టీచర్ పై గ్యాంగ్ రేప్
లక్నో: బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ ఘటన మరకముందే ఉత్తరప్రదేశ్ లో మరో అఘాయిత్యం చోటు చేసుకుంది. ఉధ్యాయురాలిని అపహరించుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బరేలిలోని 24వ హైవేకు సమీపంలో మంగళవారం జరిగింది. పాఠశాలకు వెళుతున్న టీచర్ ను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసిన ఇద్దరు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులో ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి పారిపోయారు.
ఈ దురాగతాన్ని వీడియో తీశారు. దీని గురించి ఎక్కడైనా వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బాధితురాలిని బెదిరించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సీబీ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేశ్ సింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది.