'ఆస్కార్'‌ బరిలో జాతిరత్నాలు! | Know About Why Jathi Ratnalu Movie In List Of Oscars Nominations | Sakshi
Sakshi News home page

'ఆస్కార్'‌కు జాతిరత్నాలు!

Published Thu, Apr 1 2021 8:52 PM | Last Updated on Fri, Apr 2 2021 1:50 AM

Know About Why Jathi Ratnalu Movie In List Of Oscars Nominations - Sakshi

ఇటీవల వచ్చిన చిన్న సినిమా జాతిరత్నాలు పెద్ద హిట్టు సాధించింది. థియేటర్‌లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత కామెడీని పంచిన చిత్రం మరొకటి లేదనడంలో ఆశ్చర్యమేమీ లేదు. నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తాజాగా ఆస్కార్‌కు ఎంపికైందట. ఈ మేరకు ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన సర్టిఫికెట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

బెస్ట్‌ జానే జిగర్‌ మూవీ కేటగిరీ కింద ఈ సినిమాకు నామినేషన్‌ అయ్యిందని సంస్థ తెలియజేసింది. అయితే ఈ మధ్యే ఆస్కార్‌ అవార్డుల ప్రదానం అయిపోతే కొత్తగా జాతిరత్నాలు సినిమా నామినేట్‌ అవడమేంటి అని బుర్రలు బద్ధలు చేసుకున్నారు. కానీ కాసేపటికే వారికి అసలు విషయం అర్థమైంది. ఈ రోజు ఏప్రిల్‌ 1 కావడంతో అందరినీ ఏప్రిల్‌ ఫూల్‌ చేశారని తెలిసొచ్చింది. అలా ఈ రోజు మన జాతిరత్నాలు అందరినీ వెర్రివెంగళప్పలను చేశారన్నమాట!

చదవండి: చిట్టీ అని పిలుస్తుంటే భలేగా ఉంది: ఫరియా

ఏప్రిల్‌: రిలీజయ్యే కొత్త సినిమాలివే గురూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement