకా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా’రంటూ మోదీ వైఫల్యాలను ఈ క్యాంపెయిన్ సందర్భంగా కాంగ్రెస్ ట్రోల్ చేస్తోంది. మరోవైపు సోమవారం ఉదయం బీజేపీ మద్దతుదారులు పప్పుదివస్ పేరిట కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు. రాహుల్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 30,000కుపైగా ట్వీట్లతో పప్పుదివస్ ట్విటర్లో టాప్ ట్రెండ్‌లో నిలిచింది. -
ఇంతవరకూ చూడని విమానం..!
దుబాయ్ : గల్ఫ్ విమానయాన సంస్థ ఎమిరేట్స్ కొత్త బోయింగ్ విమానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ఇది సాధారణ విమానం కాదు. ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి విమానం లేదు. దానిపై కప్పు మొత్తం గాజుతో చేసిందట. సాధారణంగా ఏ విమానంలో అయిన చిన్న కిటికిలోంచి మాత్రమే బయటికి చూసే అవకాశం ఉంటుంది. కానీ ఈ బోయింగ్ 777ఎక్స్‌లో ప్రయాణిస్తూ అందమైన ఆకాశం, విమానాన్ని ఢీ కొడుతున్నట్లు కనిపించే మబ్బులను వీక్షించవచ్చంటూ ఎమిరేట్స్ సంస్థ తన ఇన్స్టాగ్రాం ఖాతాలో ఆ విమానానికి సంబంధించిన ఫోటోలను ఫోస్ట్ చేసింది. ఈ విమానాలను 2020 కల్లా అందుబాటులోకి తెస్తున్నట్టు కూడా సంస్థ వెల్లడించింది. ఫోటోలు చూసి, వివరాలు చదివిన జనాలు ఇక ఎంచక్క ఆ విమానంలో ఎగిరి ఆకాశపు అందాలను చూద్దాం అంటూ కలలు కన్న వారిని నిద్ర లేపినట్టు ఈ రోజు ఏప్రిల్ ఒకటి అంటే ‘ఫూల్స్ డే’ అంటూ అందర్ని ఫూల్స్‌ని చేసేసింది. గతేడాది కూడా ఈ సంస్థ ఇలాగే ప్రపంచంలోనే అతిపెద్ద విమానం తెస్తున్నామని ప్రకటించింది. దాని పేరును ఏపీఆర్001 గా చెప్పి అందులో స్విమ్మింగ్ పూల్, ఆటల గది, పార్కు, జిమ్ ఉంటాయంటూ అందర్ని ఫూల్స్ చేసింది. Emirates reveals SkyLounge, the most exclusive Onboard Lounge to be introduced on its Boeing 777X fleet from 2020. A completely transparent lounge with unmatched aerial views and unparalleled luxury, Emirates SkyLounge promises window views like no other. A post shared by Emirates (@emirates) on Mar 31, 2018 at 1:24pm PDT -
ఫూల్స్ డేను ఇలా జరిపారు..
సాక్షి, న్యూఢిల్లీ : ఫూల్స్ డేను రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలకు వేదికగా చేసుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు ట్వీట్లతో ఒకరిపై ఒకరు విరుచుకుపడగా..పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రజలను మభ్యపెడుతున్నారని గుర్తుచేస్తూ శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) కార్యకర్తలు ఆదివారం ప్రజలకు డమ్మీ స్మార్ట్ ఫోన్లు, నగదు పంపిణీ చేశారు. తాము అధికారంలోకి వస్తే స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామని అమరీందర్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, హింస, అశ్లీలం, అభ్యంతరకర మెసేజ్‌లకు చెక్ పెట్టేందుకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలో నవజోత్ సింగ్ సిద్ధూ వైస్ ఛైర్మన్‌గా ప్రభుత్వం కల్చరల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన మరుసటి రోజే ఎస్ఏడీ వినూత్న నిరసనతో ముందుకురావడం గమనార్హం. ఈ కల్చరల్ కమిషన్‌కు ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపట్టే అధికారాలు కల్పించారు. Amritsar: Shiromani Akali Dal (SAD) workers distribute dummy smart phones & fake currency in the name of #Punjab govt, say, 'On #AprilFoolsDay, we want to remind Captain Amarinder Singh that he has fooled people.' pic.twitter.com/Mdpqwpx3cM — ANI (@ANI) 1 April 2018 -
బ్రేకింగ్.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి!
న్యూఢిల్లీ: ‘బ్రేకింగ్ న్యూస్.. మీ బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు జమ అయ్యాయి. ఒక్కసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.... కాకపోతే సున్నా పైసలని కనిపిస్తుంది..’’ !! ఇదీ.. ‘ఏప్రిల్ ఫూల్స్ డే’ని ‘జుమ్లా దివస్’గా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ.. అధికార బీజేపీపై సంధించిన తాజా సెటైర్. ‘‘నోట్లరద్దుతో అవినీతి అంతమైపోయింది..యువతకు ఏటేటా రెండు కోట్ల ఉద్యోగాలు దక్కాయి. స్వచ్ఛభారత్ స్ఫూర్తిని నీరవ్ మోదీ లాంటివాళ్లు ఇంకా ముందుకు తీసుకెళ్లారు. రైతులు రెట్టింపు లాభాలను ఆర్జిస్తున్నారు. ఇక నిత్యావసరాల ధరలు అన్ని వర్గాలకూ అందుబాటులోకి వచ్చేశాయి..’’ అంటూ కాంగ్రెస్ అధికారిక ట్విటర్లో పోస్టైన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. బీజేపీ కౌంటర్.. పప్పూ దివస్: కాంగ్రెస్ ‘జుమ్లా(మోసపూరిత వాగ్ధానాల) దివస్’ ప్రచారానికి ప్రతిగా బీజేపీ శ్రేణులు ఏప్రిల్ 1ని ‘పప్పూ దివస్’ను ముందుకు తెచ్చారు. రాహుల్ గాంధీని పప్పూగా అభివర్ణిస్తూ గతంలో ఆయన చేసిన పొరపాట్ల తాలూకు ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా రెండు జాతీయ పార్టీలు ‘ఫూల్స్డే’ను ఘనంగా జరుపుకుంటున్నాయి.. కాంగ్రెస్ రూపొందించిన వీడియో.. -
బ్రేకింగ్.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి!
-
నమ్మనివారే ఫూల్స్!
ఏప్రిల్ 1 రోజున బంధువులను, స్నేహితులను సరదాగా ఆటపట్టిస్తుంటారు. సన్నిహితులను సరదాగా ఆటపట్టించేందుకుగాను సంవత్సరంలో ఒకరోజు కేటాయించారు పెద్దలు. కానీ ఆ రోజు అన్ని సరదా కోసమే చేస్తారనుకోవద్దు, కొన్ని నిజమైనప్పటికీ మనం నమ్మం. నిజంగా ప్రమాదాలు ముచ్చుకొస్తున్న సంగతిని సన్నిహితులు చెప్పినప్పటికి ఇది ఫూల్స్ చేయడానికే అనుకోని ప్రమాదాల బారినపడ్డ సంగతులు కోకొల్లలు. అంతేకాదు బంపర్ ఆఫర్స్ వరించిన వారుకూడా ఫూల్స్ చేస్తున్నారన్న కారణంతో వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి కొన్ని సంగతులను ఈ రోజు తెలుసుకుందాం.....! అయితే ఫూల్.. లేకుంటే కారు.... ఏప్రిల్ 1, 2015.. న్యూజిలాండ్... ఉదయం లేచి పేపర్ చూసిన ప్రజలకు బీఎండబ్ల్యూ ప్రకటన కనబడింది. దాంట్లో ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా మీ పాత కారును తీసుకొచ్చి కొత్త బీఎండబ్ల్యూ కారును తీసుకెళ్లండని ప్రకటన వచ్చింది. కానీ అక్కడి ప్రజలు ఈ ప్రకటనను నమ్మి షోరూంకి వెళితే ఫూల్స్ అయిపోతామని ఎవరూ వెళ్లలేదు. టీనా మార్షా మాత్రం ఈ ప్రకటనను నమ్మింది. ప్రయత్నిస్తే వచ్చే నష్టం ఏమిలేదనుకున్న టీనా షోరూంకి వెళ్లింది. అయితే ఫూల్ లేదంటే బీఎండబ్ల్యూ కారుతో తిరిగొస్తానన్న నమ్మకంతో వెళ్లింది. మొదటగా బీఎండబ్ల్యూ బొమ్మకారును ఇస్తారనుకున్న టీనాకు షోరూం సిబ్బంది అశ్చర్యానికి గురిచేస్తూ 33 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును అందించారు. షోరూంకి తన 15 ఏళ్ల పాత నిస్సాన్ కారుతో వెళ్లినా టీనా కొత్త బీఎండబ్ల్యూ కారుతో ఇంటికి తిరిగొచ్చింది. ప్రభుత్వ హెచ్చరికను నమ్మలేదు.... ఏప్రిల్ 1, 1946కు రెండు, మూడు రోజుల ముందు నుంచి ఐస్లాండ్లో సునామీ వస్తుందని ప్రజలకు హెచ్చరికలు జారీచేస్తోంది ప్రభుత్వం. ఇదంతా మమ్మల్ని ఫూల్స్ చేయడానికే అని భావించారు అక్కడి ప్రజలంతా. ప్రభుత్వాన్నే ఫూల్స్ చేయాలనుకొని ఎవరూ ఇళ్లు ఖాళీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 1 తెల్లవారుజామున భయంకర శబ్ధాలు వినబడడంతో తన అన్న చెప్పింది నిజమనే నమ్మాడు ఓ వ్యక్తి. తెల్లవారుజామున 2 గంటలకు భయంకర సునామీ ప్రజల మీదకు విరుచుకుపడింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రజలందరూ పరుగు లంకించుకున్నారు. కొందరు ప్రాణాలతో బయటపడితే మరికొందరు ప్రాణాలు విడిచారు. దీనిలో దాదాపు 1300 ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాగా 159 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం మాటను పెడచెవిన పెట్టడంతో భారీ ఎత్తున నష్టపోవడంతోపాటు అపార ప్రాణనష్టంకూడా సంభవించింది. ఏప్రిల్ 1న ఫూల్స్ అవుతామన్న భావనతో ప్రభుత్వ హెచ్చరికను లెక్కచేయని కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి. కొందరు కుటుంబ సభ్యులను కోల్పోతే మరికొందరు గూడులేక రోడ్డున పడ్డారు. మార్విన్ గయే హత్య... ఏప్రిల్ 1, 1984న అమెరికాలోని ప్రముఖ గాయకుడు మార్విన్ గయేను తన తండ్రే హత్య చేశాడన్న వార్త దావనంలా వ్యాపించింది. కానీ దీన్ని అక్కడి ప్రజలేవరూ నమ్మలేదు. ఎందుకంటే ఆ రోజు ఫూల్స్ డే సందర్భంగా కావాలనే ఎవరో ఈ కట్టుకథ అల్లారని అనుకున్నారు. ఒక ఇన్సూరెన్సు పాలసీ డాక్యుమెంట్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది. చిన్నగా ప్రారంభమైన గొడవ పెద్దగా తయారైంది. మొదట మార్విన్ తన తండ్రిపై చేయిచేసుకున్నాడు. తీవ్ర కోపోద్రిక్తుడైన మార్విన్ తండ్రి తన దగ్గర ఉన్న పిస్తోల్‌తో మార్విన్ చాతీపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. రక్తపు మడుగులో పడిఉన్న మార్విన్‌ను సన్నిహితులు ఆసుపత్రికి చేర్చేలోపే తుదిశ్వాస విడిచారు. ఈ వార్తను ప్రజలు మొదట నమ్మలేదు. జీమెయిల్ ఒక జోక్ ఇప్పుడు మనం జీమెయిల్ లేని ప్రపంచాన్ని ఊహించలేం. జీమెయిల్ లేకుండా ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఇది నేటి పరిస్థితి... ఏప్రిల్ 1, 2004న గూగుల్ జీమెయిల్ లాంచ్ చేస్తున్నప్పుడు అందరూ దాన్నొక జోక్‌గా అనుకున్నారు. దీని యొక్క స్టోరేజ్ కెపాసీటీ 1 గిగాబైట్గా గూగుల్ చెబుతుంటే అందరూ నవ్వుకున్నారు. కానీ నేడు జీమెయిల్ అవసరం ప్రపంచానికి ఎంత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. – సాక్షి స్కూల్ ఎడిషన్ -
యువరాజుకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయి?
బరేలీ: ఎన్నికల ముందు మాత్రమే కాంగ్రెస్ పేదల జపం చేస్తుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 365 రోజులూ ఏప్రిల్ పూల్స్ డే పాటిస్తుందని ఎద్దే వా చేశారు. పేదరికంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా తిప్పికొట్టారు. యువరాజుకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయంటూ కౌంటర్ ఇచ్చారు. రైతులను, సైనికులను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. జై జవాన్, జై కిసాన్ స్ఫూర్తి యూపీఏకు తెలుసా అని ప్రశ్నించారు. యూపీఏ పాలనలో రైతులకు భరోసా లేదన్నారు. అందుకే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో సమాజ్‌వాది పార్టీ కుమ్మక్కయిందని ఆరోపించారు. ఇందులో భాగంగానే సోనియా, రాహుల్‌పై సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టలేదన్నారు.