న్యూఢిల్లీ: ‘బ్రేకింగ్ న్యూస్.. మీ బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు జమ అయ్యాయి. ఒక్కసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.... కాకపోతే సున్నా పైసలని కనిపిస్తుంది..’’ !! ఇదీ.. ‘ఏప్రిల్ ఫూల్స్ డే’ని ‘జుమ్లా దివస్’గా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ.. అధికార బీజేపీపై సంధించిన తాజా సెటైర్.
‘‘నోట్లరద్దుతో అవినీతి అంతమైపోయింది..యువతకు ఏటేటా రెండు కోట్ల ఉద్యోగాలు దక్కాయి. స్వచ్ఛభారత్ స్ఫూర్తిని నీరవ్ మోదీ లాంటివాళ్లు ఇంకా ముందుకు తీసుకెళ్లారు. రైతులు రెట్టింపు లాభాలను ఆర్జిస్తున్నారు. ఇక నిత్యావసరాల ధరలు అన్ని వర్గాలకూ అందుబాటులోకి వచ్చేశాయి..’’ అంటూ కాంగ్రెస్ అధికారిక ట్విటర్‌లో పోస్టైన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
బీజేపీ కౌంటర్.. పప్పూ దివస్: కాంగ్రెస్ ‘జుమ్లా(మోసపూరిత వాగ్ధానాల) దివస్’ ప్రచారానికి ప్రతిగా బీజేపీ శ్రేణులు ఏప్రిల్ 1ని ‘పప్పూ దివస్’ను ముందుకు తెచ్చారు. రాహుల్ గాంధీని పప్పూగా అభివర్ణిస్తూ గతంలో ఆయన చేసిన పొరపాట్ల తాలూకు ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా రెండు జాతీయ పార్టీలు ‘ఫూల్స్‌డే’ను ఘనంగా జరుపుకుంటున్నాయి..
కాంగ్రెస్ రూపొందించిన వీడియో..
Comments
Please login to add a commentAdd a comment